twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu march 30th: కష్టాల్లో జానకి, రామ రొమాన్స్.. అన్ని మర్చిపోయి పరుపు చినిగిపోయేలా..

    |

    జానకి కలగనలేదు సీరియల్ కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే కాకుండా యువతను కూడా ఆకట్టుకుంటోంది. క్యూట్ రొమాంటిక్ సీన్స్ తో కూడా సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. జానకి, రామచంద్ర క్యారెక్టర్ల మధ్యలో కొనసాగుతున్న ప్రేమ కథకు అందరూ చాలా తొందరగా కనెక్ట్ అవుతున్నారు.

    ఇక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్న జానకి ఎలాంటి సమస్యలు దాటుకుంటూ తన గమ్యాన్ని చేరింది? చదువంటేనే ఇష్టం లేని అత్తగారికి తెలియకుండా జానకి ఐపీఎస్ చదువును ఎలా పూర్తి చేసింది అనే పాయింట్ ఆసక్తిని కలిగిస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 268 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

    రివర్స్ అయిన జానకి ప్లాన్

    రివర్స్ అయిన జానకి ప్లాన్

    తన అత్త జ్ఞానాంబ కూతురు వెన్నెలకు ప్రేమ పెళ్లి చేయాలని జానకి వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. వెన్నెల ప్రేమించిన వ్యక్తి తమ కుటుంబ సభ్యుల వ్యక్తి అని అబద్ధాలు చెప్పి పెద్దలు కుదిర్చిన వివాహంగా చేయాలని అనుకున్న జానకి గురించి జ్ఞానాంబ నిజం తెలుసుకుంటుంది. మల్లిక అసలు నిజం చెప్పడంతో జ్ఞానాంబ ఒక్క సారిగా షాక్ అవుతుంది.

    వెన్నెల చనిపోతుంది అని భయంతో అలా చేసినప్పటికీ జ్ఞానాంబ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆమెను బయటకు పంపించేస్తుంది. అంతేకాకుండా భర్త రామచంద్ర కూడా జానకికి మద్దతు ఇచ్చాడు. దీంతో కొడుకు రామను కూడా ఆమె బయటకు పంపించేస్తుంది.

    జ్ఞానాంబ ఇంటిముందే గుడిసెలో

    జ్ఞానాంబ ఇంటిముందే గుడిసెలో

    ఇక పరిస్థితుల్లో చేయి దాటిపోవడంతో జానకి రామచంద్ర ఎంత బ్రతిమాలినా కూడా జ్ఞానాంబ ఏమాత్రం క్షమించదు. దీంతో రామచంద్ర బయటకు వెళ్ళలేక జ్ఞానాంబ ఇంటి ముందే మరొక గుడిసె కట్టుకుని అక్కడ భార్యతో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మరి కొన్ని సమస్యలను జానకినీ మరింత ఆందోళనలో పడేలా చేస్తాయి.. మళ్లీ ఎలాగైనా జానకిని ఇక్కడినుంచి పంపేయాలని తోడికోడలు మల్లిక మరోసారి ప్లాన్ వేస్తుంది.

    కోపం కలిగేలా అబద్ధాలు

    కోపం కలిగేలా అబద్ధాలు

    జానకి కుటుంబ సభ్యులకు థ్రిల్ ఇవ్వాలని ఆమె అన్నయ్య యోగి అమెరికా నుంచి అందరికీ ప్రత్యేకంగా కానుకలు పంపిస్తాడు. అయితే మల్లిక మాత్రం ఆ విషయంలో జానకిపై కుళ్ళుతో కోపం కలిగేలా అబద్ధాలు చెబుతుంది. మీకు కోపం చల్లారే విధంగా చేయాలి అని జానకి ఈ విధంగా గిఫ్ట్ లు పంపించేలా ప్లాన్ చేసినట్టు ఉందని చెప్పడంతో జ్ఞానాంబ ఆ విషయం నిజం అనుకొని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోసారి ఇలా కాకా పట్టే విధంగా తన దగ్గర వేషాలు వేయకూడదు అని హెచ్చరిస్తుంది.

