Janaki Kalaganaledu march 2nd: అర్ధరాత్రి జానకి, రామ నైట్ క్లాసెస్.. మల్లిక కంట పడిన ఎస్కేప్ ప్లాన్!

జానకి కలగనలేదు సీరియల్ మరో కీలక మలుపు తిరగనుంది. వెన్నెల పెళ్లి చర్చలతో జానకి జీవితం కూడా ప్రమాదంలో పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. తన ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన ఏకైక కూతురు వెన్నలకు పెళ్లి చేయాలని జ్ఞానాంబ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతోంది. ఇక వెన్నెలకు ప్రేమ పెళ్లి చేయడానికి ఏ మాత్రం ఇష్టపడని జ్ఞానాంబను జానకి తెలియకుండా చీట్ చేస్తుంది. వెన్నెల ప్రేమ పెళ్లిని కాస్త పెద్దలు కుదిర్చిన పెళ్లిగా పూర్తి చేయాలని జానకి ప్లాన్ వేస్తుంది. ఇక మరోవైపు వెన్నలను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే విదంగా మల్లిక కూడా ఆలోచిస్తుంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 248 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ముందే తెలుసుకుందాం పదండి.

అనుకున్నట్లే వెన్నెల పెళ్లి..

అనుకున్నట్లే వెన్నెల పెళ్లి..

వెన్నెల తన ప్రేమించిన వాడి తో పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. అందుకే జానకి వెన్నెల ప్రాణాలు కాపాడేందుకు ప్రేమించిన వాడితోనే పెళ్లి చేయాలని అనుకుంటోంది. ప్రేమించిన దిలీప్ తన ఫ్యామిలీకి చెందిన వాడే అంటూ జానకి జ్ఞానాంబకు చెబుతుంది. ఇక మొత్తానికి వెన్నెల ప్రేమ పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహం గా మార్చడానికి జానకి ఊహించని ప్రణాళికలు రచిస్తోంది. అనుకున్నట్లుగానే జ్ఞానాంబతో పాటు దిలీప్ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటారు.

వెన్నెల భవిష్యత్తు కోసమే..

వెన్నెల భవిష్యత్తు కోసమే..

అయితే తన అత్త గారు అయినా జ్ఞానాంబను మోసం చేస్తున్నాము అని ఆలోచనతో జానకి కొంత ఆందోళన చెందుతూ ఉంటుంది. ఈ తరుణంలో రామచంద్ర ఆమెకు మరోసారి ధైర్యం చెబుతాడు ఒక మంచి పని చేసే ముందు ఇలాంటి సమస్యలు ఆలోచనలు రావడం సహజమే అని ఫైనల్ గా మనం చేసేది మన వెన్నెల మంచి భవిష్యత్తు కోసమే అని ధైర్యం చెబుతాడు. అయినప్పటికీ జానకి టెన్షన్ లో అత్తయ్యకు నిజం తెలిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడానికే కష్టంగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది.

పెద్ద ప్లాన్ ఉంది..

పెద్ద ప్లాన్ ఉంది..

మరోవైపు వెన్నెలను తన తమ్ముడు పండు గాడి కి ఇచ్చి పెళ్లి చేయాలని జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక ఎంతగానో ఆలోచిస్తుంది. అయితే మల్లిక ఎంత ఆలోచించినా కూడా లాభం ఉండదు. అంతే కాకుండా ఆమె మనసులో అనేక రకాల అనుమానాలు కలుగుతుంటాయి. అసలు పెళ్లి అంటేనే కన్నీళ్లు పెట్టుకుబ్ వెన్నెల తను ప్రేమించిన వాడిని కాదని ఇప్పుడు జానకి చూసిన సంబంధం ఎలా చేసుకుంటుంది అని ఆలోచిస్తుంది. అంతే కాకుండా దీని వెనుక ఏదో పెద్ద ప్లాన్ దాగి ఉంది అని కూడా అనుకుంటుంది.

