Janaki Kalaganaledu march 14th: మల్లిక మోసాన్ని పసిగట్టిన జానకి.. అయినా వెనకడుగు వేయని విలన్!

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు ఐపీఎస్ చదువు మరోవైపు అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఇలా సమస్యల నడుమ జానకి అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. అలాగే చిన్న కోడలు మల్లిక కూడా జానకిపై ఎప్పటికప్పుడు రివెంజ్ ప్లాన్ చేస్తుంటుంది. జానకి ఐపీఎస్ చదువు పూర్తి అయ్యే వరకు కూడా పిల్లలను కనవద్దు అని అనుకుంటుంది. కానీ ఆమె అత్త జ్ఞానాంబ మాత్రం త్వరగా మనవడు మనవరాళ్ళ తో గడపాలని ఆశ పడుతుంది.

అందుకోసం జానకితో ఎన్నో పూజలు నోములు కూడా చేయిస్తుంది. కానీ జానకి అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తూ ఉంటుంది. ఇక తనకంటే ముందు తొడి కోడలికి ఏ మాత్రం పిల్లలు కావద్దు అని మల్లిక దారుణమైన ఆలోచనకు సిద్ధమవుతోంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 256 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో తెలుసుకుందాం పదండి.

పిల్లలు పుట్టకుండా

పిల్లలు పుట్టకుండా

జ్ఞానాంబ తన పెద్దకోడలు జానకిని ఎక్కువగా ఆప్యాయంగా చూస్తుంది అని చిన్న కోడలు మల్లిక ఏ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఇక జానకికి మొదట పిల్లలు పుడతారు అని జ్ఞానాంబ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అయితే జానకికి ఏ మాత్రం పిల్లలు పుట్టకుండా ఉండాలని మల్లిక దారుణమైన ఆలోచనకు వస్తుంది.

నీలావతి సహాయంతో ఒక నాటు వైద్యుడి దగ్గర మందులు తీసుకుని జానకికి ఇవ్వాలని అనుకుంటుంది. జానకికి శాశ్వతంగా పిల్లలు పుట్ట కూడదు అని నీలావతి మల్లికా ఇద్దరు కూడా నాటు వైద్యుడికి డబ్బులు ఇచ్చి మరీ పాపానికి ఒడిగట్టాలని అనుకుంటారు.

నాటు వైద్యంతో..

నాటు వైద్యంతో..

మల్లిక మాత్రం తనకు మొగపిల్లోడు పుట్టాలని నాటువైద్యం తీసుకోవాలని అనుకుంటుంది. ఇక ఈ క్రమంలో నాటు వైద్యుల దగ్గరికి వెళ్లిన తర్వాత జానకికి కొంచెం అనుమానం వస్తుంది. ఇక ఆ తర్వాత మల్లిక ఇంటికి వెళ్తాను అని చెప్పినప్పటికీ జానకి మాత్రం నేను తర్వాత వస్తాను అని అంటుంది.

అంతా సవ్యంగా సాగింది అని అనుకున్నా మల్లిక ఇంటికి వచ్చేస్తుంది. అయితే జానకి ఎక్కడ అని గోవిందరాజులు జ్ఞానాంబ అడగడంతో నాకు తెలియదు అని మల్లిక చెబుతుంది. ఇక ఆమెకు తిరుగుడు చాలా అలవాటు అని లేనిపోని నిందలు వేయాలని అనుకుంటుంది. ఇక ఆ మాటలు ఏ మాత్రం నమ్మని గోవిందరాజు మల్లిక నోరు ముయిస్తాడు.

వెన్నెల నిశ్చితార్థం..

వెన్నెల నిశ్చితార్థం..

