Janaki Kalaganaledu march 10th: జ్ఞానాంబకు గుండె బద్దలయ్యేలా నిజం చెప్పిన జానకి.. మరో పవర్ఫుల్ లాజిక్

జానకి కలగనలేదు సీరియల్ లో రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో ఈ సీరియల్ అంతగా కనెక్ట్ అవ్వడం లేదు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. సీనియర్ నటి రాశి కూడా జ్ఞానాంబ పాత్రలో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక జానకి రామ చంద్ర పాత్రల మధ్యలో కొనసాగే క్యూట్ లవ్ స్టొరీ చాలా బ్యూటీఫుల్ గా ఉంది. అయితే ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన భర్త సహకారంతో నైట్ కోచింగ్ క్లాసెస్ కు వెళుతుంది. ఇక మరోవైపు మల్లిక నుంచి వారికి సరికొత్త సవాళ్లు ఎదురావుతుంటాయి.

అలాగే జానకి అత్త జ్ఞానాంబ నుంచి కట్టుబాట్లతో ఆంతర్యం ఏర్పడుతుంది. చదువుకున్న కోడలు తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు అని ముక్కు సూటిగా చెప్పిన చెప్పిన జ్ఞానాంబ తనకు కోడలు వారసులను మాత్రమే ఇవ్వాలని అంటుంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 254 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ముందే తెలుసుకుందాం పదండి.

ప్రతీ విషయంలో భార్యకు అండగా..

ప్రతీ విషయంలో భార్యకు అండగా..

జానకి ఎలాగైనా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఎన్నో కలలు కంటుంది. ఆమెకు తోడుగా రామచంద్ర కూడా ప్రతి విషయంలో ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు రామచంద్ర తల్లి జ్ఞానాంబ మాత్రం చదువుకున్న కోడలు వద్దని, జానకి వారసులను ఇస్తుంది అని ఎంతగానో ఎన్నో ఆశలు పెట్టుకుంది. హఠాత్తుగా జానకికి వాంతులు రావడంతో జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది.

జానకి నెల తప్పింది అంటూ అందరికీ ఆనందంగా చెప్పుకుంటుంది. గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. కానీ నిజంగా జానకి కడుపుతో వాంతులు చేసుకోదు. ఆమెకు ముందురోజు తిన్న ఆహారం అరగకపోవడంతో హఠాత్తుగా వాంతులు అవుతాయి.

ఆనందంతో జ్ఞానాంబ..

ఆనందంతో జ్ఞానాంబ..

జానకి నెల తప్ప లేదు అని భర్త రామచంద్ర తల్లిదండ్రులకు ఎంతో చెప్పాలని చూస్తాడు. కానీ వారు మాత్రం అసలు నిజం తెలుసుకోకుండా జానకి నిజంగానే గర్భం దాల్చింది అని అందుకే వాంతులు చేసుకుంటుంది అని ఊహించుకుంటారు.

ఇక జ్ఞానాంబ నిజం ఏమిటో తెలియక ముందే ఊర్లో వారికి కూడా ఆ విషయం ఆనందంగా ఉంచెబుతుంది. ఇక జ్ఞానాంబను అలా చూసిన జానకి రామ ఇద్దరు కూడా ఆందోళన చెందుతారు. అసలు నిజం తెలిస్తే ఆమె తట్టుకుంటుందా అని మళ్ళీ వెనుకడుగు వేస్తారు.

నిజం చెప్పాలని..

నిజం చెప్పాలని..

ఇక రామ జానకి ఇద్దరు ఆ విషయంలో ఆందోళన చెందుతూ స్వీట్ షాప్ దగ్గర ఉండగా అప్పుడే జ్ఞానాంబ ఇంటి నుంచి ఫోన్ చేసి తొందరగా రావాలని అంటుంది. ఇక ఆ విషయంలో మరింత ఆందోళన చెందిన రామ జానకి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అసలు నిజం చెప్పాలని ట్రై చేస్తారు.

