Janaki Kalaganaledu march 25th: నా ముందు నీ ఆటలు సాగవు.. జానకి, రామచంద్రలకు మరో షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ప్రేక్షకుల సంఖ్యను అమితంగా పెంచుకుంటుంది. సీనియర్ నటి రాశి ఒక జ్ఞానాంబ అనే పవర్ఫుల్ అత్త పాత్రలో నటించిన విధానం ఈ సీరియల్ లో మెయిన్ హైలెట్. ఇక మిగతా నటీనటులు కూడా అద్భుతంగా నటిస్తుండటంతో జనాలు చాలా తొందరగానే కనెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ లో ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఎంతగానో ప్రయత్నం చేసే ఒక కోడలు అత్తగారి కట్టుబాట్ల మధ్య ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని తన గమ్యాన్ని చేరుకుంది అనేది అసలు పాయింట్. కోడలు జానకి అత్తగారు జ్ఞానాంబకు సంబంధించిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక జ్ఞానాంబ కూతురును కాపాడాలి అని అనుకొని జానకి చేసిన ఒక ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. అబద్ధాలు చెప్పారు అని జ్ఞానాంబ.. జానకి పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఇక భర్తతోపాటు బయటకు వచ్చిన జానకి అత్తగారి ఇంటి ముందే మరో కాపురం పెడుతుంది. ఇక నేడు ప్రసారం కాబోయే 265 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందే తెలుసుకుందాం పదండి..

మోసం గురించి తెలియడంతో..

మోసం గురించి తెలియడంతో..

జానకి తన అత్తగారి కూతురికి ప్రేమ పెళ్లి చేయాలని అనుకుంటుంది. తను ప్రేమించిన వాడితో పెళ్లి కాకపోతే ఆ అమ్మాయి చనిపోతుంది అని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధం అవుతుంది అని తెలుసుకున్న జానకి వెంటనే వారి ప్రేమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన పెళ్లిగా మార్చాలని అనుకుంటుంది. అందరికీ అబద్ధాలు చెప్పి వెన్నెల ప్రేమించిన వ్యక్తి తమ కుటుంబ సభ్యుల వాడే అని పెద్దలు కుదిర్చిన వివాహం జరగాలని ప్లాన్ వస్తుంది. ఇక చివరికి ఆ విషయం తెలియడంతో జానకి అత్తగారు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ బయటకు వెళ్లి పోవాలి అని చెబుతుంది.

 గుడిసెలో జానకి

గుడిసెలో జానకి


జానకి తో పాటు రామచంద్ర కూడా ఆమెకు సహకరించడంతో తల్లి జ్ఞానాంబ ఇద్దరినీ కూడా బయటకు వెళ్లి పోవాలి అని చెబుతుంది. అయితే తల్లిని వదిలి ఎప్పుడూ ఉండని రామచంద్ర బయటకు రాగానే ఎంతో మనో వేదనకు గురి అవుతాడు. మా అమ్మను చూడకుండా నేను ఉండలేను అని అలాగే నన్ను చూడకుండా మా అమ్మ ఉండలేదు అని ఈ బ్రతుకు బ్రతకడం కంటే కూడా చనిపోవడం మేలు అని బాధపడుతూ ఉంటాడు. ఇక భర్త బాధ చూడలేక జానకి ఎంతగానో మనోవేదనకు గురి అవుతుంది ఆ తర్వాత జ్ఞానాంబ ఇంటి ఎదురుగానే మరొక స్థలంలో జానకి రామచంద్ర ఇద్దరు కూడా ఒక గుడిసె కట్టుకొనే ఉంటారు.

