Janaki Kalaganaledu May 18th: రామచంద్రతో జానకి రొమాంటిక్ కిస్.. జ్ఞానాంబ మరో షాక్!
ఐపీఎస్ చదువును పూర్తి చేసి తన కలను నెరవేర్చుకోవాలని అనుకున్న ఒక అమ్మాయి అత్తగారి ఇంట్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. ఇక చదువుకున్న కోడలు అంటేనే ఇష్టపడని జ్ఞానాంబ అసలు జానకి చదువుకోవడం అంటేనే ఇష్టం ఉండదు. ఇక ఆమె తన కలను ఎలా నెరవేర్చుకుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తొడి కోడలు మల్లిక కూడా జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక ఆ పరిస్థితులను దాటి జానకి ఐపీఎస్ కలను ఎలా నెరవేర్చుకుంది అలాగే భర్త కూడా ఆమెకు ఎలా సహాయపడ్డాడు అనేది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 303వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

కన్నబాబు మోసం
స్వీట్ షాప్ ను ఎలాగైనా కన్నబాబు నుంచి కాపాడుకోవాలని రామచంద్ర ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. జానకి కోసం చేసిన లక్ష రూపాయలకు తాకట్టుగా రామ తన స్వీట్ షాప్ ను రాసిచ్చినట్లు కన్నబాబు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాడు. పెద్దగా చదువుకోలేని రామ అప్పు కోసం అలా డాక్యుమెంట్స్ పై తాకట్టు పెట్టడంతో షాప్ సమస్యల్లో పడుతుంది. కన్నబాబు రోజురోజుకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక మరోవైపు ఇంట్లో ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉంచిన రామచంద్ర చివరికి జానకికి అసలు నిజం చెబుతాడు. జనకి కూడా కన్నబాబు సమస్య నుంచి భర్తను బయటకు లాగాలని ఆలోచిస్తుంది.

వంటల పోటీలు
ఇక కన్నబాబుకు సంబంధించిన గొడవల విషయంలో పడి జానకి వంటల పోటీల గురించి మర్చిపోతుంది. ఇక హఠాత్తుగా గుర్తుకు రావడంతో అదే విషయాన్ని తన భర్తకు చెబుతుంది. మీరు ఎలాగైనా వంటల పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు అందుకోవాలని జానకి చెబుతుంది. కానీ మొదట రామచంద్ర ఏ మాత్రం ఒప్పుకోడు. స్వీట్ షాప్ కు సమస్య ఉండగా ఇప్పుడు వంటల ప్రోగ్రాం గురించి ఏం ఆలోచిస్తాను అని అనడంతో జానకి అలా ఆలోచించ వద్దు అని చెబుతుంది. ఈ వంటల ప్రోగ్రాం లో మీరు గెలిస్తే మీ పేరు పేపర్లలో వార్తలలో కూడా వస్తుంది అంటూ తప్పకుండా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది అని మిమ్మల్ని ఆహ్వానించిన వారు కూడా మిమ్మల్ని చూసి ఎంతగానో గౌరవిస్తారు అని కూడా జానకి చెబుతుంది.

జానకి ముద్దు
ఇక జానకి మాటలకు కాస్త ఆలోచించిన రామచంద్ర వెంటనే ఆ విషయం గురించి ఒప్పుకుంటాడు. ఇక తర్వాత జానకి సంతోషంతో ఒక్కసారిగా రామచంద్రను ముద్దు పెట్టుకుంటోంది. అలా సడన్ గా రామచంద్ర బుగ్గపై ముద్దు పెట్టడంతో అతను ఒక్కసారిగా సిగ్గు పడి పోతూ ఉంటాడు. ఇక ఉదయాన్నే జానకి అందరికీ కాఫీ ఇస్తూ రామచంద్రం పిలిచి అసలు విషయాన్ని చెప్పాలి అని అంటుంది. రామచంద్ర తన తల్లి తో వంటల పోటీలు గురించి చెప్పడానికి చాలా ఆలోచిస్తాడు. ఇక తండ్రి గోవిందరాజులు కలుగజేసుకొని అసలు విషయం ఏమిటో చెప్పాలని మీ అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది అని భరోసా ఇస్తాడు.

జ్ఞానాంబ అనుమానం
ఇక వెంటనే ఆ విషయాన్ని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. మొదట చెఫ్ కాంపిటీషన్ అంటే ఏమిటి అని అడుగుతుంది ఆ విషయం గురించి ఆమె చిన్న కొడుకు అఖిల్ వివరంగా చెప్పడం తో జ్ఞానాంబ కాస్త అనుమానం వ్యక్తం చేస్తుంది. అక్కడికి చదువుకున్న వాళ్లు కూడా వస్తారు కాబట్టి నా కొడుకుకి హిందీ ఇంగ్లీష్ రాకపోవడంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని అనుకుంటుంది. అయితే ఆ ఇబ్బందులు ఏమీ రాకుండా తన దగ్గరుండి చూసుకుంటాను అని కూడా జానకి ధైర్యంగా చెబుతుంది కానీ జ్ఞానాంబ మాత్రం ఆ విషయంలో ఎంతగానో అనుమానిస్తుంది.

రామచంద్ర ఓడిపోతే..
ఒకవేళ ఆ పోటీలలో రామచంద్ర ఓడిపోతే అవమానాన్ని తట్టుకోలేడు అని ఇప్పటికే సగం బాధలో ఉన్న తన కొడుకు ఇంకా బాధ పడతాడు అని ఆలోచిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రామచంద్ర ఆ పోటీలకు వెళితే బాగుంటుంది అని సలహా ఇస్తూ ఉంటారు. కానీ జ్ఞానాంబ మాత్రం ఆ విషయంలో జానకిని అపార్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ జానకి ఒంటరిగా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా జ్ఞానాంబ అక్కడికి వస్తుంది.

జ్ఞానాంబ అసహనం
అసలు నా కొడుకుని ఏమి చేయాలని అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తుంది. ఆ వంటల పోటీలలో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు హిందీ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతారు. కానీ నా కొడుకు అమాయకుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడతాడు. అలాంటిది అంత పెద్ద వంటల పోటీలలో అతను ఎలా ఉంటాడు.. అందరి ముందు అవమానపరిచెందుకే నువ్వు ఈ విధంగా ఆలోచించి ఉంటావని జ్ఞానాంబ జానకి పై విరుచుకు పడుతుంది. కానీ జానకి అందులో ఎలాంటి పొరపాటు ఉండదు అని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అంటుంది. జానకి ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. మరి ఈ పరిస్థితులను దాటి జానకి తన భర్త విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











