Janaki Kalaganaledu May 16th: నిజం తెలుసుకున్న జానకి.. జైలుకు పంపిస్తా అంటూ కన్నబాబుకి వార్నింగ్

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ చదువుకోవాలని అనుకున్న ఒక అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్లిన అనంతరం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. ఇక చదువుకున్న కోడలు అంటేనే ఇష్టపడని అత్తగారిని దాటి జానకి ఐపీఎస్ కలను ఎలా నెరవేర్చుకుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తొడి కోడలు మల్లిక కూడా జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఇక ఆ పరిస్థితులను దాటి జానకి తన ఐపీఎస్ కలను ఎలా నెరవేర్చుకుంది అలాగే భర్త కూడా ఆమెకు ఎలా సహాయపడ్డాడు అనే పాయింట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 301వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అందరికీ అనుమానం వస్తుంది అని..

అందరికీ అనుమానం వస్తుంది అని..

జానకి ఐపీఎస్ చదువుకోవాలనే రామచంద్ర ప్రత్యేకంగా ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లే ఏర్పాట్లు చేస్తాడు. ఉదయం అయితే అందరికీ అనుమానం వస్తుంది అని అర్ధరాత్రి కోచింగ్ సెంటర్ కు వెళ్లేలా రామచంద్ర ప్లాన్ చేస్తాడు. అయితే ఈ క్రమంలో జానకి చదువు కోసం లక్ష రూపాయలు అవసరం కావస్తుంది. డబ్బు లేకపోవడంతో అప్పు చేయాలనుకుంటాడు.

అయితే రామచంద్రకు అవసరం పడింది అని తెలుసుకున్న అతని శత్రువు కన్నబాబు రామచంద్రను మోసం చేయాలని అనుకుంటారు. అతనికి చదువు రాదు అని తెలుసుకున్న కన్నబాబు కొన్ని డాక్యుమెంట్లో సంతకాలు పెట్టించుకుంటాడు. కావలసిన లక్ష రూపాయలు ఇస్తాడు.

కన్నబాబు మోసం

కన్నబాబు మోసం

ఇక ఆ తర్వాత కన్నబాబు రామచంద్ర స్వీట్ షాప్ ను సొంతం చేసుకోవాలనే ప్రణాళికలు రచిస్తాడు. వారం రోజుల్లోగా లక్ష రూపాయలు వడ్డీతో సహా ఇవ్వకపోతే స్వీట్ షాప్ సొంతం చేసుకుంటానని అని అంటాడు. దీంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీట్ షాప్ ను వదులుకోకూడదు అని అనుకుంటారు.

కానీ కన్నబాబు మాత్రం పట్టు విడవకుండా స్వీట్ షాప్ ను దక్కించుకొని తన పగను తీర్చుకోవాలని అనుకుంటాడు. అయితే ఈ క్రమంలో రామచంద్ర తనలో తానే చాలా బాధపడుతుంటాడు. కానీ ఆ విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పకుండా జాగ్రత్త పడుతుంటారు. తల్లి ఎంత అడుగుతున్నా కూడా రామచంద్ర ఏమి లేదని అంటాడు కానీ తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురి అవుతారు.

జానకిపై అగ్రహం

జానకిపై అగ్రహం

ఇక రామచంద్ర ఎందుకు అలా బాధపడుతున్నాడు అని జ్ఞానాంబ చాలా బాధకు గురి అవుతుంది. తన కొడుకు మనసులో ఏదో బాధ ఉందని ఆమె కూడా బాధపడుతుంది. ఇక ఈ క్రమంలో జ్ఞానాంబ జానకిపై అసహనం వ్యక్తం చేస్తుంది. మీ అన్నయ్య ఆ రోజు కావాలని అవమానించారని అందుకే ఆ బాధను ఇంకా మనసులో పెట్టుకొని తన కొడుకు బాధ పడుతున్నాడని జానకిపై అగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక జానకి వెంటనే తన భర్త మనసులో ఉన్న బాధ గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం మొదట నిజం చెప్పకుండా చిరకుతో నేను ఏ బాధలో లేనని ఆరుబయట కూర్చుంటాడు.

ధైర్యం చెప్పిన జానకి

ధైర్యం చెప్పిన జానకి

ఇక మెల్లగా రామచంద్ర దగ్గరకు వెళ్లిన జానకి చేతిలో చేయి వేసి ధైర్యం చెబుతుంది. భార్య భర్తల మధ్యలో ఎలాంటి దాపరికలు ఉండకూడదు అని మీరె చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా దాస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. దీంతో రామచంద్ర జరిగిన విషయాన్ని చెబుతాడు. కన్నబాబు స్వీట్ షాప్ ను దక్కించుకోవాలని చూస్తున్నాడు అని అదే జరిగితే మా అమ్మ తట్టుకోలేదు అని బాధపడతాడు. ఇక అందుకు జానకి ధైర్యం చెబుతూ అలా ఎన్నటికీ జరగదని మళ్ళీ మన స్వీట్ షాప్ మనకు వస్తుందని అంటుంది. దీంతో జానకి కొంత ధైర్యంతో ఉంటాడు.

జానకి వార్నింగ్

జానకి వార్నింగ్

ఇక ఆ తరువాత జానకి వెంటనే కన్నబాబు ఇంటికి వెళ్లి హెచ్చరిక చేయాలని అనుకుంటుంది. నా భర్తకు చదువు రాదని అమయకుడిని చేసి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తావా? అంటూ అలా ఎన్నటికీ జరగదని అంటుంది. ఇక కన్నబాబు కూడా ఆమెకు కౌంటర్ ఇస్తూ నీ మాటలకు నేను భయపడను అని ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా తీసుకు వెళ్లాలని అంటాడు. ఇక అందుకు జానకి ఒప్పుకొని ఇంకా వారం రోజులు టైమ్ ఉంది కాదా అని అంటుంది. ఈ లోపు ఏదైనా తేడాగా చేస్తే మరియాదగా ఉండదని జైల్లో చిప్పకూడు తినేలా చేస్తానని మరింత ఘటనా కౌంటర్ ఇస్తుంది.

జ్ఞానాంబ అసలు నిజం తెలుసుకుంటుందా?

జ్ఞానాంబ అసలు నిజం తెలుసుకుంటుందా?

అయితే జానకిని కన్నబాబు ఇంటికి రావడం చూసిన మల్లిక ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుందో అని అనుమనిస్తుంది. ఇక అతనితో గొడవ పడినట్లు గమనించిన మల్లిక వెంటనే ఆ విషయాన్ని జ్ఞానాంబకు చెప్పేందుకు సిద్ధమవుతుంది. ఇక ఆ విషయాన్ని జానకి ఇంటికి రాగానే మల్లిక అత్తగారికి చెబుతుంది.

దీంతో జ్ఞానాంబ జానకిని ఎంత అడిగినా చెప్పదు. ఇక జ్ఞానాంబ ఆ విషయాన్ని నేనే తెలుసుకుంటాను అని కన్నబాబు ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. మరి ఈ క్రమంలో జ్ఞానాంబ అసలు నిజం తెలుసుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X