For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu May 10th: అప్పుతో ఇబ్బందుల్లో పడిన రామ.. మరో ట్విస్ట్ ఇచ్చిన కన్నబాబు!

  |

  జానకి కలగనలేదు మరొక ఆసక్తికరమైన అంశాలతో ముందుకు సాగుతోంది. ఎలాగైనా జానకి ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో మనకి అత్తగారి నుంచి అలాగే తొడి కోడలు మల్లిక నుంచి ఊహించని సమస్యలు ఎదుర్కోబోతోంది. అయినప్పటికీ తన అత్తగారి ఇంట్లోనే జానకి ఎవరికి తెలియకుండా తన చదువును కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది.

  ఇక భర్త రామచంద్ర ఆమెకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాడు. కానీ చదువుకున్న కోడలు అంటేనే ఇష్టపడని జ్ఞానాంబ జానకి విషయంలో పరిణామాలను ఎదుర్కొంటోంది అనే పాయింట్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 298వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  మదర్స్ డే సందర్భంగా..

  మదర్స్ డే సందర్భంగా..

  మదర్స్ డే సందర్భంగా ఒక చిన్న పిల్లవాడు రామచంద్ర స్వీట్ షాప్ కు వస్తాడు. అయితే అతను ఒక వస్తువును తెచ్చే కొన్ని స్వీట్స్ ఇవ్వమని అడుగుతాడు. కానీ తన దగ్గర డబ్బులు లేవని చెబుతాడు. దానికి రామచంద్ర మదర్స్ డే అంటే ఏమిటి అని అడుగుతాడు. ఈ రోజు తల్లితో కేక్ కట్ చేసే రోజు అని అనడంతో రామచంద్ర మళ్ళీ అతని వస్తువు అతనికి ఇచ్చేసి మీ ఇంటి పెద్ద కొడుకును అనుకొని స్వీట్స్ తీసుకెళ్ళు డబ్బులు ఏమీ వద్దు అని చాలా ప్రేమతో ఇస్తాడు.

  జానకి సలహా

  జానకి సలహా

  ఆ తరువాత తన చెల్లి వెన్నెలను మదర్స్ డే ఏమిటి అని ప్రత్యేకంగా మరొకసారి అడుగుతాడు. అందుకు ఆమె తల్లిని ప్రత్యేకంగా పూజించుకునే రోజు అని ఈరోజు అమ్మతో ఒక వేడుక చేసుకోవాలి అని అంటుంది. అమ్మని పూజించడం కోసం ఒక రోజు ప్రత్యేకత ఏమిటి వెన్నెల ప్రతి రోజు కూడా మనసులో పెట్టుకుని పూజించాలి కదా అని రామచంద్ర అంటాడు. ఇక ఆ తర్వాత మనం కూడా ఈ రోజు ప్రత్యేకంగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుందామని జానకి తన సలహా ఇస్తుంది. దీంతో రామచంద్ర కూడా ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకున్నాడు.

  మల్లిక అనుమానాలు

  మల్లిక అనుమానాలు

  ఇక మరోవైపు జానకి తోడికోడలు మల్లిక రామచంద్ర విషయంలో కొన్ని అనుమానాలతో ఆలోచిస్తూ ఉంటుంది. అసలు బావగారు ఫైనాన్స్ ఆఫీస్ కు ఎందుకు వెళ్లారు అక్కడ ఏం చేశారు. తన స్నేహితుడి కోసం వెళ్లాను అని అబద్ధం చెప్పారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పక్కన స్నేహితుడు కూడా ఉండాలి.. కానీ ఎవరూ లేరు. అంతేకాకుండా ఆయన చాలా దిగులుగా బయటకు వచ్చారు. కాబట్టి ఏదైనా అప్పుకోసం వెళ్లి ఉండవచ్చు అని అనిపిస్తోంది అంటూ మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇంతలో మల్లిక వడలు చేసేందుకు మిక్సీలో పిండిని వేస్తుంది అయితే ఎంతసేపటికి కూడా దాన్ని పట్టించుకోకపోవడంతో అప్పటికి జ్ఞానాంబ అక్కడికి వస్తుంది.

