twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu march 31st: జానకి, రామ విడాకులు అంటూ షాక్ ఇచ్చిన మల్లిక.. బాధలో జ్ఞానాంబ!

    |

    జానకి కలగనలేదు సీరియల్ ఎంతో ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. ఐపీఎస్ అవ్వాలని ఎన్నో కలలు కన్న జానకి అనుకోకుండా అత్తగారి ఇంట్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. అత్తగారి కూతురి పెళ్లి విషయంలో జరిగిన పరిణామాలు జానకి జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. ఇక జానకితో పాటు ఆమె భర్త రామచంద్ర కూడా ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వస్తుంది. చేసేదేమీ లేక జ్ఞానాంబ ఇంటి ముందే మరొక గుడిసె కట్టుకొని జీవితం కొనసాగిస్తూ ఉంటారు.

    ఇక జానకి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుందని తొడి కోడలు మల్లిక మరింత కఠినంగా ఆలోచించి జానకిపై నిందలు వేయాలని చూస్తుంది. దీంతో జానకి మరింత ఇబ్బందుల్లో పడుతుంది. ఇక నేడు ప్రసారం కాబోయే 269 ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    తెలియని పరిస్థితుల్లో..

    తెలియని పరిస్థితుల్లో..

    తన కూతురు పెళ్లి విషయంలో అనవసరంగా జానకి అబద్ధాలు చెప్పింది అని జ్ఞానాంబ ఎంతగానో అసంతృప్తి వ్యక్తం చేసి.. జానకి తో పాటు ఆమె భర్త ని కూడా బయటకు పంపించేస్తుంది. జ్ఞానాంబ కూతురు వెన్నెలకు ఎలాగైనా ప్రేమించిన వాడి తో పెళ్లి చేయాలని జానకి వేసిన ప్లాన్ రివర్స్ అవుతుంది. ఇక కొడుకు రామచంద్ర కూడా భార్యకు సహకరించాడని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా జ్ఞానాంబ బయటకు పంపించేస్తుంది. ఆ తరువాత ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రామచంద్ర జ్ఞానాంబ ఇంటి ముందే తన నాయనమ్మ ఇచ్చిన ఒక స్థలంలో గుడిసెను నిర్మించుకుని ఉంటాడు.

    విడాకులు ఇవ్వాలని..

    విడాకులు ఇవ్వాలని..

    ఇక ప్రతిసారీ జానకి విషయంలో తోడికోడలు మల్లిక అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. జానకి ఎప్పుడైనా మళ్లీ ఇంట్లోకి ప్రవేశిస్తే తన పెత్తనానికి భంగం కలుగుతుంది కాబట్టి మళ్ళీ ఆమెను రానివ్వకూడదు అని ఆలోచిస్తుంది. పూర్తిగా ఆమెను ఇక్కడి నుంచి బయటకు పంపించాలని మల్లిక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే జానకి స్నేహితురాలు శ్రావణి వస్తుంది.

    జానకి ఆ గుడిసె దగ్గర పడుతున్న ఇబ్బందులను చూసిన శ్రావణి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా మూర్ఖురాలు అయినటువంటి మీ అత్తగారు ఎంత కష్టపెడుతున్నా కూడా ఇలా ఎలా ఉంటున్నావు అని ప్రశ్నిస్తుంది. వెంటనే రామచంద్ర కు విడాకులు ఇవ్వాలని కూడా శ్రావణి చెప్పడంతో జానకి అందుకు ఏ మాత్రం ఒప్పుకోదు.

    యోగి రివెంజ్ ప్లాన్?

    యోగి రివెంజ్ ప్లాన్?

    మా అత్తగారు మంచివారే కానీ కొన్ని అపోహల కారణంగా ఆ ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. మళ్లీ ఈ సమస్యలన్నీ ఎప్పటికైనా పరిష్కారమవుతాయి. మళ్లీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఉంటామని జానకి పాజిటివ్ గా చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ జానకి ఎంత చెప్పినప్పటికీ కూడా శ్రావణి ఆ మాటలను పట్టించుకోదు. ఇక ఆ తరువాత శ్రావణి జరిగిన విషయాలను జానకి అన్నయ్య యోగికి చెబుతుంది. ఇక అమెరికాలో ఉన్న యోగి ఇండియాకు తిరిగి వచ్చి జ్ఞానాంబకు సరైన బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. అంతేకాకుండా ఆమె పై పోలీస్ కేసు కూడా నమోదు చేయాలి అని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు.