మల్లిక అబద్ధాలు

మల్లిక అబద్ధాలు

అయితే జానకి అర్ధరాత్రి సమయంలో కేకులు తయారు చేసి అలసిపోవడం వలన ఆమె విశ్రాంతి తీసుకోవాలి అని చెబుతుంది. ఇక అలా చెప్పడం ఏమాత్రం తట్టుకోలేకపోయిన వెన్నెల జానకి మళ్లీ పని చెప్పాలి అనుకుంటుంది. ఇక స్టవ్ దగ్గర వంట చేస్తూ ఉంటే తన చేయి కాలింది అనే అబద్ధం చెప్పిన మల్లిక వంట ఎలా చేయాలి అని బాధపడుతూ ఉంటుంది. ఇక జానకి వెంటనే నేను వంట చేస్తానని చెబుతుంది. దీంతో మల్లిక ఎంతగానో ఆనందపడుతుంది.

పెళ్లికి వెళ్లడానికి సిద్దమైన జానకి రామ

పెళ్లికి వెళ్లడానికి సిద్దమైన జానకి రామ

ఆ తర్వాత జ్ఞానాంబ తన భర్తతో కలిసి అర్జంటుగా బయటికి వెళ్ళే పని ఉందని ఆ సమయంలో కార్ఖానాలో పనిచేసే సుబ్బయ్య కూతురు పెళ్లికి వేరే వాళ్ళని పంపించాలని అనుకుంటుంది. విష్ణు మల్లికలతో సారె ఇచ్చి పంపించాలని అనుకుంటుంది. కానీ అప్పుడే విష్ణు తనకు పని ఉంది అని చెప్పడంతో జానకి వచ్చి రామచంద్రతో కలిసి నేను ఇస్తాను అంటుంది. అయితే అర్ధరాత్రి పని చేసే అలిసిపోయారు కాబట్టి మళ్లీ పెళ్లికి ఎలా వెళ్తావు అని జ్ఞానాంబ రామచంద్ర ఇద్దరు జానకిని ప్రశ్నిస్తారు. ఇక ఏమి పర్వాలేదు అంటూ జానకి పెళ్లికి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

అందుకే జానకి వెళ్లలేదు

అందుకే జానకి వెళ్లలేదు

ఇక ఆ తర్వాత జానకి పెళ్లికి వెళ్ళలేదు అనే విషయం తెలుస్తుంది. కేవలం రామచంద్ర మాత్రమే పెళ్లికి వెళ్లి సారె పెట్టాడు అని అందరూ అనుకుంటున్నట్లుగా మల్లిక జ్ఞానాంబకు చెబుతుంది. మొదట ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని జ్ఞానాంబ జానకి రాగానే అసలు నిజం తెలుసుకుంటుంది. నిజంగానే జానకి పెళ్లికి రాలేదు అని రామచంద్ర చెబుతాడు. ఎందుకంటే పెళ్ళి కూతురుకి మెట్టెలు తీసుకురావడానికి సమయానికి ఎవరూ లేకపోవడంతో ఆ బాధ్యతను జానకి తీసుకున్నట్లుగా రామచంద్ర చెబుతాడు.

గొడ దూకిన జానకి రామ

గొడ దూకిన జానకి రామ

ఇక జానకి ఐపీఎస్ చదువు అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో స్పెషల్ గా ఐపీఎస్ కు సంబంధించిన మరొక ముఖ్యమైన ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నైట్ క్లాసెస్ ఉండడంతో రామచంద్ర సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా గోడదూకి జానకిమి తీసుకువెళ్లాలని అనుకుంటాడు. ఇక అదే సమయంలో వారు గోడ దూకుతూ ఉండగా ఇద్దరిని మల్లిక చూస్తుంది. ఇక మల్లిక ఆ విషయంలో ఎలాంటి నిజాలు తెలుసుకుంటుంది అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X