Janaki Kalaganaledu march 8th: లీలావతి ప్రయోగంతో మల్లిక గొడవలు.. మరో ఇబ్బందిలో జానకి?

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని జ్ఞానాంబ పెద్ద కోడలు ఎన్నో కలలు కంటుంది. ఇక ఆమెకు తోడుగా భర్త రామచంద్ర కూడా సహాయం చేస్తూ ఉంటాడు. కానీ జ్ఞానాంబకు మాత్రం కోడలు చదువుకోకూడదు అనే ఆలోచనతో ఉంటుంది. అందుకే జానకి ఎవరికీ తెలియకుండా తన చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది అందుకోసం ఆమె ప్రత్యేకంగా అర్ధరాత్రి సమయంలో కోచింగ్ సెంటర్ కూడా వెళ్లి పరీక్షలకు సిద్ధమవుతుంది.

మరోవైపు మల్లిక వీరికి సంబంధించిన అసలు విషయాలు తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 252 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ముందే తెలుసుకుందాం పదండి.

ఐపీఎస్ అవ్వాలని..

ఐపీఎస్ అవ్వాలని..

చిన్నప్పటి నుంచి ఐపీఎస్ చదువులు పూర్తి చేయాలి అని జానకి ఎన్నో కలలు కంటుంది. వారి తల్లిదండ్రుల ఆఖరి కోరిక కూడా అదే. అయితే తల్లిదండ్రుల ద్వారా నెరవేరని కోరికను ఆమె భర్త రామచంద్ర తీరుస్తానని మాట ఇస్తాడు. ప్రతి విషయంలోనూ జానకి అండగా ఉంటూ ఆమెను ఎలాగైనా ఐపీఎస్ గా చూడాలి అని రామచంద్ర కూడా కలలు కంటాడు. కొన్నిసార్లు తన అత్తగారి కారణంగా వెనుకడుగు వేసినప్పటికీ కూడా రామచంద్రం అడుగు వెనక్కి వేయాల్సిన అవసరం లేదు అని ఏదో ఒక కారణంతో మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటారు.

తట్టుకోలేకపోతున్న మల్లిక

తట్టుకోలేకపోతున్న మల్లిక

అయితే జ్ఞానాంబ ఎంత చెప్పినా కూడా జానకి మాత్రం మళ్ళీ అబద్ధాలతోనే చదువును కొనసాగించాలని అనుకుంటుంది. అంతేకాకుండా అత్తమామలతో ఆమె చాలా సంతోషంగా ఉండాలని కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ తరుణంలో చిన్న కోడలు మల్లిక మాత్రం ఆ విషయంలో తీవ్ర స్థాయిలో అసూయ చెందుతూ ఉంటుంది. అత్తగారికి తన పెద్దకోడలు అంటే చాలా ఇష్టం అని ఈర్ష పెంచుకుంటూ మల్లికతో ఎలాగైనా వారి మధ్యలో గొడవలు సృష్టించాలని అనుకుంటుంది. అందుకోసం ఆమె లీలావతికి డబ్బులు ఇచ్చి మరి ప్రత్యేకంగా కొన్ని ప్రణాళికలు కూడా వేస్తుంది.

25వ పెళ్లి రోజు కోసం..

25వ పెళ్లి రోజు కోసం..

జ్ఞానాంబ గోవిందరాజుల 25వ పెళ్లి రోజు కావడంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా వారికి మర్చిపోలేని విధంగా ఆ వేడుకలను సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు. అంతే కాకుండా వారికి సంబంధించిన పాత జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తూ మరింత ప్రేమగా చేరువయ్యేలా ఆలోచిస్తారు. జ్ఞానాంబతో గోవిందరాజులు కూడా తన పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే అందరూ సంతోషంగా ఉంటూ ఉండగా మల్లిక మాత్రం కొంచెం కూడా ఓర్వ లేక పోతుంది. ఎదో ఒక చిచ్చు పెట్టాలని అనుకుంటుంది.

లీలావతితో మల్లిక గొడవలు

లీలావతితో మల్లిక గొడవలు

వీరి సంతోషానికి బ్రేకులు వేయాలి అని మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ముందుగానే మల్లిక పక్కింటి లీలావతిని ఇంటికి రమ్మని కూడా చెబుతుంది. ఆమెకు పాత విషయాలను గుర్తు చేస్తే ఆనందంగా ఉన్న సమయంలో వాటిని ప్రస్తావించాలి అని కూడా చెబుతోంది. ఇక మల్లిక మాట ప్రకారం అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన లీలావతి ఒక విషయం జ్ఞానాంబను చూస్తే చాలా బాధ కలుగుతుంది అని చెబుతుంది.

జ్ఞానాంబ శపథం

జ్ఞానాంబ శపథం

జ్ఞానాంబ పైకి మాత్రమే సంతోషంగా ఉంది అని ఆమె లోపల మాత్రం చాలా బాధ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మనవడు మనవరాలు తో ప్రస్తుతం అనేక వేడుకలను జరుపుకోవాల్సిన ఆమె ఇప్పుడు పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. వైజయంతి ఈ విషయాన్ని ఊరంతా చెప్పుకొని తిరుగుతుందని కూడా అంటుంది.

గతంలో వైజయంతి మనవడికి సంబంధించిన బారసాల లో పాల్గొన్నప్పుడు జ్ఞానాంబ ఏడాది తిరిగే సమయానికి తన పెద్దకోడలు తన ఇంటికి వారసురాలిని ఇస్తుంది అని శపథం చేసిన మాటలను కూడా లీలావతి గుర్తు చేస్తుంది. ఇక లీలావతి మాటలకు కుటుంబ సభ్యులు కూడా అప్సెట్ అవుతారు. ఇలాంటి సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అని గోవింద రాజులు కూడా లీలావతిని కొప్పాడతాడు.

మరో ఇబ్బందిలో పడిన జానకి

మరో ఇబ్బందిలో పడిన జానకి

ఇక లీలావతి మాటలకు చాలా బాధతో ఇంట్లోకి వెళ్లిపోయిన జ్ఞానాంబ అత్తగా నేను తన బాధ్యతను మర్చిపోయాను అంటూ అసలు ఇంతవరకు కోడళ్లకు పిల్లలు ఎందుకు కలగడం లేదు అనేది కూడా ఆలోచించలేదు అని తన భర్త గోవింద రాజులకు చెబుతుంది. ఇక అదే సమయంలో జానకి ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ ఉండడంతో జ్ఞానాంబ చూస్తుంది.

జానకి కడుపుతో ఉంది అంటూ ఆమె తన భర్త రామచంద్రకు కూడా చెబుతుంది. అదే విషయాన్ని మరోసారి లీలావతికి చెబుతూ త్వరలోనే వారసుడు రాబోతున్నాడు గుర్తు చేస్తుంది. మరి జానకి వారసుడిని ఇస్తుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్స్ లో చూడాలి. ఒకవైపు ఐపీఎస్ చదువు పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి మళ్లీ గర్భవతి గా మారితే తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి ఉంటుంది. మరి ఈ తరుణంలో ఒక వైపు అత్తను బాధపెట్టకుండా మరొక వైపు తన చదువును కూడా వదిలిపెట్టకుండా ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X