  మల్లికకు బుద్ధి చెప్పాలని..

  మల్లికకు బుద్ధి చెప్పాలని..

  ఇక మల్లికా అత్తగారు నుంచి తప్పించుకోవడానికి మిక్సీ సరిగా పనిచేయడం లేదు అని మరొక అబద్ధం చెబుతుంది. అంతేకాకుండా మీకు ఈ రోజు ప్రేమ వడలు పెట్టాలని అనుకుంటున్నాను అంటూ.. కానీ మిక్సీ సరిగా పనిచేయక పోవడంతో చాలా బాధపడుతున్నాను అని అంటుంది. దీంతో వెంటనే జ్ఞానాంబ మల్లికకు బుద్ధి చెప్పాలని రోట్లో వేసి రుబ్బాలి అని చెబుతుంది. దీంతో కంగుతిన్న మల్లిక బాధ పడుతూ ఉంటుంది ఆ తరువాత ఇంట్లో అందరూ సమావేశమై ఉండడంతో మల్లికా ఆశ్చర్యపోతుంది.

  అమ్మ కోసం... వేడుక

  అమ్మ కోసం... వేడుక

  అసలు ఎందుకు ఇంత సడన్ గా మీటింగ్ పెట్టారు అని అడుగుతుంది. అయితే మాతృ దినోత్సవ సందర్భంగా ఈరోజు తన స్వీట్ షాప్ లోనే అమ్మతో సెలబ్రేట్ చేసుకుందామా అని సలహా ఇస్తాడు. అందరూ ఒప్పుకుంటారు. అయితే ఈ విషయాన్ని అమ్మకు ఎవరు చెప్పకూడదు అని ఆమెకు ఒక సర్ ప్రైజ్ గా చేయాలని అంటారు. కానీ మల్లిక అత్తకు నిజం చెప్పాలనుకుంటుంది. ఇక ఇంతలో ఆమె భర్త విష్ణు కలుగజేసుకుని ఈ విషయాన్ని నువ్వు మా అమ్మకు చెబితే మాత్రం ఈ పుట్టింటికి వెళ్ళిపోతానని కండిషన్ పెడతాడు. దీంతో మల్లిక సైలెంట్ గా ఉంటుంది.

   షాక్ ఇచ్చిన కన్నబాబు

  షాక్ ఇచ్చిన కన్నబాబు

  ఇంతలో గోవిందరాజులు కూడా వస్తాడు ఏమిటి అని అడగడంతో మాతృదినోత్సవ విషయం గురించి చెబుతారు దీంతో ఆయన కూడా ఒప్పుకుంటారు. అయితే అంతా సిద్ధం చేసి ఉంచిన సమయంలో కన్నబాబు రివెంజ్ తీర్చుకోవడానికి ప్రణాళికలు రచిస్తాడు. రామచంద్ర కు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చి కొన్ని డాక్యుమెంట్స్ లో సంతకాలను పెట్టించుకుంటాడు.

  అయితే అప్పుడు అనుకున్న సమయానికి తిరిగి ఇవ్వకపోతే షాప్ ను లాక్కుంటానని అనే కండిషన్ ఆ డాక్యుమెంట్ లో ఉన్నట్లు తన తల్లి సునంద దీనికి చెబుతాడు. అందుకు ఆమె పగ తీర్చుకునే టైం వచ్చింది అని అంటుంది. కన్నబాబు రామచంద్ర స్వీట్ షాప్ కి వెళ్లి అసలు విషయం చెప్పడంతో రామచంద్ర షాక్ అవుతాడు. మరి రామచంద్ర ఈ సమస్య నుంచి ఎలా బయట పడతాడు అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 298
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X