Janaki Kalaganaledu march 15th: మైరావతి ప్రమాదంలో జానకి.. వెన్నెల లవ్ మ్యాటర్ లో న్యూ ట్విస్ట్!

జానకి కలగనలేదు రేటింగ్స్ అందుకోవడంతో రోజురోజుకు మిగతా సీరియల్స్ ను కూడా డామినేట్ చేస్తోంది. ఈ సీరియల్ కాన్సెప్ట్ జనాలకు మొదటి నుంచే బాగా కనెక్ట్ అయ్యింది. ఎలాగైనా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకున్న జానికికి అత్తగారి ఇంటి నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎవరికి తెలియకుండా చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకికి ఇంట్లో సమస్యలు కూడా ఇబ్బందిగా మారుతుంటాయి. వెన్నెల పెళ్లి విషయంలో కూడా జానకి ఎవరూ ఊహించని విధమైన నిర్ణయం తీసుకుంటుంది. జ్ఞానాంబ చిన్నకూతురు వెన్నెల, దిలీప్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఇక జ్ఞానాంబ ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో జానకి వారి పెళ్లిని పెద్దలు కుదిర్చిన వివాహం గా చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికీ తెలియకుండా ఆ పెళ్లిని ముగించాలి అనుకుంటున్న సమయంలో మరో కొత్త సమస్య ఎదురవుతుంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 257 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో తెలుసుకుందాం పదండి.

 జానకి ప్లాన్ తో వెన్నలకు పెళ్లి

జానకి ప్లాన్ తో వెన్నలకు పెళ్లి

తను ప్రేమించిన వాడు దక్కకపోతే వెన్నెల చనిపోవడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో జానకి తన భర్తతో కలిసి వెన్నెలను అలాగే అతని ప్రియుడిని ప్రాణాలకు తెగించి కాపాడుతారు. మరొకవైపు వెన్నెల కు ప్రేమ పెళ్లి చేయడానికి జ్ఞానాంబ ఏ మాత్రం ఇష్టం ఉండదు. అయితే ఆమె జ్ఞానాంబ దిలీప్ ను చూడకపోవడంతో ఎవరికీ తెలియదు కాబట్టి అతను తన దగ్గరికి కుటుంబ సభ్యుల వ్యక్తి అని పెద్దలు కుదిర్చిన పెళ్లిగా చేయాలని జానకి డిసైడ్ అవుతుంది. మొత్తానికి జానకి నిశ్చితార్థానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇక అంతా సవ్యంగా సాగి పోతుంది అనుకున్న సమయంలో మల్లికకు అసలు నిజం తెలుస్తుంది.

మల్లికకు అనుమానం

మల్లికకు అనుమానం

వెన్నెలకు ఎలాగైనా తన తమ్ముడు పండు గాడి కి ఇచ్చి పెళ్లి చేయాలని చేయాలని మల్లిక అనుకుంటోంది. కానీ మరొకవైపు జానకి వెన్నెలకు తన కుటుంబ సభ్యుల కు సంబంధించిన అబ్బాయిని చూసినట్లుగా చెప్పడంతో అసూయ చెంసుతోంది. అయితే ఆ వివాహంపై అనుమానం వచ్చి వెన్నెల ద్వారానే మల్లిక అసలు నిజం తెలుసుకుంటుంది. ప్రేమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన వివాహం గా జానకి చాలా తెలివిగా జరిపిస్తుంది అనే విషయాన్ని ఎలాగైనా బయటపెట్టి ఆమెపై పగ తీర్చుకోవాలని కూడా ఆలోచిస్తుంది.

మైరావతి ఇంట్లో..

మైరావతి ఇంట్లో..