అదే సమయంలో జ్ఞానాంబ అలాగే గోవిందరాజులు కూడా వారి కూతురు వెన్నెల పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. మా అమ్మ మైరావతి తన ఊర్లోనే వెన్నెల కు నిశ్చితార్థం నిర్వహించాలని అనుకుంటుంది అని గోవింద రాజులు చెప్పడంతో అందుకు జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. ఇక వెంటనే మరుసటి రోజు అందరూ కూడా ఊరికి వెళ్లడానికి సిద్ధమవుతారు. చేయాల్సిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి అని తన కొడుకు రామచంద్రకు కూడా చెబుతుంది.

మోసాన్ని పసిగట్టిన జానకి

మోసాన్ని పసిగట్టిన జానకి

ఇక మరోవైపు జానకి నాటు వైద్యుడు పని పట్టేందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అతను అమాయక జనాలను మోసం చేస్తూ తప్పుడు మూలికలను కూడా ఇస్తున్నాడు అని అంటుంది. తనకు కావాలని పిల్లలు పుట్టకుండా మందులు ఇచ్చాడు అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని వెంటనే పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే జానకి తనకు పిల్లలు పుట్టకుండా ఎందుకు చేయాలని అనుకుంటున్నాను అని నాటు వైద్యుడిని అడగడంతో మీ తోటి కోడలు మల్లికనే అలా చెప్పి తనకు డబ్బులు ఇచ్చింది అని చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

మల్లికకు హెచ్చరిక

మల్లికకు హెచ్చరిక

వెంటనే ఇంటికి వెళ్లి మల్లిక అసలు నిజస్వరూపం బయట పెట్టాలని అనుకుంటుంది. కానీ అప్పుడు తెల్లవారుజామున నిశ్చితార్థం ఉంది కాబట్టి ఏమీ అనకుండా సైలెంట్ అవుతుంది. జ్ఞానాంబకు అసలు నిజం చెప్పకుండా నాటు వైద్యుడి మందులు అన్నీ కూడా అబద్ధమే అని అతను అందరినీ మోసం చేస్తున్నాడు అని చెబుతోంది. జ్ఞానాంబ కూడా జానకిని నమ్ముతుంది.అతి ప్రేమ కారణంగా మీరు పెద్ద ఇబ్బందులు పడి ఉండేవారని తనకు తానే బాధపడుతుంది. ఇక ఆ తర్వాత జానకి మల్లిక కు వార్నింగ్ ఇస్తుంది మరొకసారి ఇలాంటి పనులు చేయాలని చూస్తే అందరి ముందు నిజం బయట పెడతాను అని తన కోపాన్ని పరీక్షించవద్దు అని కూడా హెచ్చరిస్తుంది. అయినా కూడా మల్లిక ఆ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరొక ప్లాన్ వేయాలని అనుకుంటుంది.

Recommended Video

Vijay Ram, Shivasakthi@Amaram Akhilam Prema Music Launch Event- Part 02
అడ్డుపడిన మైరావతి

అడ్డుపడిన మైరావతి

ఇక అంతా సవ్యంగా సాగింది అనుకుంటున్న సమయంలో మల్లిక వెన్నెల నిశ్చితార్థం చెడగొట్టి వెన్నెలలో తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రణాళిక రచిస్తుంది. కానీ వెన్నెల మాత్రం తను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుండటంతో చాలా సంతోషంగా ఉంటుంది. జానకి కారణంగా వెన్నెల ప్రేమ పెళ్లి.. పెద్దలు కుదిర్చిన వివాహంగా జరుగుతున్న విషయం మల్లికకు తెలుస్తుంది.

ఆ తర్వాత జానకిపై ఈ నిజంతో ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచనలో పడుతుంది. ఇక ఆ తర్వాత వెన్నెల నిశ్చితార్థం మైరావతి ఇంటి వద్ద జరిపించాలని గోవింద రాజులు నిర్ణయించడంతో అందరూ అక్కడికి వెళ్తారు. అయితే మైరావతి మాత్రం అందరినీ ఇంట్లోకి పిలుస్తూ జానకికి మాత్రం అడ్డు పడుతుంది. ఆ విషయంలో మైరావతి ఏ విధంగా ఆలోచిస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X