For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu march 23rd: జ్ఞానాంబ మరో కఠిన నిర్ణయం.. జానకిని ఇంట్లో నుంచి గెంటేసేలా చేసిన మల్లిక

  |

  జానకి కలగనలేదు సీరియల్ సరికొత్త ట్విస్ట్ లతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. అత్తగారి తెలియకుండా ఆమె కూతురు వివాహంలో జానకి తీసుకున్న నిర్ణయం ఊహించాని పరిణామాలకు దారితీసింది. ఈ తరుణంలో జ్ఞానాంబ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జానకి జీవితం మరో కీలక మలుపు తిరగబోతోంది. ఇక భర్త రామచంద్ర కూడా ఆమెకు సపోర్ట్ చేసినప్పటికీ లాభం లేకుండా పోతుంది. ఇక వీరి జీవితం ఎటువైపు సాగుతుందనే అంశాలు సీరియల్ పై ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

  ఐపీఎస్ చదవాలని అనుకున్న జానకి అనుకోకుండా వెన్నెల పెళ్లి విషయంలో మంచి జరగాలని అనుకున్నప్పటికీ అది రివర్స్ అయింది. మరొకవైపు మల్లిక జానకి పై మరింత పగ తీర్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక నేడు ప్రసారం కాబోయే 263 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందు తెలుసుకుందాం పదండి..

  అబద్ధం చెప్పి నిశ్చితార్థం

  అబద్ధం చెప్పి నిశ్చితార్థం

  జ్ఞానాంబ చిన్న కూతురు వెన్నెల, దిలీప్ అనే కాలేజీ కుర్రాడిని ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశ పడుతుంది. మరొకవైపు జ్ఞానాంబ పెళ్లి సంబంధాలు చూడడంలో బిజీగా ఉంటుంది. వెన్నలకు పెళ్లి ఫిక్స్ అయింది అనుకున్న తరుణంలో జానకి కారణంగా అది క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత వెన్నెల పెళ్లి ని ఎలాగైనా దిలీప్ తోనే జరిపించాలని జానకి పెద్దలు కుదిర్చిన వివాహం గా మార్చాలని అనుకుంటుంది. ప్రేమ పెళ్లి అంటే అత్తగారు ఒప్పుకోరు అని అతను తన కుటుంబ సభ్యుల వ్యక్తి అని చెప్పిన జానకి నిశ్చితార్థం వరకు తీసుకెళుతుంది.

  నిజం చెప్పిన మల్లిక

  నిజం చెప్పిన మల్లిక

  ఫైనల్ గా నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మల్లిక అసలు విషయాన్ని బయట పెడుతుంది. జానకి అత్తగారిని మోసం చేసి ఈ పెళ్లి ఖాయం చేసింది అని అతను వెన్నెల ప్రేమించిన వ్యక్తి అని చెప్పడంతో ఒక్కసారిగా జ్ఞానాంబ షాక్ అవుతుంది. జానకి పక్కా ప్రణాళికతోనే మోసం చేసే ఈ విధంగా పెళ్లి చేయడానికి సిద్ధమైంది అని అందరూ నమ్ముతారు. అయితే ఫైనల్ గా రామచంద్ర జానకి అలా చేయకపోతే ఈ రోజు వెన్నెల దిలీప్ మనకు దక్కే ఉండేవారు కాదు అని, వాళ్ళు చనిపోవడానికి సిద్ధమయ్యారు కాబట్టే ఈ విధంగా పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు అసలు విషయాన్ని చెబుతాడు.