ఇక వెన్నెల పెళ్లిని మా అమ్మ గారి ఇంటి దగ్గరే జరిపించాలని గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబకు చెబుతాడు. నిశ్చితార్థం వేడుకల కూడా మా అమ్మగారి దగ్గర ఉండి చూసుకోవాలని అనుకుంటున్నారు అని చెప్పడంతో జ్ఞానాంబతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒప్పుకుంటారు. ఇక మరుసటి రోజు వారు అందరూ కూడా గోవిందరాజులు తల్లి మైరావతి ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అవుతారు. అయితే ఇంటికి రాగానే మైరావతి అందరి తోనూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. కానీ జానకితో మాత్రం ఆమె ప్రేమగా మాట్లాడకుండా పాత గొడవలు దృష్టిలో పెట్టుకుని దూరంగానే పెడుతుంది.

జానకిపై మైరావతి ఆగ్రహం

జానకిపై మైరావతి ఆగ్రహం

ఇదివరకే మూడుసార్లు జానకిని ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకున్న మైరావతి మాటను జ్ఞానాంబ లెక్కచేయకుండా ఆలోచిస్తుంది. ఆ విషయంలోనే మైరావతి జానకిపై మరింత కోపాన్ని పెంచుకుంటుంది. ఇక అందరిని ఇంట్లోకి పిలిచిన మైరావతి జానకికి మాత్రం అడ్డుకుంటుంది. అందరూ ఇంట్లో కి వెళ్ళాలి అని జానకితో మాత్రం నేను ప్రత్యేకంగా మాట్లాడాలి అని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఇక ఆ తర్వాత మైరావతి జానకితో మాట్లాడుతూ.. నా కోడలు జ్ఞానాంబ నా మాటకు ఎంతో గౌరవం ఇస్తుంది. అలాంటిది నీ విషయంలో మాత్రం నా మాట అసలు వినలేదు. అయినా నువ్వు చూసిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంది అంటే అందులో ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అని అనుమానిస్తుంది.

 నిన్ను ఎవరూ కాపాడలేరు

నిన్ను ఎవరూ కాపాడలేరు

నీ అత్త జ్ఞానాంబ నీ చేతుల్లో ఉండాలి అంటే వెన్నెలకు మీ కుటుంబంలో కి రప్పించాలి అని అనుకున్నాను. అంతే కదా అని మైరావతి అనమానిస్తుంది. కానీ జానకి మాత్రం అలాంటిది ఏమీ లేదు అని చెప్పినప్పటికీ మైరావతి జానకి మాటలను పట్టించుకోదు. అయితే వెన్నెల కు వచ్చిన సంబంధంలో ఏదైనా పొరపాటు ఉన్నట్లు తెలిస్తే మాత్రం వెంటనే నిశ్చితార్థం రోజే సంబంధం క్యాన్సల్ చేస్తాను అని కూడా మైరావతి చెబుతుంది. అంతే కాకుండా ఆ తర్వాత నిన్ను ఎవరూ కాపాడలేరు అని కూడా హెచ్చరిక చేయడంతో జానకి ఆందోళన చెందుతుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర ఆ విషయంలో జానకి ధైర్యం చెప్పి అలాంటిది ఏమీ జరగదు అని అంటాడు.

Recommended Video

Jabardasth Vinod Comments On The TV Show || అసలు విషయం బయటపెట్టిన వినోద్!
 నిజం తెలిసే అవకాశం..

నిజం తెలిసే అవకాశం..

ఇక అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మరొకవైపు దిలీప్ ఇంటి దగ్గర ఉండే ఒక వ్యక్తి సడన్ గా మైరావతి దగ్గరికి వస్తాడు. అతను అందరితో చాలా సరదాగా మాట్లాడుతూ చివరికి వెన్నెలను అలా చూడగానే మీరు దిలీప్ ప్రేమించుకున్నారు కదా అని అంటాడు. అంతే కాకుండా ఇది ప్రేమ వివాహం కదా అని అతను అనుమానిస్తాడు. దీంతో వెంటనే అందరూ షాక్ అవుతారు. ఇక ఆ విషయం తెలిస్తే జానకి పై మైరావతి రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X