Janaki Kalaganaledu march 9th: బయటపడలేని సమస్యలో ఇరుక్కున్న జానకి.. వాంతులు తెచ్చిన తంట!

జానకి కలగనలేదు సీరియల్ లో జానకి మరో ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి ఒకవైపు మల్లిక నుంచి సవాళ్లు మరోవైపు అత్త జ్ఞానాంబ నుంచి కట్టుబాట్ల నడుమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చదువుకున్న కోడలు తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు అని ముందే చెప్పిన జ్ఞానాంబ తనకు కోడలు వారసులను మాత్రమే ఇవ్వాలని అంటుంది. ఈ క్రమంలో జానకి తోడుగా భర్త రామచంద్ర ఉంటాడు. ఇక ఈ పరిస్థితుల నడుమ జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక నేడు ప్రసారం కాబోయే 253 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ముందే తెలుసుకుందాం పదండి.

ఓర్వలేకపోయిన మల్లిక

ఓర్వలేకపోయిన మల్లిక

జ్ఞానాంబ, గోవిందరాజులు 25 వ పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ వేడుకను ఎంతో ఆనందంగా నిర్వహించాలి అని అనుకుంటారు. ఆ రోజు ఎలాంటి పనులు పెట్టుకోకుండా ఇంటిల్లిపాది పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే ఆ సమయంలో మల్లిక వారి ఆనందాన్ని చూసి అసలు ఓర్వలేక పోతుంది. ఎలాగైనా గొడవలు పెట్టాలి అని అప్పుడే లీలావతి రంగంలోకి దింపుతుంది. ఆమెకు ఐదు వందల రూపాయలు ఇచ్చి అప్పుడే ఇంట్లోకి రప్పిస్తుంది.

జ్ఞానాంబ సవాల్ ను గుర్తు చేసిన లీలావతి

జ్ఞానాంబ సవాల్ ను గుర్తు చేసిన లీలావతి

ఈ వయసులో మనవడు మనవరాలితో సంతోషంగా ఉండాల్సిన జ్ఞానాంబ లోలోపల చాలా బాధపడుతుంది అని.. పెళ్లిరోజు ఆనందం ఆమె మొహం వరకే కనిపిస్తోంది అని లీలావతి మరోసారి తన మాటలతో అందరిని ఆశ్చర్యానికి కలుగజేస్తుంది. గతంలో వైజయంతి మనవడి బారసాలకు వెళ్ళినప్పుడు ఏడాది తిరిగే సమయానికి తన పెద్దకోడలు వారసులను వచ్చేలా చేస్తుంది అని తప్పకుండా బారసాల వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తాను అని జ్ఞానాంబ చాలెంజ్ చేస్తుంది. అదే విషయాన్ని లీలావతి అందరి ముందు గుర్తు చేస్తుంది.

వాంతులు చేసుకున్న జానకి

వాంతులు చేసుకున్న జానకి

ఇక లీలావతి అలా మాట్లాడగానే జ్ఞానాంబ బాధతో ఒక్కసారిగా కంటతడితో లోపలికి వెళ్లి పోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం జానకి వాంతులు చేసుకుంటూ ఉండడంతో జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది. అయితే జానకికి అలా వాంతులు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకోకుండా జ్ఞానాంబ ముందుగానే జానకి తల్లి కాబోతుంది అని ఆనందపడుతుంది.

ఆ విషయాన్ని తన భర్త గోవిందరాజులకు కూడా ఎంతో సంతోషంగా చెబుతుంది. అయితే రాత్రి భోజనం సరిగా అరగకపోవడంతో వాంతులు అయ్యాయని జానకి చెప్పే లోపే.. జ్ఞానాంబ అవేమి వినకుండా జానకి తల్లి కాబోతోంది అని అందరికీ చెప్పేస్తుంది.

ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్య

ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్య

జరిగిన విషయాన్ని జానకి తన భర్త రామచంద్రకు కూడా చెబుతుంది. ఇక రామచంద్ర జానకి.. జ్ఞానాంబ, గోవింద రాజులకు ఎలాగైనా నిజం చెప్పాలి అని చూస్తారు. కానీ వారు వినిపించుకునే వాతావరణంలో ఏ మాత్రం ఉండరు. ఇక జానకి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్య అనే పరిస్థితిలో ఉన్నాము అంటూ తన భర్తతో చెబుతుంది. ఇక ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని సందిగ్దంలో రామచంద్ర కూడా ఆలోచనలో పడతాడు.

మల్లికకు షాక్

మల్లికకు షాక్

ఇక జానకి తల్లి అయినట్లు తెలుసుకున్న మల్లిక కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పటికీ జానకిని నెత్తిన పెట్టుకున్న అత్తగారు ఇకనుంచి జానకికి మరింత దగ్గర అయిపోతుంది అని అందుకే తను కూడా తల్లి కావాలి అని ముఖ్యంగా మగ బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటుంది. వెంటనే మగపిల్లాడి కోసం నాటు మందులు కూడా తీసుకోవాలి అని ఆలోచిస్తుంది.

ఆనందంలో జ్ఞానాంబ

ఆనందంలో జ్ఞానాంబ

అయితే జానకికి వచ్చిన వాంతులు గర్భానికి కాదు అనే నిజం చెప్పాలి అని రామచంద్ర, జ్ఞానాంబ గోవిందరాజులు దగ్గరికి వెళ్తారు. జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా వారి స్వీట్ షాప్ దగ్గర ఉన్న వారి కి సీట్లు కూడా పంచుతూ ఉంటారు. ఇక అప్పుడే లీలావతి కూడా రావడంతో జ్ఞానాంబ ఎంతో సంతోషంగా కౌంటర్ ఇస్తుంది.. నువ్వు నిన్న మమ్మల్ని నీ మాటలతో ఎంతో బాధకు గురి చేశావు.. కానీ ఆ భగవంతుడు మాకు వెంటనే మంచి చేశాడు అని ఈ విషయాన్ని వైజయంతి కూడా వెళ్లి చెప్పు అని లీలావతికి మరోసారి సవాల్ చేస్తుంది.

Recommended Video

Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
నిజం చెబుతారా?

నిజం చెబుతారా?

జ్ఞానాంబ తనకు వారసుడు రాబోతున్నాడు అని ఎంతో సంతోషంగా ఉండడం చూసిన జానకి రామచంద్ర కూడా అసలు నిజం చెప్పడానికి మళ్లీ వెనుకడుగు వేస్తారు. ఈ ఆనంద సమయంలో వారికి అసలు నిజం చెబితే మళ్లీ తట్టుకుంటారా లేదో అనేది ఎంతో ఆందోళన కలిగిస్తుంది అని రామచంద్ర కూడా అనుకుంటాడు. ముందుగా గోవిందరాజుకు నిజం చెప్పాలని రామ అనుకుంటే ఆ తర్వాత అత్తగారు ఏమాత్రం తట్టుకోలేరు అని జానకి భయపడుతుంది.

ఇక ఇంటికి వెళ్లగానే తన కోడలు తల్లి కాబోతుంది అని జ్ఞానాంబ మరొకసారి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని, పిలుపు తినాలని కూడా జ్ఞానాంబ ఏర్పాట్లను చేస్తుంది. మరి అసలు నిజాన్ని జానకి రామచంద్ర ఎలా చెబుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X