twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu march 1st: పెళ్లయ్యే వరకు నోరెత్తకు.. మల్లిక ప్లాన్ కు జ్ఞానాంబ స్ట్రాంగ్ కౌంటర్

    |

    జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. మొదట్లో ఈ సీరియల్ పై అంతగా ఆసక్తిని చూపని జనాలు కొన్నాళ్ళకు అసలు కథ కనెక్ట్ అవ్వడంతో టాప్ సీరియల్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. సీరియల్ లో ఎమోషన్స్ సీనియర్ హీరోయిన్ రాది యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక సీరియల్ లో ప్రస్తుతం కథనం విషయానికి వస్తే.. వెన్నెల పెళ్లి చర్చలతో సరికొత్త మలుపు తిరుగుతోంది. కూతురు వెన్నలకు పెళ్లి చేయాలని జ్ఞానాంబ నిర్ణయం తీసుకోగా జానకి మాత్రం అత్తకు అబద్ధం చెప్పి వెన్నెల లవర్ తోనే పెళ్లి చేయాలని చూస్తుంది.

    ప్రేమ పెళ్లిని కాస్త పెద్దలు కుదిర్చిన పెళ్లిగా పూర్తి చేయాలని జానకి ప్లాన్ వేయగా వెన్నలను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే విదంగా మల్లిక అడ్డుపడుతూ ఉంటుంది. ఇక జానకి తన చదువు విషయంలో రామ మరొక అడుగు ముందుకు వేస్తాడు. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 247 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ముందే తెలుసుకుందాం పదండి.

    వెన్నలకు రామ జానకి భరోసా

    వెన్నలకు రామ జానకి భరోసా

    జ్ఞానాంబ తన కూతురు వెన్నెలకు పెళ్లి చేయాలి అని రామచంద్రపురం నుంచి ఒక సంబంధం మాట్లాడుతుంతుంది. అయితే వెన్నలకు ఆ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండదు. తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. జ్ఞానాంబ ఒప్పుకోకపోవడంతో వెన్నెల త ప్రియుడు దిలీప్ తో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న జానకి రామచంద్ర వెన్నలను కాపాడుతారు. అంతేకాకుండా మీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాము అంటూ జానకి భరోసా కూడా ఇస్తుంది. అందుకు రామచంద్ర కూడా ఆమెకు మద్దతు ఇస్తాడు.

    జానకి కారణంగా జ్ఞానాంబ హ్యాపీ

    జానకి కారణంగా జ్ఞానాంబ హ్యాపీ

    ఇక అనుకున్నట్లుగానే జానకి జ్ఞానాంబ తెలియకుండా వెన్నెలకు అలాగే తను ప్రేమించిన వాడి తో పెళ్లి చేయడానికి అందరినీ ఒప్పిస్తుంది. జానకి ఇది పెద్దలు కుదిర్చిన వివాహంగా మార్చాలని చూస్తుంది. అసలు నిజం తెలియని జ్ఞానం జానకి మాటలను నమ్ముతుంది. ఏం చేసినా నువ్వు ఆలోచించే చేస్తావని జానకి మీద నమ్మకంతో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది.

    ఇక అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో జానకి చదువు ఆగిపోకూడదు అని రామచంద్ర ఐపీఎస్ కోచింగ్ కు వెళ్లాలి అని సూచిస్తున్నాడు. అందుకోసం నైట్ క్లాసెస్ కు ఏర్పాట్లు చేస్తాడు. ఈ క్రమంలో జ్ఞానాంబ కేకులు తయారు చేయాలి అని ఉదయమే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది అని చెప్పడంతో రామచంద్ర మొదట జానకిని అర్ధరాత్రి క్లాసెస్ కి పంపి ఆ తర్వాత తనతోనే కేకులు తయారు చేస్తాడు. ఉదయమే వాటిని జ్ఞానాంబకు అనుకున్న సమయానికి అందజేస్తారు. ఆ విషయంలో జానకి పనితనానికి జ్ఞానాంబ ఎంతగానో ఆనందపడుతుంది.

