Janaki Kalaganaledu June 9th: వంటల పోటీల్లో రామచంద్రకు చేదు అనుభవం.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన జ్ఞానాంబ

జానకి కలగనలేదు ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జానకి చదువు కోసమే కన్నబాబు దగ్గర రామచంద్ర లక్ష రూపాయలు అప్పు చేసిన రామచంద్ర ఎలాగైనా ఆ అప్పుని తీర్చాలని అనుకుంటాడు. ఇక ఆ అప్పును తీర్చేందుకు ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని కూడా అనుకుంటాడు. మరోవైపు కన్నబాబు, రామచంద్ర స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా ప్రయత్నం చేసాడు. ఇక జానకి తన భర్తను వంటల పోటీల్లో గెలిపించేందుకు ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 319వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

గౌరవంగా ఉండాలని..

గౌరవంగా ఉండాలని..


తన భర్తను ఎలాగైనా నేషనల్ చెఫ్ కాంపిటీషన్లో గెలిపించేలా చేయాలి అనే జానకి ఎంతగానో ఆలోచిస్తుంది. అయితే పరిస్థితులు ఆమెకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా అత్త గారిని ఒప్పించి మరి భర్త రామచంద్రను హైదరాబాదుకు తీసుకు వెళుతుంది. ఈ క్రమంలో ఆమెకు మల్లికా నుంచి కూడా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి. అయినా కూడా జానకి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతూ ఉంటుంది. కాంపిటీషన్ లో భర్తను గెలిపించి అందరి ముందు గౌరవంగా నిలబెట్టాలని జానకి తాపత్రయపడుతోంది. అందుకు రామచంద్ర తండ్రి కోడలికి ఎంతగానో సహాయం చేస్తాడు.

జానకి సలహాలు

జానకి సలహాలు

ఇక అనుకున్నట్లుగానే రామచంద్రను హైదరాబాద్ తీసుకు వెళ్లిన జానకి అతన్ని వంటల పోటీలకు పూర్తిగా సిద్ధం అయ్యేలా చేస్తుంది. అయితే మొదటి రౌండ్లోనే రామచంద్ర అనుకోని విధంగా ఒక మంచి పని వల్ల తదుపరి రౌండ్ లోకి సెలెక్ట్ అవుతాడు. అయితే సెకండ్ రౌండ్ లో వెస్ట్రన్ ఫుడ్ ప్రిపేర్ చేయాలనీ అనడంతో రామ ఆశ్చర్యపోతారు. అలాంటి పదం కూడా తాను ఎప్పుడూ వినలేదు అని అంటాడు. అయినప్పటికీ కూడా జానకి అతనికి ఒక సలహా ఇస్తుంది. నేను సోషల్ మీడియాలో ఒక ఫుడ్ తయారు చేయడం చూశాను అని దాన్ని నేను చెప్పినట్లుగా తయారు చేయండి అని అంటుంది.

మెదట్లోనే చేదు అనుభవం

మెదట్లోనే చేదు అనుభవం

అయితే రామచంద్ర అదే తరహాలో ఒక వంటకాన్ని తయారు చేస్తాడు. ఆ వంటకాన్ని రుచి చూసిన తర్వాత జడ్జీలు ఆశ్చర్యపోతారు. అసలు డిష్ ఇంకా పూర్తి కాలేదు అని ప్రభ రమేష్ చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇలాంటి వంటకాలు నేను ఎప్పుడు చేయలేదు అని అనడంతో ఆ మాటలు ఇక్కడ అనకూడదని వంటల పోటీలకు వచ్చేటప్పుడు అన్ని రకాల వాటిని తయారు చేసే విధంగా ఉండాలి అని ఆమె సలహా ఇస్తారు. నెక్స్ట్ రౌండ్ లోకి లోకి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెబుతారు.

