Janaki Kalaganaledu May 19th: జానకి అందానికి రామ ఫిదా.. అలా స్నానం చేసి రాగానే రొమాన్స్!

జానకి కలగనలేదు కథాంశం సరికొత్త మలుపులతో ముంరుగా సాగుతోంది. ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఎంతో కోరికతో ఉన్న ఒక ఇల్లాలు ఆ కోరికను ఎలా నెరవేర్చుకుంది. ఆమె భర్త చేసిన సహాయం ఏమిటి? అత్త నుంచి వచ్చిన అపాయం ఏమిటి? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇక చదువుకున్న కోడలు అంటేనే ఇష్టపడని అత్త పాత్రలో రాశి నటన ఈ సీరియల్ లో హైలెట్ గా నిలుస్తోంది.

అయితే జానకి తన కలను ఎలా నెరవేర్చుకుంది అలాగే తొడి కోడలు మల్లిక నుంచి వచ్చిన సమస్యలు ఏమిటి అనే పాయింట్ కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 304వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఏదో మోసం ఉందని..

ఏదో మోసం ఉందని..

రామచంద్ర చదువుకోకపోయినప్పటికీ కూడా అతనిలో మంచి టాలెంట్ ఉంది అని వంటలకు సంబంధించిన పోటీలలో అవకాశం ఇస్తే తప్పకుండా మంచి గుర్తింపు అందుకుంటాడు అని జానకి ఆలోచిస్తుంది. ఇక ఎలాగైనా రామచంద్రం మరికొన్ని రోజుల్లో జరగబోయే ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలలో పాల్గొనేలా చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఆ విషయం గురించి రామచంద్ర తల్లి జ్ఞానాంబ అడగడంతో ఆమె జానకి నిర్ణయాన్ని తిరస్కరిస్తోంది. అందులో ఏదో మోసం ఉంది అని జ్ఞానాంబ అనేకరకాలుగా ఆలోచిస్తుంది.

మర్యాదగా ఉండదని హెచ్చరిక

మర్యాదగా ఉండదని హెచ్చరిక

ఇప్పటికే తన కొడుకు ఎంతో అవమానం తో ఉన్నాడు అని అది కూడా మీ అన్నయ్య మాటల ద్వారానే ఎంతగానో బాధ పడుతున్నాడు అని మళ్ళి ఇప్పుడు నువ్వు నా కొడుకుని మరింత అవమాన పడే విధంగా ప్రయత్నిస్తున్నావు అనే జ్ఞానాంబ అపార్థం చేసుకుంటుంది. ఒకవేళ రామచంద్ర వంటల పోటీలలో ఓడిపోతే తీరని అవమానం తో ఉంటాడు అని ఆ తరువాత నువ్వు నా కొడుకుని నీ గుప్పెట్లో ఉంచుకోవాలని ఆలోచిస్తున్నావు అని కూడా జ్ఞానాంబ చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అలా అపార్థం చేసుకోవద్దని ఇందులో విజయం సాధిస్తే ఆయనకు మంచి గౌరవం లభిస్తుంది అని కూడా ఎంతగానో ప్రాధేయ పడుతోంది. అయినప్పటికీ కూడా జ్ఞానాంబ ఆ విషయంలో వెనక్కి తగ్గకుండా నన్ను కాదని నా కొడుకును ఆ పోటీలకు పంపిస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరిస్తుంది.

సర్‌ప్రైజ్ ఇచ్చిన జానకి

సర్‌ప్రైజ్ ఇచ్చిన జానకి

ఇక అత్తగారి మాటలకు ఒక్కసారిగా షాక్ అయినా జానకి ఏమనాలో తెలియక మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇక ఉదయం రామచంద్ర పుట్టినరోజు కావడంతో అతనికి సర్‌ప్రైజ్ ఇవ్వాలి అని ముందుగానే జానకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అతని కళ్ళు మూసి ఇంటి ముందు ఉన్న గార్డెన్ ఏరియా లోకి తీసుకు వస్తుంది. ఇక రామచంద్ర కళ్ళు తెరిచి చూడగానే అక్కడ పుట్టిన రోజు సంబంధించిన ఏర్పాట్లు చేసి ఉంటాయి. అంతేకాకుండా రామచంద్ర తండ్రి గోవిందరాజులు అలాగే తమ్ముడు కూడా అక్కడే ఉంటారు. కుటుంబసభ్యులు అందరూ అక్కడ ఉండగా జ్ఞానాంబ మాత్రం ఇంట్లోనే ఉంటుంది.

జానకి కారణంగా..

జానకి కారణంగా..

ఆ సమయంలో ఆమె తన కొడుకు కోసం తెచ్చిన కొత్త బట్టలను చూస్తూ ప్రతి ఏడాది తన పుట్టిన రోజున రామచంద్ర నా దగ్గరికి వచ్చే ఆశీర్వాదం తీసుకుంటాడు. కానీ ఇప్పుడు జానకి కారణంగా అతను బాధలో ఉన్నాడు అని అనుకుంటుంది. రామచంద్ర ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతూ ఉండగా బయట కనిపిస్తాడు. అప్పటికే జానకి పుట్టిన రోజుకు సంబంధించిన ఏర్పాట్లు చేసిందని జ్ఞానాంబ అపార్థం చేసుకుంటుంది. నా నుంచి నా కొడుకును దూరం చేస్తుంది అని ఆలోచిస్తుంది.

కోపం ఉన్నప్పటికీ..

కోపం ఉన్నప్పటికీ..

మనసులో జానకి పై కాస్త కోపం ఉన్నప్పటికీ కూడా జ్ఞానాంబ దాన్ని బయటకు చూపించకుండా కొడుకు పుట్టినరోజు బాధ పెట్టకూడదు అని మళ్ళి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది. తన కారణంగా కొడుకు బాధపడకూడదు అని జానకి పై కోపం ఉన్నా సరే జ్ఞానాంబ సైలెంట్ గానే ఉంటుంది. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి రామచంద్ర పుట్టినరోజును చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు.

జానకితో రొమాన్స్

జానకితో రొమాన్స్

అనంతరం రామచంద్ర స్నానం రాగా అతనికి సాంబ్రాణి తో జానకి ప్రత్యేకంగా ప్రేమను చూపిస్తుంది.ఈ తరుణంలో అతని కళ్ళల్లో ఏదో పడిందని కూడా చెప్పడంతో జానకి రామచంద్ర కళ్ళల్లోకి చూస్తూ అదే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర కూడా జానకి అందాన్ని చూసే ఫిదా అవుతాడు. ఇక ఇంట్లో పూజ ఉన్న సమయంలో జానకికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. చెఫ్ కాంపిటీషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం రావాలని చెప్పడంతో జానకి ఆలోచిస్తుంది.

ఈ తరుణంలో జ్ఞానాంబ వచ్చిన వెంటనే పూజ కు సంబంధించిన పనులు చేయాలి అని ఆర్డర్ వేస్తోంది. అయినప్పటికీ కూడా జానకి రామచంద్రను ఓ పక్కకు తీసుకువెళ్లి మాట్లాడుతుంది. మరి జానకి వైఖరితో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X