Janaki Kalaganaledu march 3rd: మరోసారి బెడిసికొట్టిన మల్లిక ప్లాన్.. జ్ఞానాంబ పవర్ఫుల్ కౌంటర్

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ చదవాలని మరోసారి జానకి భర్తతో కలిసి నైట్ క్లాసెస్ కు వెళుతుంది. ఇక వారిని ఎలాగైనా అత్త జ్ఞానాంబకు పట్టించాలని చిన్న కోడలు మల్లిక అనేక రకాల ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు వెన్నెల పెళ్లిని కూడా చెడగొట్టాలని అనుకుంటుంది. జ్ఞానాంబ ఏకైక కూతురు వెన్నలకు అలాగే తన తమ్ముడికి పెళ్లి జరిపిస్తే ఆస్తిలో వాటా దక్కుతుందని మల్లిక ప్లాన్ వేస్తుంది. ఇక వెన్నెల ప్రేమ పెళ్లిని జానకి తన తెలివితో కాస్త పెద్దలు కుదిర్చిన పెళ్లిగా పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 249 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ముందే తెలుసుకుందాం పదండి.

 ఎలాగైనా ఆ గుట్టు తెలుసుకోవాలని..

ఎలాగైనా ఆ గుట్టు తెలుసుకోవాలని..

మొత్తానికి వెన్నెల ప్రేమ విషయం ఇంట్లో తెలియకుండా జానకి వారి ప్రేమ వివాహాన్ని పెద్దలు కుదిర్చిన వివాహంగా మార్చేస్తుంది. ఇక వెన్నెల తను ప్రేమించిన దిలీప్ తోనే పెళ్లి జరుగుతుండటంతో రోజు ఫోన్ లో సంతోషంగా మాట్లాడుతుంది. ఇక వెన్నెల పెద్దలు కుదిర్చిన వివాహం ఇంతకుముందు చేసుకొను అని చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు ఇంత సంతోషంగా ఫోన్ లో మాట్లాడుతోంది అని మల్లిక అనుమానంతో ఉంటుంది. ఎలాగైనా ఆ గుట్టు తెలుసుకోవాలని అనుకుంటుంది.

 పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు?

పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు?

ఇక జానకి రామచంద్ర ఇద్దరిని కూడా జ్ఞానాంబ ఒక పెళ్లికి వెళ్లమని చెబుతుంది. మన కర్ఖానాలో పని చేసే సుబ్బయ్య కూతురి పెళ్లికి వెళ్లి ఈ సారె పెట్టాలని అంటుంది. ఇక అందుకు జానకి రామ ఇద్దరు కలిసి వెళ్లగా ఆ పెళ్లిలో కేవలం రామచంద్ర మాత్రమే కనిపిస్తాడని మల్లికకు తెలుస్తుంది. కావాలని లీలావతిని తీసుకు వచ్చి మరి జ్ఞానాంబకు చెప్పిస్తుంది. మొదట ఆ విషయాన్ని నమ్మని జ్ఞానాంబ ఆ తరువాత జానకి రామ రాగానే ప్రశ్నిస్తుంది.

రామ మరో అబద్ధం..

రామ మరో అబద్ధం..

జానకి పెళ్లికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లింది అని ప్రశ్నించడంతో రామ మరొక అబద్ధం చెబుతాడు. అప్పుడే జానకి పెళ్లి కూతురు కోసం మెట్టెలు తీసుకు రావడానికి వెళ్లింది అని ఆ సమయంలో నేను మరొక తెలిసిన చుట్టాలతో మాట్లాడుతూ ఉండిపోయాను అని రామ అబద్ధం చెబుతాడు. ఇక జనకి కూడా రామ చెప్పిన అబద్దానికి ఆశ్చర్య పోయి మౌనంగా ఉంటుంది. ఆ తరువాత జ్ఞానాంబ ఎక్కడికి వెళ్లినా కూడా ఇద్దరు కలిసే వెళ్లాలని అంటుంది. ఇక మల్లిక మాత్రం వారి మాటలను అస్సలు నమ్మదు. ఎదో అబద్ధాలు చెబుతున్నారు అని అంటుంది.

