Janaki Kalaganaledu march 21st: జానకి ప్లాన్ ను బట్టబయలు చేసిన మల్లిక.. నిజం తెలిసినా క్షమించని జ్ఞానాంబ!
జానకి కలగనలేదు మరొక కీలక మలువు తిరగబోతోంది. ఇన్నిరోజులు అత్తగారి దగ్గర ఎంతో మంచి కోడలిగా గుర్తింపును అందుకున్న జానకి ఒక్కసారిగా తన గురించి తెలియడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. జ్ఞానాంబతో పాటు ఆమె అత్తగారు మైరావతి కూడా జానకి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు మల్లిక కూడా జానకి పై అనేక రకాల నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత జానకి ఎవరికీ తెలియకుండా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటు మరొకవైపు కుటుంబ వ్యవహారాలను కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఇక అనుకోకుండా ఆమెకు ఎన్నో రకాల చేదు అనుభవాలు ఎదురవుతాయి.
మొత్తానికి వెన్నెల ప్రేమ పెళ్లిని నా పెద్దలు కుదిర్చిన పెళ్లి గా చేయాలి అని అనుకున్న సమయంలో ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఇక నిజం తెలుసుకున్న జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది సీరియల్ పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక నేడు ప్రసారం కాబోయే 261 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగానే తెలుసుకుందాం పదండి.

జానకి ప్లాన్ ను పసిగట్టిన మల్లిక
తోడికోడలు జానకి పై ఎప్పుడూ ఏదో ఒక నింద వేస్తూ ఉండే మల్లిక ఈసారి సరైన క్రమంలో పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. అత్త జ్ఞానాంబ కూతురు వెన్నెలను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్న మల్లికకు జానకి నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురవుతుంది. ఎందుకంటే వెన్నెల ముందుగానే దిలీప్ అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది.
ఇక దిలీప్ దక్కకపోతే చచ్చిపోతాను అని వెన్నెల చెప్పడంతో జానకి భయపడి వారి ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటోంది. అయితే ప్రేమ పెళ్లి అంటే మాత్రం జ్ఞానాంబ ఏమాత్రం ఒప్పుకోదు అని దిలీప్ తన కుటుంబ సభ్యుల కు చెందిన వ్యక్తి అని చాలా మంచి కుర్రాడు అని అతనికి ఇచ్చి వెన్నెలను పెళ్లి చేయాలని జానకి చెబుతుంది. ఇక మొత్తంగా పెద్దలు కుదిర్చిన వివాహం గా చేయాలి అని జానకి వేసిన ప్లాన్ గురించి మల్లిక తెలుసుకుంటుంది.

జ్ఞానాంబ, మైరావతి సీరియస్
ఇక చివరిసారిగా మల్లిక నిశ్చితార్థం జరిగే సమయంలో ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది. అందుకోసం జానకిని ప్రత్యేకంగా పిలిపించి. నిజం చెప్పమంటావా అని బెదిరిస్తుంది. ఇక జానకి చెప్పే ధైర్యం చేయకపోవడంతో మల్లిక చివరి నిమిషంలో ఆ నిజాన్ని చెబుతుంది. కానీ మొదట ఆ విషయాన్ని ఎవరూ అంతగా నమ్మరు.
అయితే మల్లిక ఎన్ని చెబుతున్న కూడా జానకి మౌనంగా ఉండడంతో జరిగింది మోసమే అని జ్ఞానాంబ గ్రహిస్తుంది. మరోవైపు జ్ఞానాంబ, మైరావతి కూడా ఈ విషయం గురించి చాలా సీరియస్ అవుతుంది.

నిజం తెలుసుకున్న జ్ఞానాంబ
చివరికి మైరావతి మల్లిక చెప్పింది నిజమా కాదా అని రామచంద్రను కూడా అడుగుతుంది. అందుకు రామచంద్ర తను చెప్పింది నిజమే అని అంటాడు. జానకిని పక్కకు తీసుకు వెళ్ళిన జ్ఞానాంబ నిజంగా నన్ను మోసం చేసి ప్రేమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన వివాహంగా మార్చారా? అని ఎంతగానో అడుగుతుంది. ఇక మైరావతి వెంటనే వచ్చి జానకి గురించి రామచంద్ర నిజం చెప్పాడు అని అంటుంది.
జానకి నిన్ను మరోసారి మోసం చేసింది అని, తన దగ్గర చదువుకున్న తెలివితేటలు చాలా ఉన్నాయి అని నేను ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పినప్పటికీ నువ్వు ఏ మాత్రం నమ్మ లేదు అని మైరావతి జ్ఞానాంబను తిడుతుంది. అందుకు జ్ఞానాంబ ఎంతగానో బాధపడుతూ నిన్ను నమ్మినందుకు నామీద నాకే అసహ్యం వేస్తుంది అని బాధపడుతుంది.

తుది నిర్ణయం మైరావతి చేతిలో..
కోపం తట్టుకోలేక పోయిన జ్ఞానాంబ జానకి పై చేయి చేసుకోవడానికి వెళుతుండగా వెంటనే రామచంద్ర అడ్డుపడతాడు. అతను కూడా ఓపిక పట్టలేక అసలు నిజం చెబుతాడు. జానకి అలా చేయకపోతే ఈ రోజు వెన్నెల ప్రాణాలతో ఉండేది కాదు అని దిలీప్ తో పెళ్లి జరగకపోతే తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైందని రామచంద్ర జరిగిన విషయం చెబుతాడు.
అయినప్పటికీ జ్ఞానాంబ ఏ మాత్రం ఆలోచించకుండా ఏదేమైనా జానకి చేసింది మాత్రం మోసమేనని తను నమ్మినందుకు అందరి ముందు నా పరువు తీసేసింది అని అందుకు శిక్ష అనుభవించాల్సిందే నన్ను కూడా అంటుంది. ఇక జ్ఞానాంబ తన అత్త మైరావతి దగ్గర తప్పు చేసిన వారిని వదిలి పెడతాను అంటూ ఇక తుది నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అని చెబుతోంది.

దిలీప్ తండ్రి సీరియస్
జ్ఞానాంబ, జానకిని అలాగే రామచంద్రను వెన్నెలను కూడా కూడా తన అత్తగారి దగ్గర వదిలేసి బయటకు వెళ్లి పోతుంది. ఇక అమైరావతి జానకిని పిలిచి జరిగిన విషయం గురించి అడుగుతుంది. ఇక మరోవైపు దిలీప్ తల్లిదండ్రులు కూడా ఆ విషయంలో చాలా అప్సెట్ అవుతారు. జానకి తమతో అబద్ధం చెప్పి పెళ్లి చేస్తాను అని చెప్పింది.
ఒక విధంగా ఇది నాటకం అని నాకు అనిపిస్తోంది మమ్మల్ని మోసం చేసిన జానకి రామ ఇద్దరిపై మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను అని దిలీప్ తండ్రి హెచ్చరిస్తాడు. మరి జానకి పై మైరావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ తర్వాత జ్ఞానాంబ ఏం చేస్తుంది? దిలీప్ తల్లిదండ్రులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తర్వాత ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