    గుడ్ న్యూస్ చెప్పిన జానకి

    గుడ్ న్యూస్ చెప్పిన జానకి

    తను ఆ విధంగా ఎన్నటికీ అలా చేయను అని జానకి చెప్పినప్పటికీ జ్ఞానాంబ నమ్మదు. అలాగే రామచంద్ర కూడా జానకి అలా చేయదు అని చెప్పగా.. మళ్ళీ నీవు నీ భార్యకు సపోర్ట్ చేస్తున్నావు అని అతనిన్ని కూడా తల్లి తిడుతుంది. ఇక ఆ తర్వాత కన్ఫ్యూజన్లో ఉన్న జానకికి ఆమె అన్నయ్య యోగి బాబు అమెరికా నుంచి ఫోన్ చేస్తాడు.

    తన కొడుకు పుట్టాడు అంటూ.. మీరు అత్తా మామలు కాబోతున్నట్లు శుభవార్త చెప్పడంతో జానకి ఎంతగానో సంతోషిస్తుంది. కరెక్ట్ గా డెలివరీ సమయానికి నీకు అలాగే మీ ఇంట్లో వారోకి గిఫ్ట్స్ చేరేలా పార్సిల్ చేసినట్లుగా చెప్పడంతో అప్పుడు జానకి అర్థం చేసుకుంటుంది. కానీ జరిగిన గొడవ గురించి మాత్రం తన అన్నయ్యకి చెప్పదు.

    జ్ఞానాంబపై యోగి కోపం

    జ్ఞానాంబపై యోగి కోపం

    ఇక ఆ తర్వాత మల్లిక జానకి విషయంలో మరొక ప్లాన్ వేస్తుంది. ఎప్పటికైనా అత్తగారు మళ్ళీ జానకి పై జాలి పడకుండా ఉండాలి అని.. మళ్ళీ జానకి ఇంట్లోకి వస్తే నాకు గౌరవం దక్కదు అని ఆలోచించి ఇక్కడ జరిగే విషయాలను యోగి బాబుకు చెప్పాలి అని అనుకుంటుంది. వెంటనే ఫోన్ చేసి ఇక్కడ అత్తగారు జానకిని కష్టాలు పెడుతున్నారు అని జానకి బయట గుడిసెలో ఉంటుంది అని చెబుతుంది.

    అంతేకాకుండా ఒక వీడియో కూడా పంపిస్తుంది. దీంతో యోగిబాబు జ్ఞానాంబ పై మళ్లీ కోపాన్ని పెంచుకుంటాడు. వెంటనే జానకి స్నేహితురాలు అయిన శ్రావణికి విషయాన్ని చెప్పి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుని తనకు చెప్పాలి అని అంటాడు.

    Recommended Video

    RRR Movie పై Babu Gogineni వివాదాస్పద రివ్యూ | Filmibeat Telugu
    కష్టాల్లో.. జానకి రామ రొమాన్స్

    కష్టాల్లో.. జానకి రామ రొమాన్స్

    అయితే ఒక వైపు పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్న సరే జానకి రామచంద్ర మాత్రం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక రామచంద్ర హ్యాపీగా బెడ్ పైనే ఒక్కరే పడుకోవాలి అని జానకి చెప్పడంతో అందుకు అతను ఒప్పుకోడు. మీరు చదువుకుంటారు కాబట్టి కింద అస్సలు పడుకోవద్దని వాదిస్తాడు. ఇక పరుపు కింద వేసుకొని పడుకుంటాను అని జానకి అంటుంది. ఇక ఇద్దరు పరుపును చేరొకవైపు లాగడంతో అది చినిగిపోతుంది.

    అనంతరం ఇద్దరు నవ్వుకుంటారు. ఇక మరోవైపు లీలావతి జ్ఞానాంబ ముందే జానకిని ప్రశ్నిస్తుంది. మీ ఆయన మరొక కర్ఖానాలో పనిచేస్తున్నాడు అని విన్నాను అంటూ.. మీ అత్త కోడళ్ల గొడవ గురించి ప్రస్తుతం ఊరంతా మాట్లాడుకుంటున్నారు అని లీలావతి మరింత ఘాటుగా మాట్లాడుతుంది. ఇక వీరి విషయంలో యోగి బాబు తీసుకునే నిర్ణయం కూడా కథను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 268
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X