twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu May 12th: కన్నబాబు దెబ్బకు ఇబ్బందుల్లో పడిన రామచంద్ర.. జ్ఞానాంబ అనుమానం!

    |

    జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఐపీఎస్ చదువుకోవాలని కలలు కన్న ఇల్లాలి కోసం కట్టుకున్న వాడు ఏ విధంగా కష్టపడ్డాడు అనే అంశం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక జానకి
    చదువును పూర్తి చేయాలని అనుకుంటే మధ్యలో ఆమెకు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతాయి. మధ్యలో తొడి కోడలు మల్లిక రివెంజ్.. అలాగే చదుకున్న కోడలు అంటేనే ఇష్టపడని అత్తగారు. జానకి అత్తగారి నుంచి అలాగే తొడి కోడలు మల్లిక నుంచి ఊహించని సమస్యలు ఎదుర్కోబోతోంది. ఇక తన అత్తగారి ఇంట్లోనే జానకి ఎవరికి తెలియకుండా తన చదువును కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది. భర్త రామచంద్ర ఆమెకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 299వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    అప్పుతో సమస్య..

    అప్పుతో సమస్య..

    కన్నబాబు మోసం కారణంగా రామచంద్ర తన ఇంటికి ఎంతో ముఖ్యమైన స్వీట్ షాప్ ను ఇబ్బందుల్లో పడే పరిస్థితికి వస్తాడు. జానకి చదువు కోసం అప్పు చేయాల్సి వచ్చిన రామచంద్రకు కన్నబాబు తెలియకుండా మరొకరు చేత లక్ష రూపాయలు అప్పు ఇస్తాడు. ఈ క్రమంలో చదువులేని రామచంద్ర అప్పు తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ పై సంతకాలు పెడతాడు. అయితే అలా కన్నబాబు జ్ఞానాంబ పేరుమీద ఉన్న స్వీట్ షాప్ తన సొంతం అయ్యే విధంగా ప్రణాళికలు రాచిస్తాడు.

    మదర్స్ డే కోసం..

    మదర్స్ డే కోసం..

    కన్నబాబు ఆ విధంగా చేయడంతో రామచంద్ర తల్లికి విషయం తెలియకుండా స్వీట్ షాప్ కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక మాతృ దినోత్సవ సందర్భంగా అందరూ కలిసి జ్ఞానాంబను ప్రత్యేకంగా చూసుకోవాలి మదర్స్ డేను హ్యాపీ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఇక జానకి తన ఆలోచనలను అందరికీ తెలియ జేస్తుంది. ఈరోజు తల్లి గారిని ప్రత్యేకంగా పూజించుకోవాలని అందుకోసం రామచంద్ర కూడా తన స్వీట్ షాప్ దగ్గర ఏర్పాట్లు చేస్తాడు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం జానకి తెలియడంతో జ్ఞానాంబ మనసులో తెలియని భావోద్వేగం కనిపిస్తుంది. కానీ తన ప్రేమను మాత్రం బయటకు పెట్టదు.

    అమ్మలాంటి స్వీట్ షాప్

    అమ్మలాంటి స్వీట్ షాప్

    అందరూ ఇలా తనను ప్రత్యేకంగా చూస్తున్నందుకు ఎంతగానో సంతోషంగా ఉందని అంటూ స్వీట్ షాప్ గొప్పతనం గురించి కూడా చెబుతుంది. మీ అందరూ మీ అమ్మను గౌరవించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే మన కుటుంబానికి ఇంత కాలం పాటు ఒక అమ్మ లా స్వీట్ షాప్ కాపాడుకుంటూ వచ్చింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ స్వీట్ షాప్ దగ్గర చేయడం మరింత సంతోషించదగిన విషయం అని జ్ఞానాంబ వివరణ ఇచ్చింది. ఇక తల్లి మాటలు విన్న రామచంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. కన్నబాబు తో జరిగిన వివాదం గురించి తెలిస్తే అమ్మ ఏమాత్రం తట్టుకోలేదని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.

