Janaki Kalaganaledu march 29th: కోడలిపై కోపంతో కొడుకును దూరం పెట్టిన జ్ఞానాంబ.. అగ్గి రాజేసిన మల్లిక

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఎంతగానో ప్రయత్నం చేసే కోడలు అత్తగారి దగ్గర అనేక రకాల సమస్యలను దాటి ఎలా తన గమ్యాన్ని చేరుకుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక జ్ఞానాంబగా సీనియర్ హీరోయిన్ రాశి సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక తన అత్త కూతురును కాపాడాలి అని అనుకొని జానకి చేసిన ఒక ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. జానకి పై కూడా జ్ఞానాంబ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. భర్తతో సహా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. దీంతో భర్తతోపాటు బయటకు వచ్చిన జానకి అత్తగారి ఇంటి ముందే మరో కాపురం పెడుతుంది. మరి ఈ పరిణామాలతో జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది. మరి నేడు ప్రసారం కాబోయే 267 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

 జ్ఞానాంబ ఇంటి ముందే..

జ్ఞానాంబ ఇంటి ముందే..

జానకి చెప్పినా అబద్దాలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జ్ఞానాంబ భర్తతో సహా ఆమెను బయటకు పంపించేస్తుంది. ఇక చేసేదేమీలేక రామచంద్ర జానకి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు. ఇక జ్ఞానాంబ ఇంటి ముందే మరొక గుడిసె కట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఆ స్థలంలో ఉండకూడదు అని జ్ఞానాంబ చెప్పినప్పటికీ కూడా రామచంద్ర ఇది తనకు చెందిన స్థలం అని తన నాయినమ్మ ఇచ్చింది అని అక్కడే ఉంటాం అని చెబుతాడు. ఇక రామచంద్ర అలా చెప్పడంతో తల్లి జ్ఞానాంబ మరింత అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ మాటలు నీకు అనడం రాదు అని నీలో ఇంత మార్పు రావడానికి కారణం నీ భార్య అని పరోక్షంగా జానకిని తిడుతుంది.

జ్ఞానాంబ మొండితనం

జ్ఞానాంబ మొండితనం

ఇక జ్ఞానాంబ జానకి రామచంద్ర ఇద్దరికి కూడా దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక రామచంద్ర చూసుకోవాల్సిన స్వీట్ షాప్ బాధ్యతను కూడా తనే చూసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక స్వీట్ షాప్ ను తను ఎంతో కష్టపడి నిర్మించిన ఇప్పుడు దీన్ని కూడా రెండు ముక్కలు చేస్తే నేను తట్టుకోలేను అని రామచంద్ర నుంచి జ్ఞానాంబ పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది. ఇక తన ముందు కూడా కనిపించ వద్దు అంటూ రామచంద్రకు మరోసారి జ్ఞానాంబ చెబుతుంది. కానీ రామచంద్ర తల్లి పడే కష్టాన్ని చూడలేక స్వీట్ షాప్ కి వెళ్ళినప్పుడు సహాయం చేయాలని అనుకుంటాడు. కానీ అందుకు తల్లి ఏమాత్రం ఒప్పుకోదు. దీని ఎలా కొనసాగించాలో తనకు తెలుసు ఎవరి సహాయమూ అక్కరలేదని కూడా మొండిగా ప్రవర్తిస్తుంది.

 బయట పని కోసం రామ వెతుకులాట

బయట పని కోసం రామ వెతుకులాట

ఇక రామచంద్ర తల్లిని ఏమీ అనలేక స్వీట్ షాప్ నుంచి బయటకు వచ్చేస్తాడు. జీవనం కొనసాగించాలి కాబట్టి బయట ఎక్కడైనా పని చూసుకోవాలి అని తెలిసిన వాళ్ల దగ్గరికి వెళ్తాడు. అయితే ఒకప్పుడు రామచంద్ర దగ్గర పని చేసిన వ్యక్తిని కలిసి ఏదైనా పని ఉంటే ఇప్పించాలని అని అడుగుతాడు. అందుకు అతను ఏమాత్రం ఒకప్పుడు. నీ దగ్గర నేను పని చేసిన నేను ఇప్పుడు మా కార్ఖానాలో పని చేయించి పని వాడిలా చూడడం నాకు ఇష్టం లేదు అంటూ అతను పని ఇవ్వలేను అని చెప్తాడు. దీంతో చేసేదేమీ లేక రామచంద్ర కూడా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

రామ కోసం తల్లి ఆరాటం

రామ కోసం తల్లి ఆరాటం


అనంతరం ఆ వ్యక్తి జ్ఞానాంబకి ఫోన్ చేసి నీ కొడుకు తన దగ్గరకు పని కోసం వచ్చాడు అని కానీ పని కల్పించడానికి తనకు మనసు ఒప్పుకోలేదు అని కూడా అతను చెప్పడంతో తల్లి ఎంతగానో బాధపడుతుంది. ఎప్పుడు ఎవరి దగ్గర దేనికోసం చేయి చాచని తన కొడుకు ఈరోజు జానకి కారణంగా ఇతరులను పని అడగాల్సి వస్తోందని జ్ఞానాంబ ఆవేదన చెందుతుంది. ఇక రామచంద్ర ఇంటికి రాగానే తనకు పని ఎక్కడా దొరకలేదు అని ఎంతో దీనంగా చెబుతాడు. ఇక అప్పుడే రామచంద్రకు ఫోన్ వస్తుంది. మీకు పని కావాలని అడిగారు కదా మా దగ్గర ఉంది చేస్తారా అని అనడంతో రామచంద్ర ఎంతగానో సంతోషించి ఎలాంటి పనైనా సరే చేస్తాను అని ఉంటాడు. అయితే ఆ పని తన తల్లి ఇప్పించినట్లు రామచంద్ర గ్రహిస్తాడు. అనంతరం రామచంద్ర మళ్ళీ ఎప్పటిలానే చదువుకోవాలని సలహా ఇస్తాడు.

Recommended Video

KGF Chapter 2 Trailer Sensational Record మామూలు అరాచకం కాదు | Filmibeat Telugu
మరో అనుమానాలు కలిగించిన మల్లిక

మరో అనుమానాలు కలిగించిన మల్లిక

ఇక జానకి అన్నయ్య యోగి అమెరికా నుంచి జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా గిఫ్టులు పంపిస్తాడు. కానీ ఆ విషయంలో మల్లిక విభేదిస్తుంది. కావాలని మిమ్మల్ని శాంత పరచడానికి జానకి ఈ విధంగా ప్లాన్ వేసింది అని ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తే మళ్లీ మీకు దగ్గర కావచ్చని జానకి కావాలని ప్లాన్ చేస్తుంది అని మల్లికా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. దీంతో మల్లిక మాటలు నమ్మిన జ్ఞానాంబ జానకిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక మరోవైపు మల్లిక జానకి చాలా కష్టాలు పడుతుంది అంటూ ఆమె అన్నయ్య యోగిబాబుకు ఫోన్ చేస్తుంది. అంతేకాకుండా కొన్ని వీడియోలను కూడా పంపిస్తుంది మరి జానకి కష్టాలను చూసి యోగి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X