Janaki Kalaganaledu May 13th: జ్ఞానాంబ మాటలకు బాధలో జానకి.. చంపుతావా అంటూ రామచంద్ర అసహనం!

జానకి కలగనలేదు సీరియల్ మరో సరికొత్త మలుపు తిరగబోతోంది. భార్య చదువు కోసం ఎంతగానో తాపత్రయపడుతున్న రామచంద్ర ఓ కఠినమైన సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఎలాగైనా ఐపీఎస్ చదువుకోవాలని కలలు కన్న ఇల్లాలి కోసం కట్టుకున్న వాడు ఏ విధంగా కష్టపడ్డాడు అనే అంశం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక మధ్యలో తొడి కోడలు మల్లిక రివెంజ్ అలాగే అలాగే చదుకున్న కోడలు అంటేనే ఇష్టపడని అత్తగారి వలన జానకి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది.

ఇక తన అత్తగారి ఇంట్లోనే జానకి ఎవరికి తెలియకుండా తన చదువును కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 300వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అప్పుకోసం వెళ్లి..

అప్పుకోసం వెళ్లి..

జానకి చదువు విషయంలో మరోసారి రామచంద్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆమె ఐపీఎస్ చదువు కోసం ఫీజు కట్టడానికి లక్ష రూపాయలు అప్పు చేయాలని అనుకున్న రామచంద్ర అనుకోకుండా కన్నబాబు మోసం కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రామచంద్రకు అప్పు కావాలని తెలుసుకున్న కన్నబాబు ఎలాగైనా తన పగను ఈ దారిలో తీర్చుకోవాలి అని అతనికి అప్పుగా లక్ష రూపాయలు ఇప్పిస్తాడు.

అయితే రామచంద్ర కు అప్పు ఇచ్చిన తర్వాత ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తాడు. అంతేకాకుండా రామచంద్ర దగ్గర కొన్ని పత్రాలపై సంతకాలు కూడా పెట్టించుకుంటాడు. పెద్దగా చదువుకోని రామచంద్ర తన తల్లి జ్ఞానాంబ పేరుమీద ఉన్న స్వీట్ షాప్ ను తాకట్టు పెట్టినట్లు ఆ పత్రాల్లో కన్నబాబు పొందుపరుస్తాడు.

కన్నబాబుతో మరో సమస్య

కన్నబాబుతో మరో సమస్య

ఊహించని విధంగా ఆ సమస్యలో ఇరుక్కోవడంతో తల్లి పేరుమీద ఉన్న స్వీట్ షాపును కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరొక వారం రోజుల్లోగా తన లక్ష రూపాయల ఇవ్వకపోతే స్వీట్ షాప్ ను స్వాధీనం చేసుకుంటాను అని కన్నబాబు అంటాడు.

అయితే అదే సమయంలో మాతృ దినోత్సవ సందర్భంగా కుటుంబసభ్యులందరూ కలిసి రామచంద్ర స్వీట్ షాప్ దగ్గర తల్లి జ్ఞానాంబను ప్రత్యేకంగా గౌరవించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో లో ముందుగానే వచ్చిన మల్లిక కన్నబాబు తో రామచంద్రకు జరిగిన గొడవ గురించి ప్రస్తావించాలని అనుకుంటుంది. అందుకోసం నీలావతిని ఆయుధంగా చేసుకుంటుంది.

రామచంద్ర టెన్షన్?

రామచంద్ర టెన్షన్?

ఇక జ్ఞానాంబకు అనుమానం వచ్చి ఎంత అడిగినా కూడా రామచంద్ర అసలు విషయాన్ని చెప్పకుండా దాచి పెడతాడు. అసలు నిజం చెబితే మాత్రం అమ్మ తట్టుకోలేదు అని ఆందోళన చెందిన రామచంద్ర ఏమీ లేదు అని పాత గొడవలే కారణం అని గట్టిగానే వివరణ ఇస్తాడు. ఇక ఆ తరువాత ఇంటికి వెళ్ళిన రామచంద్ర ఏదో టెన్షన్ లో ఉన్నట్లుగా జ్ఞానాంబకు అనుమానం వస్తుంది.

భోజనం కూడా సరిగా చేయకుండా రామచంద్ర మధ్యలోనే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాత్రి సమయంలో పడుకోకుండా కట్టెలు కొడుతూ ఉంటాడు. అది కూడా చూసిన జ్ఞానాంబ తప్పకుండా ఏదో ఆందోళన తన కొడుకు మనసులో ఉండే ఉంటుంది అని రామచంద్ర భార్యని అడుగుతుంది.

జానకి జ్ఞానాంబ అసహనం

జానకి జ్ఞానాంబ అసహనం

అసలు తన కొడుకు ఎందుకు బాధ పడుతున్నాడు ఆ విషయం కొంచమైనా అర్థం అవుతుందా ఒక్కసారైనా రామచంద్రను ఏం జరిగింది అని అని అడిగావా అంటూ జానకిని జ్ఞానాంబ ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే జానకి మాత్రం ఎలాంటి బాధ లేదు అని ఆయన నార్మల్గానే ఉన్నారు అని సమాధానం ఇస్తుంది. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన జ్ఞానాంబ ఆరోజు బారసాల వేడుకలో మీ అన్నయ్య చేసిన అవమానం వల్లనే ఈ రోజు ఇంతగా బాధకు గురి అవుతున్నాడు అని.. నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే అతన్ని పిలిపించుకుని ఏం జరిగింది అని మాట్లాడాలి అని అంటుంది.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

అలాగే నీకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు అని నిన్ను నమ్మినందుకు ఇంట్లో నేను నా కొడుకు ఎంతగానో బాధ పడుతున్నాము అని జ్ఞానాంబ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది. ఆ తర్వాత జానకి ఒక్కసారిగా మంచం పక్కనే కూర్చొని ఉండిపోతుంది. అనంతరం ఇంట్లో కి వచ్చిన రామచంద్రతో జానకి మాట్లాడుతుంది. అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత బాధ లో ఉన్నారు అని అడుగుతుంది. కానీ రామచంద్ర మాత్రం ఎలాంటి బాధలు లేవు అని సమాధానమిస్తాడు. మీరు ఏదో బాధల్లో ఉన్నారు అందుకే నేను ఇక్కడ కింద కూర్చున్న కూడా పట్టించుకోలేదు అని అడుగుతుంది.

కన్నబాబు దగ్గరకు జనకి

కన్నబాబు దగ్గరకు జనకి

ఒక్కసారిగా రామచంద్ర కూడా సహనం కోల్పోయి.. ఎలాంటి బాధ లో లేను అంటే ఎందుకు అలా పదేపదే అడిగి చంపుతున్నారు. ఒకవైపు అమ్మ మరొక వైపు మీరు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని రామచంద్ర అసహనం వ్యక్తం చేస్తాడు. దీంతో ఒక్కసారిగా మనోవేదనకు గురి అయిన జానకి మౌనంగా ఉండి పోతుంది.

ఇక ఆ తర్వాత రామచంద్ర కూడా బయటకు వెళ్ళిపోతాడు. అయితే ఇంతలో మల్లిక మరొక వివాదాన్ని తెరపైకి తీసుకు వస్తుంది. జానకి కారణంగా మరొకసారి మన పరువు పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవకాశం ఉంది అని అంటుంది. కన్నబాబు తో గొడవ పడినట్లు వివరణ ఇస్తుంది. మరి జానకి కన్నబాబు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అసలు ఈ విషయంలో జ్ఞానాంబ ఏలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X