Janaki Kalaganaledu June 9th Episode: కొంపముంచిన మల్లిక.. జ్ఞానాంబ ఆదేశాలకు జానకి అవుట్!

జానకి కలగనలేదు సీరియల్ త్వరలోనే టాప్ రేటింగ్స్ అందుకునే సీరియల్ గా నిలవడం కాయంగా కనిపిస్తోంది. రోజురోజుకు సీరియల్ కు కనెక్ట్ అవుతున్న ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తోంది. మొదటి ఎపిసోడ్స్ తోనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అత్త కోడళ్ల మధ్య కెమిస్ట్రీని విబిన్నంగా ప్రజెంట్ చేస్తూ ప్రతిరోజు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. జానకి - రామచంద్ర క్యూట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, అలాగే భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 58వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఓర చూపుతో చంపేస్తోన్న రాశీ ఖన్నా...

ఎదో ఒక పొరపాటు చేయాలని

ఎదో ఒక పొరపాటు చేయాలని

జ్ఞానాంబ సంతానలక్ష్మి పూజ చేయడం కోసం ఏర్పాట్లు సిద్ధం చేయగా ముందు నుంచి మల్లిక ఎదో ఒక పొరపాటు చేయాలని కుట్ర పన్నుతుంది. పూజ పూర్తయ్యాక సాయంత్రం వరకు కూడా అందరూ ఉపవాసం ఉండమని చెప్పడంతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని మల్లిక వినయంగా చెబుతుంది. కానీ తన మనసులో మాత్రం ఏదో ఒకటి తినాలని ముందు నుంచే ప్లాన్ వేసుకుంటుంది.

తలనొప్పి అంటూ సాకులు

తలనొప్పి అంటూ సాకులు

వెంటనే మల్లిక అత్త మాటను పట్టించుకోకుండా ఆన్లైన్ లో ఏదైనా బుక్ చేసుకోవాలని అనుకుంటుంది. అనుకున్నట్లే చికెన్ పిజ్జా బుక్ చేసుకుంటుంది. ఇక పూజ జరుగుతున్న మధ్యలో మల్లిక తలనొప్పి అంటూ సాకులు చెప్పి లేచి వెళ్లిపోవాడనికి ప్రయత్నం చేస్తుంది. కానీ జ్ఞానంబ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూజ అయిపోయే వరకు లేచేది లేదని హెచ్చరిస్తుంది.

 బయటకు వెళ్లి చికెన్ పిజ్జా తెచ్చుకొని..

బయటకు వెళ్లి చికెన్ పిజ్జా తెచ్చుకొని..

ఇక సడన్ గా డెలివరీ బాయ్ వస్తే ఎలా అని కంగారు పడిన మల్లిక పూజా అయిపోగానే డెలివరీ బాయ్ ఫోన్ చేయడంతో ఇంటి బయటకు వెళ్లి చికెన్ పిజ్జా తీసుకుంటుంది. ఈ క్రమంలో జ్ఞానాంబ పూజరికి దక్షిణ ఇవ్వాలని పిలిచినా కూడా రాదు. అప్పుడు జ్ఞానాంబ జానకి, రామ లతో ఇప్పిస్తుంది.

బయటపడిన అసలు నిజం

బయటపడిన అసలు నిజం

ఇక పూజరిని సాగనంపే క్రమంలో అందరూ బయటకు రాగా డెలివరీ బాయ్ ఇంకా అక్కడే బైక్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో సడన్ గా అతను రామ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు అని పాత పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అందరిని పరిచయం చేయగా మల్లికను చూసి చికెన్ పిజ్జా తెప్పించుకున్న విషయాన్ని బయటపెట్టేస్తాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లిపోడంతో..

ఇంటి నుంచి బయటకు వెళ్లిపోడంతో..

మొత్తానికి జ్ఞానాంబకు అసలు విషయం తెలుస్తుంది. దీంతో మళ్ళీ బయటకు పంపించాలి అనే చర్చ మొదలవుతుంది. మల్లిక బ్రతిమాలుకుంటూ ఉండగా ఈసారి బయటకు వెళ్లాల్సింది మల్లిక కాదు జానకి అంటూ జ్ఞానాంబ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. జానకికి ఈ ఇంట్లో ఎవరిని సమర్దించాలి.. ఎవరిని సమర్దించకూడదు అనే విషయం తెలియాలి అని జ్ఞానాంబ అదేశిస్తుంది. ఇక మొత్తానికి జానకి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఇక ఆమెను మళ్ళీ వెనక్కి పిలుస్తారా? రామచంద్ర భార్య కోసం ఏం చేశాడు అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X