Janaki Kalaganaledu march 4th: మల్లిక నుంచి తృటిలో తప్పించుకున్న జానకి.. జ్ఞానాంబకు సర్‌ప్రైజ్
జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరగనుంది. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని జ్ఞానాంబ పెద్ద కోడలు చాలా సీక్రెట్ గా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. అయితే జానకి చదువుకోవడం మాత్రం జ్ఞానాంబకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. కానీ ఆమె భర్త రామ మాత్రం జానకిని చదివించేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. మరోవైపు అర్ధరాత్రి వీరు ఎక్కడికో వెళుతున్నారని మల్లిక ఎలాగైనా అత్త జ్ఞానాంబకు పట్టించాలని అనేక రకాల ప్రణాళికలు రచిస్తోంది.
ఇక జ్ఞానాంబ చిన్న కూతురు వెన్నెల పెళ్లికి కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. జ్ఞానాంబ ఏకైక కూతురు వెన్నలకు అలాగే తన తమ్ముడికి పెళ్లి జరిపిస్తే ఆస్తిలో వాటా దక్కుతుందని మల్లిక కూడా మరో ప్లాన్ వేస్తుంది. అందుకే వెన్నెలకు వచ్చిన సంబంధాన్ని చెడగొట్టాలని అనుకుంటుంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 250 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ముందే తెలుసుకుందాం పదండి.

రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని..
జానకి ఐపీఎస్ చదువును పూర్తి చేయడానికి రామచంద్ర సూచించినట్లుగా నైట్ క్లాసెస్ కి వెళ్లి చదువుకుంటుంది. అయితే ఈ క్రమంలో ప్రతి రోజు ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి రామచంద్ర గోడదూకి కోచింగ్ సెంటర్ కు వెళుతూ ఉంటారు. అయితే ఒకసారి వారు బయటకు వెళ్ళిపోవడం చూసిన మల్లిక నిజం తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అంతేకాకుండా ఆ విషయాన్ని జ్ఞానాంబతో చెప్పాలి అని కూడా అనుకుంటుంది. కానీ ఆమె రచించిన ప్లాన్స్ ఏవి కూడా మొదట్లో అంతగా సక్సెస్ కావు. దీంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని మల్లిక ఆలోచిస్తుంది.

జానకి డ్రీమ్ కోసం రామ తాపత్రయం
జానకి చదువు విషయంలో రామచంద్ర ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆలోచిస్తాడు. ఒకవైపు తల్లికి కోడలు చదువుకోవడం ఇష్టం లేకపోయినా కూడా రామచంద్ర మాత్రం భార్యకు సపోర్ట్ చేస్తాడు. కుటుంబ పరిస్థితుల ప్రభావం వలన నేను ఎలాగో అనుకున్నట్లుగా పోలీస్ కాలేకపోయాను కనీసం మీరు అయినా మీరు అనుకున్న కలలను నిజం చేసుకోవాలి అని పోలీసాఫీసర్ కావాలని చాలా సపోర్ట్ చేస్తాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమెను ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ కు ప్రతిరోజు తీసుకువెళుతూ ఉంటాడు.

నిద్రలోకి జారుకున్న మల్లిక
ఇక జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని వారు ప్రతిరోజూ గోడ దూకే చోట కాచుకుని ఉంటుంది. నిద్ర వచ్చినా కూడా అక్కడే మెలకువగా కాపలా కాయాలి అని అనుకుంటుంది. జానకి రామ రాగానే జ్ఞానాంబను నిద్రలేపి వారిని నిర్దాక్షిణ్యంగా నిలదీసేలా చేయాలని ప్రణాళికలు రచిస్తుంది. అయితే మల్లిక అలా అనుకున్న కొద్ది సేపటికే నిద్రలోకి జారుకొని గోడ దగ్గర వాలిపోతుంది. ఇక మల్లికను గోడ దగ్గర చూసినా రామచంద్ర జానకి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు.

మరొకసారి అలా జరగకుండా..
ఇక ఉదయాన్నే గోడ దగ్గర నిద్ర లేచిన మల్లిక షాక్ కి గురి అవుతుంది ఆమెను చూసిన పనిమనిషి కూడా ఆశ్చర్యపోతుంది. అసలు మీరు ఇక్కడ ఎందుకు పడుకున్నారు అని అనేక రకాల సందేహాలను అడుగుతుంది. ఇక మల్లిక తను చేసిన పొరపాటును గుర్తు చేసుకుని మరొక సారి ఇలా జరగకుండా చూడాలని జానకి రామ చంద్రులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచి పెట్టకూడదు అని అనుకుంటుంది.

జ్ఞానాంబకు సర్ ప్రైజ్
ఇక ఉదయాన్నే జ్ఞానాంబ గోవిందరాజులు నిద్ర లేవగానే వారికి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక సర్ ప్రైజ్ ఇస్తారు వారి 25వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. దానికి జ్ఞానం గోవిందరాజులు ఇద్దరు కూడా ఎంతగానో సంతోషిస్తారు. అసలు ఈ ఆలోచన చేసింది జానకి గారే అంటూ రామచంద్ర తన తల్లిదండ్రులకు చెబుతాడు. దీంతో గోవిందరాజులు తన పెద్దకోడలిని మరొకసారి పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇక జానకి ని అలా పొగడగానే మరోవైపు చిన్న కోడలు మల్లిక ఒక్కసారిగా అసూయ చెందుతుంది.

పండగ వాతావరణం
అసలే ఇప్పటికీ పెద్ద కోడలు జానకి అంటే అందరికీ చాలా తియ్యగా మారిపోయింది. నేను మాత్రం పచ్చి మిరప కారంగా మారిపోతున్నాను అంటూ.. తనలో తానే బాధపడుతూ మల్లిక అసూయ చెందుతుంది. ఇక ఆమెను చూసి కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా నవ్వుతూ ఉంటారు. కానీ జ్ఞానాంబ మాత్రం జానకి తో పాటు మల్లికను కూడా దగ్గరకు తీసుకుని మీరు ఇద్దరు కూడా నాకు చాలా ముఖ్యమైన వారు అంటూ తన ఆప్యాయతలు చూపిస్తుంది. ఇక ఆ తరువాత గోవిందరాజులు జ్ఞానాంబతో పెళ్ళినాటి స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పెళ్లి చూపులలో జ్ఞానాంబతో చూసి మొదటిసారి చాలా సిగ్గుపడిపోయాను అంటూ ఆ క్షణం ఆమె అందానికి మైమరచిపోయానని అంటాడు. అంతేకాకుండా అది చెబితే అర్థం అయ్యేది కాదు అంటూ ప్రత్యేకంగా డ్యాన్స్ చేసి మరి చూపించాలని అనుకుంటారు. ప్రస్తుతం జ్ఞానాంబ ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో జానకి గురించి నిజం తెలిసిన తర్వాత జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











