Janaki Kalaganaledu Serial May 21st Episode: కన్నబాబు చెంప పగలగొట్టిన జానకి.. మరో ట్విస్ట్ ఇచ్చిన దొంగలు

జానకి కలగనలేదు సిరియల్ మొదలై నెల రోజులే అయినప్పటికీ రోజురోజుకు ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. ఓ వర్గం వారిని రాశి నటన అమితంగా ఆకట్టుకుంటోంది. క్యూట్ లవ్ స్టొరీతో పాటు ఒక భార్య ఆశయం, భర్త అమాయకత్వ ప్రేమ, గాంబిర్యమైన అత్త డామినేషన్, ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 45వ ఎపిసోడ్ ఒక లుక్కేస్తే..

జనకికి ఊహించని అనుభవాలు

జనకికి ఊహించని అనుభవాలు

వైజయంతి మనవరాలి బారసాలకు వెళ్లిన అనంతరం అక్కడ జనకికి ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. అంతా సవ్యంగా ఉంటుందని అనుకుంటున్న సమయంలో వైజయంతి జానకిని చదువుకున్న అమ్మాయిలా ఉందంటూ జ్ఞానాంబను రెచ్చగొడుతుంది. ఆ మాటతో జ్ఞానాంబ కౌంటర్ ఇస్తుంది.

నా కోడలు నిరక్షరాస్యురాలు

నా కోడలు నిరక్షరాస్యురాలు

నా కోడలు నిరక్షరాస్యురాలు. సంతకం కూడా రాదని చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. జానకి అన్నయ్య ఆమెకు చదువు రాదనే చెప్పాడని జ్ఞానాంబ వివరణ ఇవ్వడంతో జానకి మైండ్ బ్లాక్ అవుతుంది. అన్నయ్యతో మాట్లాడిన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఏమిటి మోసం అని తనలో తానే బాధపడుతుంది.

నీ మొగుడు పుతారేకు గాడు

నీ మొగుడు పుతారేకు గాడు

ఇక జానకి బాధ పడుతున్న సమయంలో జ్ఞానాంబ అవమానాన్ని గుర్తు చేసుకొని కన్నబాబు జానకి వైవు వస్తాడు. ఆమె ఏడుస్తుంటే నీ మొగుడు ఒక పుతారేకు గాడు అంటూ నన్ను చేసుకుంటే కౌన్సిలర్ అయ్యే దానివి అని చెబుతాడు. అందుకు జానకి అతని చెంప పగలగొట్టి నా భర్తను మరో మాట అన్నావంటే ఈసారి పళ్లు రాలతాయని చెబుతుంది.

దొంగలు ఇచ్చిన ట్విస్ట్

దొంగలు ఇచ్చిన ట్విస్ట్

జానకి కన్నబాబు మధ్య గోడవను చూసిన రామచంద్ర భార్య ప్రేమకు ఫిదా అయిపోతాడు. అనంతరం ఇంటికి వెళుతుండగా ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోవడంతో దొంగతనం జరుగుతుంది. ఇంట్లో విలువైన బంగారం వెండి కనిపించకపోవడంతో ఎవరికి వారు తెలియనట్లుగానే ఉంటారు.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
చిన్న కోడలని పంపించేయలని నిర్ణయం..

చిన్న కోడలని పంపించేయలని నిర్ణయం..

ఇక తరువాత ఎపిసోడ్ లో అందరితో మీటింగ్ పెట్టగా చిన్న కొడలిపై భర్త చేయి చేసుకుంటాడు. అలాగే ఆమెను ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేయలని జ్ఞానాంబ నిర్ణయం తీసుకుంటుంది. దీంతో ఒక్కసారిగా ఎపిసోడ్ లో ట్విస్ట్ చేసుకుంటుంది. మరి అత్తయ్య తీరుతో జానకి ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X