For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu march 28th: మల్లికతో జానకి మాటల యుద్ధం.. మధ్యలో వచ్చి ట్వీస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ

  |

  జానకి కలగనలేదు సీరియల్ కథలో మరో కీలక మలుపు తిరగబోతోంది. ఇటీవల కాలంలో టాప్ రేటింగ్స్ అందుకుంటున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు మొత్తానికి తన స్థాయిని పెంచుకుంటోంది. సీనియర్ నటి రాశి జ్ఞానాంబ అనే పవర్ఫుల్ పాత్రతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. మిగతా ప్రధాన నటీనటులు కూడా అద్భుతంగా నటిస్తుండటంతో జనాలు చాలా తొందరగానే కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సీరియల్ లో ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఎంతగానో ప్రయత్నం చేసే కోడలు అత్తగారి దగ్గర అనేక రకాల సమస్యలను దాటి ఎలా తన గమ్యాన్ని చేరుకుంది అనేది ఆసక్తిగా మారింది.

  అలాగే జ్ఞానాంబకు సంబంధించిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక అత్త కూతురును కాపాడాలి అని అనుకొని జానకి చేసిన ఒక ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. జానకి పై జ్ఞానాంబ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఇక భర్తతోపాటు బయటకు వచ్చిన జానకి అత్తగారి ఇంటి ముందే మరో కాపురం పెడుతుంది. మరి నేడు ప్రసారం కాబోయే 266 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

  రెచ్చగొట్టిన మల్లిక

  రెచ్చగొట్టిన మల్లిక

  జానకి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తప్పుగానే ఉంటుంది అని జ్ఞానాంబ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కొడుకును తన ఆధీనంలో ఉంచుకుంది అని అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక మరోవైపు మల్లిక కూడా జానకి పై పగ తీర్చుకోవాలి అనే లీలావతితో ఒక ప్లాన్ వేస్తుంది. జానకి ఇక్కడినుంచి ఎలాగైనా పంపించాలి అని తన కళ్ళ ముందు ఏ మాత్రం ఉండకూడదు లీలావతి తో చెప్పడంతో ఆమె కూడా అందుకు సహకరిస్తుంది.

  కొంతమంది ఎంత తిట్టినా కూడా సిగ్గులేకుండా అలానే ఉంటారు అని జానకికి వినిపించేలా మల్లిక ఎన్నో మాటలు అంటుంది. ఇక జానకి మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్నప్పటికీ మల్లిక దగ్గరికి వచ్చి మా అత్తను అవమానించినందుకు నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది అంటూ ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని జానకిని మరింత రెచ్చగొడుతుంది.

  జానకికి బ్రేక్ వేసిన జ్ఞానాంబ

  జానకికి బ్రేక్ వేసిన జ్ఞానాంబ

  అయితే జానకి మొదట చాలా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత మల్లిక మాటలకు మరింత కోపం రావడంతో చేయి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక మల్లికను కొడుతోంది అనగానే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జ్ఞానాంబ ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నిస్తుంది. నా కోడలిని కొట్టడానికి నీకు ఏమీ హక్కు ఉంది అని.. ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారో కూడా తనకు తెలుసు అని అంటుంది. మల్లికా కూడా ఆ తర్వాత మాటలు మార్చేసే నేను తను ఏమి అనలేదు అని..మిమ్మల్ని బాధ పెట్టినందుకు ప్రశ్నిస్తే కొట్టడానికి వచ్చినట్లు చెబుతుంది.