కానీ జ్ఞానాంబ మాత్రం అవేమి పట్టించుకోకుండా జానకికి ఆరోగ్యానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక డాక్టర్ తో కూడా మాట్లాడినట్లు గోవిందరాజులు కూడా చెబుతాడు. ఇక వీరి ఆప్యాయతలను చూసిన మల్లిక మనసులో చాలా కుల్లుకుంటుంది.

మరో షాక్ ఇచ్చిన రామ

మరో షాక్ ఇచ్చిన రామ

ఇక గుడిలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం అంటూ జ్ఞానాంబ తన కొడుకును తండ్రితో కలిసి గుడికి వెళ్లాలని అంటుంది. ఇక తాను మాత్రం జానకితో హాస్పిటల్ కు వెళ్లాలని అనుజునటున్నట్టుకు జ్ఞానాంబ చెబుతుంది. ఇక రామ చంద్ర అప్పుడే తండ్రితో బయటకు వచ్చిన అనంతరం అసలు నిజం చెబుతాడు.

జానకి నెల తప్పలేదు అని రాత్రి తిన్న బోజనం అజీర్ణం కావడం వలన వాంతులు చేసుకుందని అంటాడు. ఇక రామ అలా చెప్పగానే గోవిందరాజులు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీ అమ్మ మనవడు మనవరాలి కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. తను ఇంత ఆనందంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ నిజం చెబితే తట్టుకుంటుందా అని గోవిందరాజులు ప్రశ్నిస్తాడు.

అసలు నిజం చెప్పిన జానకి

అసలు నిజం చెప్పిన జానకి

ఇక మీరే ఎదో ఒక విధంగా అమ్మకు నిజం చెప్పి నచ్చజెప్పాలని రామ తండ్రి గోవిందరాజులును ప్రాధేయపడతాడు. ఇక ఆ తరువాత గోవిందరాజులు నిజం చెప్పాలని అనుకుంటూ ఉండగా జ్ఞానాంబ ఇంకా గుడికి వెళ్లలేదా అని అడుగుతుంది. ఇక ఓపిక పట్ట లేక జానకి అసలు నిజాన్ని చెబుతుంది. అనంతరం గోవిందరాజులు వారు పడుతున్న ఆవేదన గురించి కూడా వివరణ ఇస్తాడు.

అలాగే ఈ విషయంలో మల్లిక చాలా ఆనందానికి గురి అవుతుంది. వాళ్ళు ఇద్దరు ఏ మాత్రం సంతోషంగా ఉండకూడదు అని అనుకున్న మల్లికకు గొడవలు క్రియేట్ చేసేందుకు మరో పట్టు దొరికినట్లు అయ్యింది. ఇక నిజం తెలుసుకున్న జ్ఞానాంబ ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది.

జ్ఞానాంబ ప్రశ్న

జ్ఞానాంబ ప్రశ్న

ఈ విషయాన్ని వాళ్ళు నీకు ముందు నుంచే చెప్పాలని చూస్తున్నారు అంటూ కొడుకు కోడలు చాలా బాధపడుతున్నారని గోవిందరాజులు జ్ఞానాంబను కూల్ చేసే విధంగా మాట్లాడతాడు. ఇక జ్ఞానాంబ ఆ తరువాత మీరు ఇప్పుడప్పుడే పిల్లలను వద్దని అనుకుంటున్నారా? అని అడుగుతుంది. మరి ఆ ప్రశ్నకు జానకి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. ఇక జానకి తన ఐపీఎస్ చదువును పూర్తి చేసేందుకు పిల్లల్ని వద్దనుకుంటున్న కారణాన్ని జ్ఞానాంబ దగ్గర ఇంకా ఎన్ని రోజులు దాస్తుందో తదుపరి ఎపిసోడ్స్ లో అర్ధమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X