వెనుకబడిన రామ

వెనుకబడిన రామ

ఇక మార్కుల విషయంలో రామచంద్ర అందరికంటే పూర్తిగా వెనకబడతాడు. ఇక అందరి కంటే తక్కువ మార్కులతో రామచంద్ర ఉన్నాడు అని రేపటి రౌండ్ లో అతను అందరికంటే బెస్ట్ ఇవ్వకపోతే ఎలిమినేట్ అవుతారు అని కూడా న్యాయ నిర్ణేతలు వివరణ ఇస్తారు. ఇక జానకి ఆలోచనలో పడుతుంది. ఇక టీవీలో ప్రోగ్రాం చూస్తున్నా జ్ఞానాంబ కూడా కొడుకు పడుతున్న ఇబ్బందులను చూసి ఆవేదన చెందుతుంది. అతను ఇలాంటి బాధను ఎదుర్కొనలేడు అని ఎలాగైనా తన కొడుకును బాధపడకుండా చూడాలి అని ఆమె ఆలోచిస్తుంది.

రామచంద్ర కాన్ఫిడెన్స్

రామచంద్ర కాన్ఫిడెన్స్

ఇక మరోవైపు జానకి కూడా తన భర్త మొదటి రౌండ్ లో పూర్తిగా వెనుకబడడంతో విచారణలో ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా జానకికి సంబంధించిన ఐపీఎస్ పుస్తకాన్ని పట్టుకొని సరదాగా కామెడీ చేస్తూ ఉంటాడు. అయితే ఈ సమయంలో తాను నవ్వలేను అని చెప్పడంతో రామచంద్ర అలాంటి టెన్షనే పెట్టుకోవద్దని రేపటి రౌండ్లో నేను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తాడు. ఈ క్రమంలో తినడానికి ఏమైనా తీసుకు వస్తాను అని ముందుకు వెళతాడు.

రామచంద్రకు అవమానం

రామచంద్రకు అవమానం

అయితే అప్పుడే పోటీలలో పాల్గొన్న ఒక అమ్మాయి రామ చంద్రని చూసి హేళన చేస్తూ ఉంటుంది. ఈ నేషనల్ చెఫ్ కాంపిటీషన్లో నువ్వు గెలవలేవు అని వెళ్లి ఊర్లో మిర్చిలు పునుగులు వేసుకోవాలి అని హేళన చేస్తూ ఉంటారు. వెంటనే జానకి కలుగజేసుకుని తన భర్త గురించి నీకు ఏమి తెలుసు అని అలా మాట్లాడుతున్నారు నా భర్త గురించి ఒక్క మాట అనే అర్హత కూడా మీకు లేదని కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిత్వం ఆయనది అంటూ జానకి ఎంతో గొప్పగా చెబుతుంది.

జ్ఞానాంబ సడన్ ఎంట్రీ

జ్ఞానాంబ సడన్ ఎంట్రీ

ఇక జానకి అలా చెప్పగానే వారు ఒక్కసారిగా వారు అవమానంతో తలదించుకుంటారు. ఆ తర్వాత జానకి తన భర్తను అక్కడి నుంచి తీసుకువెళుతుంది. ఇక తర్వాత రోజు పోటీలకు సిద్దమైన రామచంద్రకు సంతోషం కలిగే అవకాశం వస్తుంది. ఇక ఈ రౌండ్ కంటెస్టెంట్ ఛాయిస్ అని ఎలాంటి వంటకాన్ని తయారు చేస్తారో మీ ఇష్టం అని న్యాయనిర్ణేతలు చెప్పడంతో రామచంద్ర ఆనందపడతాడు. అంతేకాకుండా జానకి మరోసారి భర్తకు సలహాలు ఇస్తుంది. ఇష్టమైన వంటకం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన వంటకాన్ని తయారు చేయాలి అని చెబుతుంది. ఇక అదే సమయంలో రామచంద్ర తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు. మరి జ్ఞానాంబ రామచంద్రని అక్కడి నుంచి తీసుకు వెళుతుందా లేక సపోర్ట్ చేస్తుందా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X