    కన్ఫ్యూజన్ లో మల్లిక

    కన్ఫ్యూజన్ లో మల్లిక

    అంతేకాకుండా జానకి తెచ్చిన సంబంధం గురించి కూడా జ్ఞానాంబ మరొక విషయం చెబుతుంది. ఈ సంబంధం మా అత్తగారికి కూడా చాలా బాగా నచ్చింది అని, అయితే నిశ్చితార్థం మాత్రం వారి ఇంటి దగ్గరే నిర్వహించాలని పట్టుబట్టినట్లుగా జ్ఞానాంబ చెబుతుంది. అందుకు రామచంద్ర సరే అని అంటాడు. ఇక మరోవైపు మల్లిక వెన్నెల విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటుంది. ప్రేమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన వివాహంగా చేస్తున్నారు అని తెలియని మల్లిక అసలు వెన్నెల ఎందుకు ఇంత సంతోషంగా ఉందో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. మల్లికా ఇదివరకే వెన్నల ప్రేమ విషయం గురించి అనేక రకాల విషయాలను తెలుసుకుంటుంది.

    పెళ్లయ్యే వరకు నోరెత్తకు

    పెళ్లయ్యే వరకు నోరెత్తకు

    ఇక వెన్నెల ఫోన్లో మాట్లాడుతూ ఉండగా తను ప్రేమించిన వాడితో నేను మాట్లాడుతూ ఉండవచ్చునని అనుమానం కూడా కలుగుతుంది. ఇక వెంటనే మల్లిక వెన్నెలను జ్ఞానాంబ దగ్గరకు తీసుకెళ్లి తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది. వెన్నెల ఎంత వద్దని చెప్పినా కూడా ఏమాత్రం వినకుండా జ్ఞానాంబని పిలుస్తుంది.

    జ్ఞానాంబ రాగానే మల్లిక ఆలోచనలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. నేను వెన్నెల ప్రేమ గురించి ఇప్పుడు చెబితే మళ్లీ వెన్నెల అలాంటిదేమీ లేదు అని చెప్పింది అంటే అత్తగారు తప్పకుండా నాపై కోపం వ్యక్తం చేస్తారని భయపడుతుంది. ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నారు అని తన ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా అని జ్ఞానాంబ మరో మాట చెబుతుంది. కానీ వెన్నెల మాత్రం ఈ పెళ్లి తనకిష్టం లేదని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీంతో జ్ఞానాంబ మరొకసారి మల్లికకు చీవాట్లు పెడుతుంది. పెళ్లి అయ్యే వరకు నోరు ఎత్తకూడదు అని కౌంటర్ కూడా ఇస్తుంది.

    ధైర్యం చెప్పిన రామ

    ధైర్యం చెప్పిన రామ

    ఇక జానకి తన అత్త జ్ఞానాంబ విషయంలో మరోసారి ఆందోళన చెందుతూ ఉంటుంది. వెన్నెల ప్రేమ విషయం పెద్దల కుదిర్చిన వివాహంగా జరిపిస్తున్నాము అని అసలు నిజం తెలిస్తే అత్తయ్య గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్కసారిగా మారిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని భయం కూడా కలుగుతుంది అని జానకి చెప్పడంతో రామచంద్ర ఆమెకు మరోసారి ధైర్యం చెబుతాడు. ఒక మంచి పని చేసేటప్పుడు ఇలాంటి ఆటంకాలు రావడం సహజమే అని జరుగుతుంది అని మరోసారి భరోసా ఇస్తాడు.

    పెళ్లికి వెళ్లకుండా..?

    పెళ్లికి వెళ్లకుండా..?

    ఇక మరోవైపు ఒక పెళ్ళికి వెళ్లి అమ్మాయికి చీర పెట్టాలి అని జ్ఞానాంబ అనుకుంటూ ఉండగా అప్పుడే జానకి వచ్చి ఆ చీర నేను రామగారు పెడతాము అని అంటారు. అందుకు జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. కానీ ఆ తర్వాత జానకి పెళ్లికి వెళ్ళలేదు అని తెలుస్తుంది. కేవలం రామచంద్ర మాత్రమే వెళ్ళాడు అని అక్కడ తను మాత్రమే చీర అందించాడు అని తెలియడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. మరి జానకి అత్తగారికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 247
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X