Janaki Kalaganaledu march 16th: మతిమరుపు ట్విస్టుతో బయటపడిన జానకి.. మల్లికకు మరో షాక్

జానకి కలగనలేదు సీరియల్ కథ జనాలకు మొదటి నుంచే బాగా కనెక్ట్ అయ్యింది. ఐపీఎస్ చదువును పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న అమ్మాయి హఠాత్తుగా ఓ ఇంటికి కోడలు కావాల్సి వస్తే ఆ తరువాత ఎలాంటి పరిస్థితుల నడుమ తన అనుకున్న కలను సాధించింది అనేది సీరియల్ అసలు కథ. ఇక అత్తగారి ఇంటి నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎవరికి తెలియకుండా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకికి ఒక్క భర్త మాత్రమే అండగా ఉంటాడు. జానకి చదువుకు ఇంట్లో సమస్యలు కూడా ఇబ్బందిగా మారుతుంటాయి.

ఇక వెన్నెల పెళ్లి విషయంలో కూడా జానకి వేసిన ప్లాన్ క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతుంది. జ్ఞానాంబ చిన్నకూతురు వెన్నెల, దిలీప్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. అయితే జ్ఞానాంబ ప్రేమ పెళ్లికి ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో జానకి వారి పెళ్లిని పెద్దలు కుదిర్చిన వివాహంగా చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికీ తెలియకుండా ఆ పెళ్లిని ముగించాలి అనుకుంటున్న సమయంలో మరో కొత్త సమస్య ఎదురవుతుంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి ఐపీఎస్ చదువు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 257 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో తెలుసుకుందాం పదండి.

మాట ఇచ్చిన జానకి

మాట ఇచ్చిన జానకి

ప్రేమ పెళ్లి అంటేనే ఏ మాత్రం ఇష్టపడని జ్ఞానాంబ తన కూతురు వెన్నెల ఒక వ్యక్తిని ప్రేమించింది అని తెలియగానే వెంటనే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలని అంటుంది. అయితే ప్రేమించిన వాడు దక్కకపోతే వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. తన ప్రియుడు దిలీప్ తో కలిసి కొండపై నుంచి దుకాలని అనుకుంటూ ఉండగా వెన్నెలను దిలీప్ ను ఇద్దరిని జానకి రామచంద్ర ప్రాణాలకు తెగించి కాపాడతారు. మీ పెళ్లి మేము జరిపిస్తాము అంటూ మాట ఇస్తారు.

జానకి ప్లాన్ పై మల్లిక ఫోకస్

జానకి ప్లాన్ పై మల్లిక ఫోకస్

ఇక జ్ఞానాంబకు వెన్నెల ఎవరిని ప్రేమించిందో తెలియదు కాబట్టి దిలీప్ ను తమ కుటుంబ సభ్యుల అబ్బాయి అని చెప్పి జానకి ఆ పెళ్లిని పెద్దలు కుదిర్చిన వివాహంగా మార్చాలని అనుకుంటుంది. అనుకున్నట్లే జానకి అందరిని ఒప్పిస్తుంది. ఇక జ్ఞానాంబ గోవింద రాజులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్ద కొడలు జానకి మంచి సంబంధం తీసుకు వచ్చింది అని ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఇక ఆ తరువాత జానకి కూడా అంత సవ్యంగా సాగింది అనుకుంటున్న సమయంలో మల్లికకు అనుమానం వస్తుంది. మొత్తానికి మల్లిక జానకి అబద్ధాలు చెప్పి వెన్నెలను తను ప్రేమించిన వాడికే పెళ్లి జరిపించాలని ప్లాన్ వేసిందని అనుకుంటుంధి. ఎట్టి పరిస్థితుల్లోను వెన్నెల నిశ్చితార్థం జరగకూడదు అని నా తమ్ముడు పండుగాడికి వెన్నలను ఇచ్చి పెళ్లి చేయాలనీ డిసైడ్ అవుతుంది.

చల్లారని మైరావతి కోపం

చల్లారని మైరావతి కోపం

ఇక తన కూతురు వెన్నల నిశ్చితార్థం మా అమ్మ మైరావతి తన ఇంట్లోనే జరిపించాలని చెప్పినట్లు గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబకు చెబుతాడు. ఇక అందుకు జ్ఞానాంబతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒప్పుకుంటారు. ఇక అందరూ మైరావతి ఇంటికి రాగానే ఎంతగానో సంతోషపడతారు. ఇక మైరావతి మాత్రం అందరితో సరదాగా మాట్లాడి జానకిని మాత్రం దూరం పెడుతుంది. ఇంతకుముందే మూడుసార్లు జానకిని ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకున్న మైరావతి మాటను జ్ఞానాంబ లెక్కచేయకుండా ఆలోచిస్తుంది. అందుకే మైరావతి జానకిపై మరింత కోపాన్ని పెంచుకుంటుంది.