    జానకిపై తప్పుడు ఆలోచన

    జానకిపై తప్పుడు ఆలోచన

    ఇక జానకి శ్రావణి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా విడాకుల విషయం కూడా ప్రస్తావనకు రావడంతో అదే విషయాన్ని మల్లిక తన అత్తకు చెప్పాలని అనుకుంటుంది. ఇక మరోవైపు జ్ఞానాంబ స్వీట్ షాప్ లో ఉండగా అప్పుడే లీలావతి అక్కడికి వస్తుంది. నిన్ను చూస్తే నాకు చాలా బాధ కలిగుతుంది అని నీ కోడలు.. కొడుకుని అలా తనవైపుకి తీసుకోవడం ఏమాత్రం బాగోలేదు అని చెబుతోంది.

    అంతేకాకుండా అటువైపు నుంచి జానకి వెళుతుండగా లీలావతి పిలిచి మరి కఠినంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కుటుంబం విడి పోయింది.. రేపోద్దున ఆస్తి పంపకాలు కూడా జరగవచ్చునని లీలావతి మరొక చిచ్చు పెడుతుంది. ఇక తెలియని పరిస్థితుల్లో మరోసారి ఈ విషయంలో జానకి గురించి తప్పుగా ఆలోచిస్తుంది.

    మల్లిక అబద్ధాలు

    మల్లిక అబద్ధాలు

    ఇక జ్ఞానాంబ ఇంటికి తిరిగి రాగానే మల్లిక మరొక విషయాన్ని చెబుతుంది. జానకి స్నేహితురాలు శ్రావణి ఇక్కడికి వచ్చింది అని వాళ్ళిద్దరూ కూడా విడాకులకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుతున్నారు అని అంటుంది. జానకి మీ అబ్బాయి రామచంద్రకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తన స్నేహితురాలికి చెబుతుంటే నేను విన్నాను అంటూ మల్లిక చెబుతుంది.

    హెచ్చరించిన గోవిందరాజులు

    హెచ్చరించిన గోవిందరాజులు

    అప్పుడే గోవింద రాజులు వచ్చి జానకి విషయంలో మరొకసారి తప్పుగా మాట్లాడొద్దు అని హెచ్చరిస్తాడు. అయినప్పటికీ మల్లిక ఏ మాత్రం తగ్గకుండా కావాలంటే మీరు అడగండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా విడాకుల ప్రస్తావన వచ్చిందా లేదా అనే విషయం మాత్రమే అడగండి అని అంటుంది. చాలా తెలివిగా సమాధానం ఇచ్చిన మల్లిక ఒకవేళ ఆ ప్రస్తావన రాలేదు అంటే మీరు ఏం చేసినా కూడా అందుకు సిద్ధమే అని కూడా అంటుంది.

    కష్టాలు పడుతున్న రామ

    కష్టాలు పడుతున్న రామ

    ఇక మల్లిక చెప్పిన మాటలను నమ్మిన జ్ఞానాంబ మరోసారి జానకిని అడగాల్సిన అవసరం లేదని కూడా గోవిందరాజుల చెబుతుంది. ఇక జానకి రామచంద్రను తీవ్రస్థాయిలో ఇబ్బందికి గురి చేస్తుంది అని ఆలోచిస్తుంది. అతను భోజనం కూడా సరిగా చేయడం లేదు అని తెలుసుకుంటుంది. ఇక జానకి తో వంట చేస్తూ.మ్ చాలా ఇబ్బంది పడుతున్న కొడుకును చూసిన జ్ఞానాంబ మనోవేదనకు లోనవుతుంది. మరి జ్ఞానాంబ వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 269
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X