twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu May 20th: గదిలో రామ, జానకి మంతనాలు.. అనుమానంతో జ్ఞానాంబ సీరియస్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ లో మరో ట్విస్ట్ ఎంతో ఆసక్తికరంగా మారింది. జానకి కోసం అప్పు చేసిన రామచంద్ర తన తల్లికి తెలియకుండా స్వీట్ షాప్ ను కూడా అనుకోకుండా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. మోసం చేసిన కన్నబాబు రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక జానకి ఆ సమస్య నుంచి భర్తను ఎలా తప్పించింది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఎంతో కోరికతో ఉన్న ఒక ఇల్లాలు ఆ కోరికను ఎలా నెరవేర్చుకుంది.

    ఆమె భర్త చేసిన సహాయం ఏమిటి? అత్త నుంచి వచ్చిన అపాయం ఏమిటి? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 305వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    రామచంద్ర పుట్టినరోజు

    రామచంద్ర పుట్టినరోజు

    రామచంద్ర పుట్టినరోజు సందర్భంగా జానకి తన భర్తకు ప్రత్యేకంగా స్నానం చేసి ధూపం పెట్టి ఎంతో అపురూపంగా ముస్తాబు చేస్తుంది. అంతేకాకుండా రామచంద్ర కోసం ప్రత్యేకంగా బట్టలు కూడా తెచ్చిన జానకి ఎంతగానో మురిసిపోతుంది. మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ రామచంద్ర ముందే చెప్పడంతో అతను సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది.

    కన్నబాబు ఫోన్ కాల్

    కన్నబాబు ఫోన్ కాల్

    ఆ తరుణంలో కన్నబాబు రామచంద్ర కు ఫోన్ చేస్తాడు. తీసుకున్న అప్పు గురించి మాట్లాడుతూ ఉంటాడు. గుర్తు చేయాలి కదా అని ఫోన్ చేశాను అంటూ ఎలాగైనా మరో ఐదు రోజుల్లో తన అప్పు తిరిగి ఇవ్వాలని లేదంటే మీ అమ్మ పేరు మీద ఉన్న స్వీట్ షాప్ మా అమ్మ పేరు మీదకి మారిపోతుంది అని హెచ్చరిక చేస్తాడు. దీంతో రామచంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని ఇలా మాటిమాటికి ఫోన్ చేసి చిరాకు తెప్పించకు అనే రామచంద్ర కౌంటర్ కూడా ఇస్తాడు.

    ఏదైనా అద్భుతం జరగాలి

    ఏదైనా అద్భుతం జరగాలి

    ఇక అతని మాటలు విన్న జానకి కొంత ఆందోళన చెందుతుంది. ఎలాంటి భయం లేకుండా ఉండండి అంటూ తప్పకుండా ఈ సమస్యనుంచి మనకు ఒక దారి దొరుకుతుంది అని ధైర్యం చెబుతుంది. అయితే ఈ తరుణంలో మనకు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సమస్య నుంచి బయట పడలేమని రామచంద్ర బాధపడుతూ ఉంటాడు.

    తప్పకుండా మన కోసం ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని మీరు ముందు బెస్ట్ చెఫ్ పోటీలకు సిద్ధం కావాలి అని చెబుతోంది. అయితే అందుకు అమ్మ ఒప్పుకోదు కదా అని రామచంద్ర చెప్పడంతో మీరు ఎక్కడ ఓడిపోతామనే భయంతోనే ఆమె అలా చెబుతోంది అంటూ మీరు గెలుస్తారు అని నమ్మకం ఆమెకు కలిగిస్తే తప్పకుండా ఒప్పుకుంటుంది అని జానకి వివరణ ఇస్తుంది.

    తల్లిని ఒప్పించాలని..

    తల్లిని ఒప్పించాలని..

    ఇక ఆ మాటలకు రామచంద్ర కూడా ఒప్పుకుంటాడు ఎలాగైనా తల్లిని ఒప్పించాలని ఇద్దరు అనుకుంటారు. ఇక ఆ తర్వాత జానకి లూసీ కి ఫోన్ చేసి చెఫ్ కాంపిటీషన్ కు సంబంధించిన వివరాల గురించి అడుగుతుంది. తన భర్త ఈ పోటీల్లో పాల్గొంటున్నాడని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అని అంటుంది. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ గడువు పూర్తి అయిపోయింది అని చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. కానీ తన దగ్గర ఒకే ఒక్క ఫామ్ ఉంది అని మీరు ఒక గంట లో వస్తే అది మీకు ఇస్తాను అని ఆ తర్వాత తాను చూసుకుంటానని భరోసా ఇస్తుంది. దీంతో జానకి ఆ టెన్షన్ లో ఉంటుంది.

    రంగంలోకి నీలావతి

    రంగంలోకి నీలావతి

    జానకి లూసితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడే అత్త జ్ఞానాంబ కూడా అక్కడికి వస్తుంది. అక్కడ పూజకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకోవాలి అని చెబితే ఇక్కడ నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా అని హెచ్చరిక చేస్తుంది. ఇక ఆ తర్వాత నీలావతి అక్కడికి కూడా వస్తుంది. జానకి రామచంద్రకు సంబంధించిన ఏదో ఒక సీక్రెట్ గురించి తెలుసుకొని చెబితే మల్లిక తన పట్టు చీర కొనిస్తాను అని చెప్పడంతో నీలవతి వారి మీద ఫోకస్ చేస్తుంది. ఇక ఆ తర్వాత పూజకు సంబంధించిన పనుల్లో జ్ఞానాంబ బిజీగా ఉండగా జానకి రామచంద్ర ఇద్దరూ కూడా వారి గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు.

    జ్ఞానాంబ సీరియస్

    జ్ఞానాంబ సీరియస్

    ఇక వారి కోసం వెతికిన జ్ఞానాంబ పిలవాలి అని వారి గది దగ్గరకు వెళ్తుంది. ఇక అప్పుడే గదిలో జానకి పడిపోతూ ఉండగా రామచంద్ర జానకిని పట్టుకుంటాడు. అప్పుడే వారి గది తలుపులు తెరిచిన జ్ఞానాంబ.. ఇద్దరు కూడా కలుసుకున్నట్లు గా గమనిస్తోంది. పూజ అయిపోయే వరకు నియమనిష్టలతో ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా మీరు పట్టించుకోలేదు అని సీరియస్ అవుతుంది.

    అంతేకాకుండా ఈ రోజు పూజ పూర్తయ్యే వరకు కూడా మీరు బయటకు వెళ్ళకూడదు అని చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. మరి కాంపిటీషన్ పోటీలకు రామచంద్రను జానకి ఎలా తీసుకు వెళుతుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 305
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X