జ్ఞానాంబ నీ చేతుల్లో ఉండాలి అంటే వెన్నెలకు మీ కుటుంబంలో కి రప్పించాలి అని అనుకున్నావు. అంతే కదా అని మైరావతి అనమానిస్తుంది. అయితే వెన్నెల కు వచ్చిన సంబంధంలో ఏదైనా పొరపాటు ఉన్నట్లు తెలిస్తే మాత్రం వెంటనే నిశ్చితార్థం క్యాన్సల్ చేస్తానని మైరావతి చెబుతుంది.

ఓబులేష్ ట్విస్ట్

ఓబులేష్ ట్విస్ట్

ఇక అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో దిలీప్ ఇంటి దగ్గర ఉండే ఓబులేష్ ఒక సడన్ గా మైరావతి దగ్గరికి వస్తాడు. అతను అందరితో చాలా సరదాగా మాట్లాడుతూ చివరికి వెన్నెలను అలా చూడగానే మీరు దిలీప్ ప్రేమించుకన్నారు కదా అని అంటాడు. అంతే కాకుండా మీది ప్రేమ వివాహం కదా అని ఆనంద పడతాడు. ప్రేమ వివాహం అంటేనే కోప్పడే మైరావతి అమ్మగారు మీ ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నారు అంటే చాలా గొప్ప విషయం అని వెంటనే మైరావతి దగ్గరకు వెళ్లి ఆమెను పొగడాల్సిందే అని అనుకుంటాడు.

అతన్ని అడ్డుకోవాలని..

అతన్ని అడ్డుకోవాలని..

ఇక జానకి రామ వెన్నెల ముగ్గురు కూడా కంగారు పడుతూ అతన్ని అడ్డుకోవాలని అనుకుంటారు. కానీ అప్పటికే ఓబులేష్ మైరావతి దగ్గరకు వెళ్లిపోతాడు. అక్కడ గోవిందరాజులు జ్ఞానాంబ అలాగే మల్లిక కూడా ఉంటారు. ఇక అందరికి ఓబులేష్ నిజం చెబితే మరింత సమస్యల్లో పెడతామని జానకి రామచంద్ర ను ముందుకు తోస్తుంది. వెంటనే అతన్ని అడ్డుకోవాలని అనుకుంటూ ఉండగా ఓబులేష్ మాత్రం చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు.

మెమోరి లాస్

మెమోరి లాస్

ఇక వెన్నెల ప్రేమించిన వ్యక్తి గురించి నిజం చెప్పే చివరి క్షణంలో అతను మర్చిపోతాడు. ఏమైంది అంటూ అందరు అడుగుతుంటారు. ఇక మల్లిక అయితే ఎదో విషయం దాగి వుందని అతన్ని గుచ్చి గుచ్చి అడిగే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ ఓబులేష్ మతిమరుపు కారణంగా నిజం మర్చిపోతాడు. ఇక జానకి రామ వెన్నెల ముగ్గురు కూడా మరింత హ్యాపీగా ఫీల్ అవుతారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Anchor Ravi VS Shanmukh Jaswanth || Filmibeat Telugu
మరో సమస్య..

మరో సమస్య..

ఇక ఆ తరువాత మళ్ళీ గుర్తుకు వచ్చినప్పుడు చెబుతానని ఓబలేష్ చెప్పడంతో రామ జానకి ఇద్దరు కూడా మళ్ళీ టెన్షన్ లో పడతారు. మళ్ళీ మనం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకుండా జాగ్రత్తగా ఉండాలని ఓబులేష్ ను మళ్ళీ మర్చిపోయేయాలా చేయాలని అనుకుంటారు. ఇక ఆ తరువాత మరుసటి రోజు నిశ్చితార్థం వేడుకలో దిలీప్ ను చూసిన ఓబులేష్ ఎక్కడో చూశాను అంటూ మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఇక అతన్ని రామ అడ్డుకోవాలని అనుకుంటాడు. మరి నిజం తెలియకుండా జానకి రామ వెన్నెల నిశ్చితార్థం వేడుకను ఎలా ముగిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X