ట్విస్ట్ ఇచ్చిన రామ

ట్విస్ట్ ఇచ్చిన రామ

ఇక జానకి రామచంద్ర చేసిన పనికి ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేసిన జ్ఞానాంబ మరొకసారి నా ఇంటి ముందుకు ఎందుకు వచ్చారు అని.. నా కంటి ముందు కనిపించకుండా ఉండాలి అని చెప్పాను కదా అంటూ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని మరోసారి హెచ్చరిస్తోంది. అయితే రామచంద్ర మాత్రం ఇది తనకు తన నానమ్మ ఇచ్చిన స్థలమని ఇక్కడ బ్రతికే హక్కు తనకు ఉంది అని తల్లితో చెబుతాడు. అందుకు గోవిందరాజులు కూడా అది నిజమేనని అవతలివైపు ఉన్న స్థలాన్ని విష్ణుకు ఈ స్థలాన్ని రామచంద్రకు మా అమ్మ గారు రాసిచ్చారు అని ఎంతో నమ్మకంతో చెబుతాడు. ఒక విధంగా గోవిందరాజులు తన కొడుకు కోడలికి మద్దతు పలుకుతూ ఉంటాడు. ఇక మరోవైపు మల్లిక మాత్రం జానకి వేసిన ప్లాన్ కు షాక్ అవుతుంది.

నీ ఆటలు నా దగ్గర సాగవు

నీ ఆటలు నా దగ్గర సాగవు

ఇక రామచంద్ర ఆ విధంగా చెప్పగానే జ్ఞానాంబ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతుంది. నిన్న మొన్నటి వరకు మనం మనది అనే నువ్వు ఇప్పుడు నాది అంటున్నావు.. నువ్వు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం అయ్యింది. అలాగే నీతో ఎవరు మాట్లాడిస్తున్నారోతున్నారో కూడా నాకు తెలుసు అంటూ జ్ఞానాంబ జానకి అనుమానిస్తుంది. అయితే జానకి మాత్రం ఒక కుటుంబాన్ని కూడా విడదీసే ఆలోచన తనకు ఉండదు అని మీ అబ్బాయి గారే ఇక్కడికి తీసుకు వచ్చినట్లు జానకి చెబుతుంది. ఇక రామచంద్ర కూడా నిన్ను విడిచి పెట్టి ఉండలేక నేను ఇక్కడ ఉన్నాను అమ్మ అని సమాధానమిస్తాడు. ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ మరోసారి జానకిని హెచ్చరిస్తుంది.

మంచి చేసినా.. కష్టమే కలుగుతోంది

మంచి చేసినా.. కష్టమే కలుగుతోంది

ఇక రామచంద్ర జానకి ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ మనసు కరగదు. ఇక జానకి రామచంద్ర ఎంతో అన్యోన్యంగా దాన్ని చూసి జ్ఞానాంబ ఏమాత్రం తట్టుకోలేక పోతుంది. అలాగే జానకి కట్టెల పొయ్యి మీద కష్టపడి వంట చేస్తూ ఉంటే రామచంద్ర బాధపడుతూ ఉంటాడు. మీరు చేసిన మంచి కారణంగా చివరికి మీకు కష్టమే కలుగుతోంది. ఈ విషయంలో నేను ఏమీ చేయలేక పోతున్నందుకు బాధపడుతున్నాను అని తనలో తానే ఆవేదన చెందుతూ ఉంటాడు. అయితే జానకి మాత్రం మీరు అలా బాధపడకండి అని చెబుతుంది.

అఖిల్ స్వీట్ షాప్ బాధ్యతలు

అఖిల్ స్వీట్ షాప్ బాధ్యతలు

ఇక జ్ఞానాంబ.. రామచంద్ర కు సంబంధించిన స్వీట్ షాప్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇక నుంచి ఆ స్వీట్ షాప్ ను నువ్వే చూసుకోవాలి అని చిన్న కొడుకు అఖిల్ కు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక అఖిల్ మరొక రెండు మూడు ఏళ్ళ చదివితే మంచి ఉద్యోగం వస్తుంది అని జానకి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దీంతో జ్ఞానాంబ నా కుటుంబంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరు అసలు నీకు ఎలాంటి అర్హత లేదు అని మరొక కౌంటర్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X