  ప్రశ్నించిన దిలీప్ తండ్రి

  ప్రశ్నించిన దిలీప్ తండ్రి

  అయితే జ్ఞానాంబ మాత్రం జానకి విషయంలో ఏమాత్రం క్షమించకూడదు అని అనుకుంటుంది. కానీ ఆమె మంచితనం గురించి తెలుసుకున్న మైరావతి ఈ ఒక్కసారికి జానకిని క్షమించాలి అని చెప్పడంతో జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది. అనంతరం దిలీప్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి నిలదీసే ప్రయత్నం చేస్తారు అబద్ధాలు చెప్పి నిశ్చితార్థం వరకు తీసుకు వచ్చారు. ఆ తరువాత క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మా ఊర్లో పరువు మొత్తం పోయింది. వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పాలి అంటూ దిలీప్ తండ్రి జానకి, రామచంద్రలను ప్రశ్నిస్తాడు.

  కావాలనే ఇలా నాటకాలు

  కావాలనే ఇలా నాటకాలు

  నీ కొడుకు కోడలు కావాలనే విధంగా నాటకాలు ఆడారని మేము మీతో నిజం చెప్పాలి అని అనుకున్నప్పటికీ మీ కోడలు జానకి మాకు నచ్చజెప్పి ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి పెళ్లికి ఒప్పించింది అని కూడా చెబుతారు. అంతేకాకుండా వెన్నెల ఆత్మహత్యాయత్నం అబద్ధం కూడా అయ్యి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తారు. దిలీప్ తల్లిదండ్రులు ఎంత తిడుతున్నా కూడా జ్ఞానాంబ ఏమీ అనలేని పరిస్థితిలో ఉంటుంది రామచంద్ర భార్య కు మద్దతుగా నిలిచినప్పటికీ కూడా ఏమాత్రం లాభం లేకుండా పోతుంది.

  అగ్గి రాజేసిన నీలావతి

  అగ్గి రాజేసిన నీలావతి

  దిలీప్ తల్లిదండ్రులు వారి కుటుంబ పరువు పోయిన కారణంగా జానకి రామచంద్ర ఇద్దరిపై పోలీసు కేసు కూడా పెట్టి అందుకు బదులు తీర్చుకుంటామని సవాళ్లు విసురుతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన నీలావతి మరిన్ని మాటలతో జ్ఞానాంబ మనసును నొప్పించేలా చేస్తుంది. ఇలాంటి కష్టం నీకు రాకుండా ఉండాల్సింది అంటూ మొన్నటి వరకు నీ మాట వినని కొడుకు కూడా ఈరోజు కోడలు తన అదుపులో పెట్టుకుంది అని నీలావతి మరింత అగ్గి రాజేస్తుంది. అంతే కాకుండా అనవసరంగా కోడలికి నమ్మితే ఈవిధంగా జరగక తప్పదని అనడంతో జ్ఞానాంబ లోపలికి వెళ్ళి పోతుంది.

  Recommended Video

  RRR Team Reacts On Memes పడి పడి నవ్విన Ram Charan, Jr NTR | Filmibeat Telugu
  బయటకు వెళ్లిపోయిన జానకి, రామ

  బయటకు వెళ్లిపోయిన జానకి, రామ

  ఇక తనను మోసం చేసిన కారణంగా ఇంట్లో ఉండడానికి మీకు ఏమాత్రం అర్హత లేదు అంటే జానకి రామచంద్ర ఇద్దరినీ కూడా బయటకు వెళ్ళి పోవాలని చెబుతుంది. మధ్యలో వెన్నెల వచ్చి ఈ విషయంలో జానకి వదిన తప్పులేదు అని చెప్పినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా తన చంప పగలగొడుతుంది. నిన్ను కన్న పాపానికి నాకు తగిన బుద్ధి చెప్పావని జ్ఞానాంబ ఎంతగానో బాధ పడుతుంది.

  ఇక మరొక నిమిషం ఆలస్యం చేయకుండా రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని నాకు ఈ రోజు నుంచి కేవలం నాకు ఇద్దరు కొడుకులు అని అనుకుంటాను అంటూ జ్ఞానాంబ కఠిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక జానకి రామ చంద్ర ఇద్దరు ఇంట్లో నుంచి బాధపడుతూ బయటకు వెళ్ళి పోతారు. మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 263
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X