  స్వీట్ షాప్ విషయంలో మరో నిర్ణయం

  స్వీట్ షాప్ విషయంలో మరో నిర్ణయం

  ఇక మల్లికా మాటలు నమ్మిన జ్ఞానాంబ జానకి పై మరింత కోపాన్ని చూపిస్తుంది. మరొకసారి ఇలాంటి విషయాల్లో తలదూర్చకూడదు అని ఇప్పటికే తన కొడుకుని కూడా నీ అదుపులో పెట్టుకున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక జానకిని ఇక ఆ మాటలకు ఏమనకుండా మౌనంగా ఉండి పోతుంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి జ్ఞానాంబ.. జానకి వైపు చూస్తూ భావోద్వేగానికి లోనవుతూ ఉంటుంది. అంతే కాకుండా ఆ తర్వాత రామచంద్ర చూసుకోవాల్సిన స్వీట్ కొట్టును జ్ఞానాంబ విష్ణు అప్పగించాలి అని ఆలోచిస్తుంది. కానీ అతను మాత్రం తనకు బట్టల షాపు ఉంది అనే ఆయన స్వీట్ షాప్ ను ఎలా నడపాలో తనకు తెలియదు అని చెబుతాడు.

   అఖిల్ చేతికి తాళాలు

  అఖిల్ చేతికి తాళాలు

  జ్ఞానాంబ మరో దారి లేక చిన్న కొడుకు అఖిల్ ని పిలిపించి ఇకనుంచి స్వీట్ షాప్ నువ్వే చూసుకోవాలి అని కొంతమందికి బాధ్యత లేకుండా పోతోంది అని జానకి రామచంద్రలను ఉద్దేశించి అంటుంది. జ్ఞానాంబ ఆవిధంగా మాట్లాడుతుండగా అటువైపునుంచి జానకి రామచంద్ర చూస్తూనే ఉంటారు. ఇక అఖిల్ కు బాధ్యతలు అప్పగిస్తానని అనగానే జానకి వచ్చే అతను చదువుకుంటున్నాడు కదా అత్తయ్య గారు ఇప్పుడు అలాంటి బాధ్యతలు అప్పగించడం సరైనది కాదు అని చెబుతుంది.

  సరైన న్యాయం కాదు

  సరైన న్యాయం కాదు

  ఇక జానకి అలా చెప్పడంతో జ్ఞానాంబ మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు నా కుటుంబంలో తలదూర్చడానికి నీకు ఎలాంటి హక్కు లేదు అని హెచ్చరిస్తుంది. అయినప్పటికీ జానకి మాటలు పట్టించుకోకుండా అఖిల్ భవిష్యత్తు గురించి మరో సారి ఆలోచించాలి అని చెబుతుంది. మరోవైపు రామచంద్ర కూడా అదే తరహాలో అంటాడు. ఇక గోవిందరాజులు కూడా తన భార్య జ్ఞానాంబకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు. కొడుకులు ఇద్దరూ కూడా చదువుకోకపోవడంతో నువ్వు ఎంత బాధ పడ్డావో గుర్తుందా అని ఇప్పుడు చిన్నవాడు చదువుకుంటూ ఉంటే వారికి అప్పగించడం సరైన న్యాయం కాదు అని చెపుతాడు.

  మరో పని వెతుక్కున్న రామచంద్ర

  మరో పని వెతుక్కున్న రామచంద్ర

  ఇక చేసేదేమీలేక జ్ఞానాంబ మన కుటుంబం ఈ రోజు ఇలాంటి పరిస్థితి లో ఉండడానికి కారణం ఆ స్వీట్ షాప్ కాబట్టి అది మూతపడడం ఏమాత్రం భావ్యం కాదు. అందుకే నేనే ఆ బాధ్యతను తీసుకుంటాను అని చెబుతుంది. ఇక ఆ నిర్ణయంతో రామచంద్ర ఎంతగానో మనో వేదన చెందుతాడు. చిన్నప్పుడు తమ కోసం ఎంతో కష్టపడిన తల్లి ఇప్పుడు మళ్ళీ మొదట్లోకి రావడం తనకు నచ్చడం లేదు అని బాధగా ఉంది అని చెబుతోంది. ఇక మరోవైపు రామచంద్ర మరో పని వెతుక్కుంటాడు. మరి ఈ నిర్ణయాలతో జానకి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 266
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X