    రామచంద్ర ఆవేదన

    రామచంద్ర ఆవేదన

    ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీట్ షాప్ ను వదులుకోకూడదు అని కూడా రామచంద్ర ఆవేదన చెందుతూ ఉంటాడు. ఈ క్రమంలో మల్లిక అందరూ సంతోషంగా ఉండడానికి ఏ మాత్రం తట్టుకోలేక పోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి జ్ఞానాంబ కాళ్ళు కడుగుతూ సేవ చేసుకుంటూ ఉండగా.. ఆ సమయంలో మల్లిక మాత్రం దూరంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా జానకితో కూడా ఆమె అత్తగారికి ఏ మాత్రం తలవంచక కూడదు అని చెబుతుంది. కానీ జానకి మాత్రం అత్తగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు చల్లుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది అని చాలా మంచి మాటలు చెబుతుంది. అయినప్పటికీ కూడా మల్లిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎప్పటిలానే ఆలోచిస్తుంది.

    మల్లిక ప్లాన్

    మల్లిక ప్లాన్

    అంతేకాకుండా మల్లిక ఏదో ఒక గొడవ సృష్టించాలి అని నీలావతిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తోంది. నువ్వు అడిగిన 1000 రూపాయలు ఇప్పుడే ఇస్తానని నేను చెప్పింది చేయాలి అని కన్నబాబుతో జరిగిన గొడవ గురించి నీలావతికి చెబుతుంది. ఇక అందుకు ఒప్పుకున్న నీలావతి వెంటనే స్వీట్ షాప్ దగ్గరకు వచ్చి తన మనవడి కోసం పూతరేకులు కావాలి అని మాటలు కలుపుతుంది. ఇక ఆ సమయంలో గోవిందరాజులు ముందుగానే ఆమెను అనుమానిస్తాడు. నువ్వు ఏదో ఒక ఒక గొడవ పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అంటాడు. అయినప్పటికీ కూడా ఆమె కన్నబాబు తో జరిగిన గొడవ గురించి అక్కడ ప్రస్తావిస్తుంది.

    కన్నబాబుతో గోడవేంటి?

    కన్నబాబుతో గోడవేంటి?

    మనసులో లో ఏదో బాధ పెట్టుకొని పైకి ఈ వేడుకలు బాగానే జరిపిస్తున్నారు అని అనుమానాలు వచ్చేలా మాట్లాడుతుంది. ఇక నీలావతి మాటలు విన్న జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. కన్నబాబు తో గొడవ జరగడం ఏమిటి అని ఆలోచిస్తుంది. వెంటనే ఆ విషయాన్ని రామచంద్రను కూడా అడిగే ప్రయత్నం చేస్తుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా కన్ఫ్యూజన్ లో పడతాడు.

    రామచంద్ర టెన్షన్..

    రామచంద్ర టెన్షన్..

    స్వీట్ షాప్ అంటే అమ్మకు ప్రాణంతో సమానం. అలాంటిది ఇప్పుడు జరిగిన గొడవ గురించి చెబితే అమ్మ తట్టుకోలేదు అని ఆలోచిస్తాడు. ఇక ఆ తర్వాత రామచంద్ర నిజం చెప్పకుండా పరిస్థితిని దాట వేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రామచంద్ర ఆందోళనలో కట్టెలు కొడుతూ ఉంటాడు. దీంతో కిటికీలోనుంచి రామచంద్ర ను చూసిన జ్ఞానాంబ ఏదో టెన్షన్ లో ఉంటేనే రామచంద్ర నాలాగే పని చేస్తూ ఉంటాడు కాబట్టి ఏదో సమస్య ఉందని అనుకుంటుంది. మరి రామచంద్ర జరిగిన విషయాన్ని జ్ఞానాంబతో చెబుతాడో లేదో తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial May 12th Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X