twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu May 23rd: గదిలో రామ, జానకి.. పూజ పెట్టుకొని ఈ పనులేంటని జ్ఞానాంబ సీరియస్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకుల్ని అకట్టుకోవడంలో సరికొత్త కథాంశంతో ముందుకు సాగుతోంది. తన భార్య కోసం మొదటిసారి లక్ష రూపాయలు అప్పు చేసిన రామచంద్ర తల్లికి తెలియకుండా స్వీట్ షాప్ ను కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అది కూడా చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అతను రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక జానకి తన భర్తను ఎలా తప్పించింది అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక భర్త చేసిన సహాయం ఏమిటి? అత్త నుంచి వచ్చిన అపాయం ఏమిటి? అనే అంశాలు హైలెట్ అవుతున్నాయి. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 306వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

     రామచంద్ర చెఫ్ కాంపిటీషన్

    రామచంద్ర చెఫ్ కాంపిటీషన్

    రామచంద్ర పుట్టినరోజు సందర్భంగా తల్లి జ్ఞానాంబ ప్రత్యేకంగా అతనికి ఆయుష్షు హోమం చేయిస్తుంది. అందుకోసం ఇంట్లోనే ప్రత్యేకంగా పూజకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. అలాగే ఆ పూజలో రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఉండాలి అని జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే రామచంద్ర చెఫ్ కాంపిటీషన్ కు సంబంధించిన ఆలోచనలతో జానకి మరింత టెన్షన్ లో ఉంటుంది. ఎందుకంటే చెఫ్ కాంపిటీషన్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఒక గంటలో నింపాలి అని లూసీ చెప్పడంతో జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది.

    గంట ఆలస్యం అయితే..

    గంట ఆలస్యం అయితే..

    మరో గంట ఆలస్యం అయితే లూసీ అక్కడి నుంచి వెళ్లి పోతుంది అని బంగారం ఇలాంటి అవకాశం కూడా చేజారి పోతుంది అని జానకి ఆలోచిస్తుంది. ఇక ఎలాగైనా రామచంద్రను ఇంట్లో నుంచి బయటకు తీసుకు వెళ్ళాలి అని జానకి అనుకుంటుంది. ఈ క్రమంలో నీలావతి ఇంటికి వచ్చి ఏదో ఒక విషయంలో గొడవ సృష్టించాలి అని అనుకుంటుంది. అంతే కాకుండా ఇక్కడ జరిగే పరిణామాలు మల్లికకు చెబితే పట్టుచీర కొనిపిస్తుంది అని ఆశతో అనుమానంగా చూస్తూ ఉంటుంది.

    స్వీట్ షాప్ ను కాపాడుకునే అవకాశం

    స్వీట్ షాప్ ను కాపాడుకునే అవకాశం

    ఇక ఇంతలో జానకి రామచంద్రను పక్కకు తీసుకువెళ్లి అసలు విషయం చెప్పాలి అనుకుంటుంది. ప్రత్యేకంగా గదిలోకి తీసుకు వెళ్ళిన జానకి చెఫ్ కాంపిటీషన్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నింపాలని అందుకోసం మనం లూసి దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది. కానీ అమ్మకు తెలియకుండా వెళితే ఆ తరువాత ఆగ్రహానికి గురి అవుతుంది అని ఆలోచిస్తాడు. అయితే మరొక వైపు అప్పు తీర్చాలి అంటే చెఫ్ కాంపిటీషన్ లో గెలిచి తీరాలి అని అందులో వచ్చే లక్ష రూపాయలు అతనికి ఇచ్చి స్వీట్ షాపును కాపాడుకునే అవకాశం ఉంటుంది అని రామచంద్ర ఆలోచిస్తాడు.

    నీలావతి అనుమానాలు

    నీలావతి అనుమానాలు

    ఇక ఇద్దరు మాట్లాడుకుంటున్న తరుణంలోనే మరొకవైపు నీలావతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని పసిగట్టి మల్లికకు చెప్పాలని అనుకుంటుంది. అయితే వారి గది దగ్గరికి వెళ్లిన నీలవతికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం సరిగా అర్థం కాదు. ఈ తరుణంలో జ్ఞానాంబకు ఆ విషయం చెప్పాలి అని నీలావతి ఆలోచిస్తుంది. నీ కొడుకును జానకి లోపలికి తీసుకెళ్లి ఏదో చెబుతోంది అని లేనిపోని అనుమానాలను కలిగిస్తుంది. దీంతో జ్ఞానాంబ పూజకు సిద్ధంగా ఉండాలి అని చెబితే ఇలా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తుంది. దీంతో గది దగ్గరికి వెళ్లి వాళ్ళని పిలుస్తుంది.

     గదిలో జానకి, రామ ఆ విధంగా..

    గదిలో జానకి, రామ ఆ విధంగా..


    ఇక అప్పుడే కంగారుపడిన జానకి తలుపులు తెరవడానికి వెళుతుంది. ఈ క్రమంలో ఆమె పడిపోతుంటే రామచంద్ర భార్యను పట్టుకుని ఉంటాడు. అంతేకాకుండా ఆమె జుట్టు కూడా రామచంద్ర చొక్కాకు ముడిపడి వుంటుంది. దీంతో జ్ఞానాంబ ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తుంది. వాళ్లిద్దరిని అపార్థం చేసుముంటుంది. పూజ జరిగేటప్పుడు ఎంతో నిష్టతో ఉండాలని, మీరు ఇలా కలుసుకుంటే పూజకు ఫలితం కూడా ఉండదు అని అంటుంది. జానకి రామచంద్రను ఎక్కడికైనా తీసుకు వెళుతుందేమో అనే అనుమానంతో కూడా జ్ఞానాంబ హెచ్చరిక చేస్తుంది. పూజ ముగిసే వరకు, అలాగే రేపు ఉదయం వరకు కూడా మీరు కలుసుకో కూడదు అని ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్లకూడదు అని జ్ఞానాంబ ఆదేశాలు జారీ చేస్తుంది.

    జ్ఞానాంబ మళ్ళీ సీరియస్

    జ్ఞానాంబ మళ్ళీ సీరియస్


    దీంతో జానకి మళ్ళీ సందిగ్ధంలో పడుతుంది. ఇక ఇద్దరూ వెళ్లి పూజలు కూర్చున్నప్పటికీ కూడా చెఫ్ కాంపిటీషన్ కు సంబంధించిన ఆలోచనలోనే ఉంటారు. మంత్రాలు కూడా సరిగ్గా పలకరు. ఈ క్రమంలో జానకి రామచంద్ర మనసు ఎక్కడో పెట్టి పూజ చేస్తున్నారు అని జ్ఞానాంబ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక పూజ ముగిసిన తర్వాత రామచంద్ర జానకి పక్కకు తీసుకెళుతుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే జ్ఞానాంకు ఇష్టం లేకపోయినా జానకి భర్తను చెఫ్ కాంపిటీషన్ కు తీసుకు వెళుతుందో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial May 23rd Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X