అంతకంటే మరొక గొప్ప ఆనందం ఉండదు..

అంతకంటే మరొక గొప్ప ఆనందం ఉండదు..

అయితే అత్తగారిని మోసం చేస్తున్నాము అనే ఆలోచనతో జానకి మరింత భయపడుతుంది. మీ మీద మీ అమ్మగారు ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. అలాంటిది ఇలా వరుసగా అబద్ధాలు చెప్పుకుంటూపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉన్నట్లుగా జానకి ఆందోళన చెందుతుంది. అయితే మనం ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే మంచి గురించి మాత్రమే ఆలోచించాలి అని మీరు రేపు ఐపీఎస్ అయితే అంతకంటే మరొక గొప్ప ఆనందం ఉండదని ప్రస్తుతం మనం పడుతున్న ఇబ్బందులు కూడా చాలా చిన్నవి అని ధైర్యం చెబుతాడు.

 గోడ దూకిన రామ, జానకి

గోడ దూకిన రామ, జానకి

ఇక మరొక రోజు జానకి రామ చంద్ర ఇద్దరు కూడా ఐపీఎస్ నైట్ క్లాసెస్ కోసం మెల్లగా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. ఇక జానకిని కోచింగ్ సెంటర్ దగ్గర దింపేందుకు రామచంద్ర ముందుగానే గోడ పక్కన బైక్ పెట్టి ఉంచుతాడు. ఇక జానకిని గోడదూకిస్తాడు. అయితే అదే సమయంలో మల్లిక కూడా వారిని గమనిస్తు వీరు అందరి కళ్ళు కప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చాలా అనుమానంగా చూస్తుంది. ఇక వెంటనే ఆ విషయాన్ని తెలుసుకోవాలి అని తన భర్త విష్ణునీ ప్రత్యేకంగా పిలిచి నన్ను కూడా ఈ గోడ దూకిమాచాలి అని చెబుతుంది. కానీ విష్ణు మాత్రం అంత సాహసం చేయలేను అని చెప్పడంతో జరిగిన విషయాన్ని జ్ఞానాంబకి తెలియాలని మల్లికా ఆమెను నిద్ర లేపుతుంది.

మల్లిక ప్లాన్ డిజాస్టర్

మల్లిక ప్లాన్ డిజాస్టర్

మరోసారి మీ కళ్ళుగప్పి జానకి రామచంద్ర ఇద్దరు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు అని.. అది నా కళ్లారా చూసాను అని అంటుంది. మల్లిక మాటలను మొదట జ్ఞానాంబ నమ్మక పోవడంతో మళ్ళీ వారి గది వద్దకు కూడా తీసుకు వెళ్తుంది. కానీ రామచంద్ర ముందుగానే దుప్పటి కప్పి వాటి కింద దిండ్లు పెట్టే ఉంచుతాడు. ఇక రామ జానకి ఇద్దరు కూడా పడుకున్నట్లు గానే కనిపించడంతో మల్లిక ప్లాన్ మరొకసారి డిజాస్టర్ అవుతుంది. అవి కూడా అబద్ధమని చూపించే క్రమంలో జ్ఞానాంబ తనను ఆపేస్తుంది. మరోసారి నీ మాటలు నమ్మను అంటూ వెంటనే వెళ్లి పడుకోవాలి అని చెబుతోంది. అయితే మళ్ళీ జానకిరామ ఇద్దరూ ఇక్కడి నుంచే తిరిగి వస్తారు కాబట్టి మల్లిక ఆ గోడ దగ్గర కాపలా కాస్తూ ఉంటుంది. మరి జానకి రామ మల్లిక కంట పడకుండా ఎలా ఎస్కేప్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X