Janaki Kalaganaledu march 24th: జ్ఞానాంబ ఎదురుగా జానకి మరో కుంపటి.. ప్రేమతో మరో దెబ్బ!

జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకు సరికొత్త మలుపులతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. మొదట ఈ సీరియల్ జనాలకు అంతగా కనెక్ట్ అవ్వలేదు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలవగానే జానకి కలగనలేదు సీరియల్ మిగతా సీరియల్స్ తో పోటీ పడుతూ మంచి టీఆర్పీని కూడా అందుకుంటోంది. రీసెంట్ గా అత్యధిక రేటింగ్స్ అందుకున్న టాప్ సీరియల్స్ లో కూడా జానకి కలగనలేదు సీరియల్ టాప్ లో నిలిచి తన సత్తాను చాటుకుంది.

ఐపీఎస్ చదువుకోవాలి అనుకున్న ఒక జానకి ఆ తర్వాత అత్త కట్టుబాట్ల మధ్య ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది? ఆమెకు భర్త ఎలాంటి సహాయం చేశాడు అనే కాన్సెప్ట్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 264 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందే తెలుసుకుందాం పదండి..

అత్తగారి ఎదుట దోషిగా

అత్తగారి ఎదుట దోషిగా

ప్రేమించిన వాడితో పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నా వెన్నెలను.. ప్రాణాలకు తెగించి కాపాడిన జానకి ఆ తర్వాత తనకు ప్రేమ పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. కానీ వెన్నెల తల్లి జ్ఞానాంబ మాత్రం ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక జానకి.. వెన్నెల ప్రేమించిన వ్యక్తి తమ కుటుంబ సభ్యులకు చెందిన దగ్గరి బంధువు అని మరొక నాటకం ఆడుతుంది. జ్ఞానాంబకు వెన్నెల ప్రేమించిన వ్యక్తి కూడా తెలియదు. ఇక ఎలాగైనా పెళ్లి చేయాలని నిశ్చితార్థం వరకు వెళుతుంది. ఇక చివరి క్షణంలో మల్లిక ద్వారా నిజం బయట పడడంతో అత్తగారి ఎదుట జానకి దోషిగా నిలబడుతుంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని శిక్ష

ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని శిక్ష

కేవలం జానకి మాత్రమే కాకుండా తన కొడుకు రామచంద్ర కూడా కోడలికి సహాయం చేశాడు అని గ్రహించిన జ్ఞానాంబ వారిని ఏమాత్రం క్షమించదు. వెన్నెల ప్రాణాలు కాపాడేందుకు ఆ విధంగా చేసినట్లు జానకి భర్త రామచంద్ర ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ ఏమాత్రం కనికరంచదు. తనను జానకి చాలా మోసం చేసింది అని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కి వెన్నుపోటు పొడిచింది అని ఎంతగానో బాధ పడుతుంది. ఇక ఇంట్లో నుంచి ఇద్దరు వెళ్లిపోవాలి అని చెప్పడంతో రామచంద్ర జానకి ఇద్దరు కూడా మనోవేదనకు గురి అవుతారు.

జ్ఞానాంబ ఇంటి ముందే జానకి గుడిసె..

జ్ఞానాంబ ఇంటి ముందే జానకి గుడిసె..

ఇక కొడుకు కోడలిని బయటకి పంపించడంతో జ్ఞానాంబ కూడా ఎంతగానో మనోవేదనకు గురి అవుతుంది. మరొకవైపు రామచంద్ర కూడా బయటకు వెళ్లి అమ్మను చూడకుండా ఉండలేను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. అలాగే తనను చూడకుండా అమ్మ కూడా సంతోషంగా ఉండలేదని అంటాడు. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అంటూ కన్నీటి పర్యంతం అవడంతో జానకి కూడా బాధపడితుంది. జానకి వెంటనే ఒక ఆలోచన చేస్తుంది. రామచంద్ర బయటకు వెళ్ళిపోకుండా తల్లి దగ్గరే ఉండాలి అంటే వారు ఉంటున్న ఇంటి ముందు ఉండాలి అని ప్రత్యేకంగా ఒక చిన్న గుడిసె నిర్మించేలా చేస్తుంది.

మల్లికకు షాక్..

మల్లికకు షాక్..

ఇక ఉదయాన్నే లేచిన మల్లిక పెద్ద కోడలు జానకి వెళ్లిపోయిందన్న సంతోషంతో ఉంటుంది. ఇక వాకిట్లో ముగ్గు వేయడానికి రాగానే ఇంటి ముందు సీన్ చూసి మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. బయటకు వెళ్లిపోయారు అని అనుకుంటే మళ్లీ ఇంటి ముందు మరో గుడారం పెట్టారు ఏమిటి అని ఆశ్చర్యపోయిన మల్లికా వెంటనే ఆ విషయాన్ని తన అత్తగారికి చెబుతుంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన జ్ఞానాంబ గోవిందరాజులు అలాగే విష్ణు కూడా ఆ సీన్ చూసి ఆశ్చర్యపోతారు. జానకి రామ చంద్ర ఇద్దరు కూడా ఇంటి ముందు ఎంతో అన్యోన్యంగా ఉండడం జ్ఞానాంబ కూడా చూసి తట్టుకోలేక పోతుంది.

నిన్ను విడిచి పెట్టి ఉండగలనా.. అమ్మా!

నిన్ను విడిచి పెట్టి ఉండగలనా.. అమ్మా!

తన కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోవాలని చెప్పాను కదా ఆయన కూడా ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నారో అడగండి అంటూ జ్ఞానాంబ తన భర్త గోవిందరాజుల తో కొడుకును అడిగిస్తుంది. ఇక రామచంద్ర తల్లిని చూస్తూ నిన్ను విడిచి పెట్టి ఉండగలనా అని ఆప్యాయంగా మాట్లాడతాడు. అంతే కాకుండా నన్ను వదిలిపెట్టి నువ్వు ఉండగలవా అమ్మా అని కూడా అనడం తో ఒక్కసారిగా జ్ఞానాంబ మళ్లీ తన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

నాది అనే స్థాయికి వచ్చావా?

నాది అనే స్థాయికి వచ్చావా?

ఇక ఆ తర్వాత కొడుకు ఎంత ప్రేమగా మాట్లాడినా కూడా జ్ఞానాంబ మనసు కరగదు. వారు చేసిన మోసం మనసులో ఉండటంతో ఇక్కడ నా ముందు అలాగే మా ఇంటి ముందు ఉండడానికి వీలులేదు అని వాదిస్తుంది. అయినప్పటికీ రామచంద్ర తన నానమ్మ తనకు ఇచ్చిన స్థలంలో నేను ఉంటున్నాను అని అనడంతో జ్ఞానాంబ ఆశ్చర్యపోతుంది. ఇన్నాళ్లూ మనం అనే మాట వాడిన నువ్వు ఈరోజు నాది అనే స్థాయికి వచ్చావు అంటే అందుకు కారణం ఏమిటో నాకు తెలుసు. ఈ మాటలు ఎవరు నేర్పారో కూడా తనకు తెలుసు అని జ్ఞానాంబ.. జానకి వైపు చూస్తుంది. రామచంద్రతో అలా చెప్పించడానికి వెనుక ఉన్న కారణం జానకి అని గ్రహించిన జ్ఞానాంబ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X