Janaki Kalaganaledu May 24th: జానకి చేసిన పనికి జ్ఞానాంబ ఉగ్రరూపం.. సీరియస్ వార్నింగ్ తో షాక్!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. లక్ష రూపాయలు అప్పు చేసిన రామచంద్ర ఊహించని విధంగా భార్య కోసం ఇబ్బందుల్లో పడతాడు. అనుకోకుండా స్వీట్ షాప్ కూడా సమస్యల్లో పడుతుంది. రామచంద్ర శత్రువు దాన్ని కైవసం చేసుకోవాలని చూస్తాడు. మరోవైపు జానకి జానకి తన భర్తను కన్నబాబు అపాయం నుంచి ఎలా తప్పించాలా అని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో తన అత్త జ్ఞానాంబ నుంచి కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. జానకి ఐపీఎస్ చదువును కూడా పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో సీరియల్ ప్రేక్షకులలో ఆదరణను పెంచుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 307వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

పాత గొడవల కారణంగా..

పాత గొడవల కారణంగా..

రామచంద్ర జానకి చదువు కోసం కన్నబాబు దగ్గర లక్ష రూపాయలు అప్పు చేస్తాడు. అయితే ఆ కారణంగా కన్నబాబు రామచంద్ర పాత గొడవలన్నీ దృష్టిలో పెట్టుకుని అతనిపై పగ తీర్చుకోవాలని కూడా అనుకుంటాడు. అందుకోసం రామచంద్రం స్వీట్ షాప్ కూడా దక్కించుకోవాలని రామచంద్ర చేత కొన్ని డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టించుకుంటాడు. అయితే ఈ గొడవ గురించి తెలియని జ్ఞానాంబ.. రామచంద్ర ఇంకా దేని గురించో బాధ పడుతున్నాడు అని జానకిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అంతేకాకుండా జానకి ప్రతి విషయంలో కూడా జ్ఞానాంబ ప్రతిసారి సీరియస్ అవుతూ ఉంటుంది.

బంగారం లాంటి అవకాశం

బంగారం లాంటి అవకాశం

జ్ఞానాంబ తన కొడుకు రామచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోని ఒక ప్రత్యేకమైన హోమం చేయిస్తుంది. రామచంద్ర నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని చేయించిన పూజలో జానకి కూడా ఉండాలి అని దంపతులు ఇద్దరు కలిసి చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని జ్ఞానాంబ చెబుతారు. అయితే ఈ క్రమంలో మరొకవైపు జానకి తన భర్త చెఫ్ కాంపిటీషన్ గురించి ఆలోచిస్తుంది. మరొక గంటలో ఆ కాంపిటీషన్ కు సంబంధించిన ఫామ్ ఫిలప్ చేయకపోతే బంగారం లాంటి అవకాశం చేజారిపోతుంది అని ఆలోచిస్తుంది. అందుకే రామచంద్రని బయటకు తీసుకెళ్లి ఫామ్ ఫిలప్ చేయాలి అని ఆలోచిస్తుంది.

నీలావతి సంతోషం

నీలావతి సంతోషం

ఒక రామచంద్ర, జానకి.. చెఫ్ పిటిషన్ గురించి ఆలోచిస్తున్న సమయంలో జ్ఞానాంబ పూజ గురించి మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని పూజ అయిపోయే వరకు రేపటి వరకు ఇంట్లో నుంచి కూడా కాలు బయట పెట్టకుండా ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో ఏం చేయాలో అర్థం కానీ సమయంలో పూజ అయిపోయిన తర్వాత జానకి తన భర్తను బయటకు తీసుకెళ్లి అసలు పని పూర్తి చేయాలి అని అనుకుంటుంది. అయితే రామచంద్ర జానకి ఇద్దరూ బయట మాట్లాడుకుంటూ ఉండగా నీలావతి వారి ఇద్దర్ని చూస్తుంది. ఈ కారణంతో ఈ రోజు వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరగబోతుంది అని తనలో తానే పెద్ద సంతోష పడుతూ ఉంటుంది.

 లూసీ కోసం వెళ్లిన జానకి రామ

లూసీ కోసం వెళ్లిన జానకి రామ


ఇక రామచంద్ర జానకి ఇద్దరూ కూడా అత్తగారికి మాటను లెక్క చేయకుండా ఇంట్లో నుంచి లూసిని కలవడానికి వెళ్తారు. రామచంద్ర జానకి ఎంత వేగంగా వెళ్లినప్పటికీ కూడా అప్పటికే లూసి హైదరాబాద్కు బయలుదేరి ఉంటుంది. వాచ్ మెన్ ని అడగడంతో ఇప్పుడు ఐదు నిమిషాల క్రితం వెళ్ళారు అని చెప్పడంతో రామచంద్ర జానకి మళ్ళీ బైక్ పై వేగంగా ఆమెను కలవడానికి వెళ్తారు. ఇక మార్గంమధ్యలో ఆమె కలవడంతో జరిగిన విషయం గురించి చెబుతారు ఇక వెంటనే తన దగ్గర ఉన్న ఒక ఫామ్ ఇచ్చిన లూసి దాన్ని ఫిలిప్ చేయాలని అంటుంది. అలాగే తప్పకుండా ఈ పోటీలో రామచంద్ర గెలుస్తాడు అని ఆమె చెప్పడంతో జానకి కూడా ఎంతగానో సంతోషిస్తుంది. అయితే వంటల పోటీలు మూడు రోజులు ఉంటుంది అని ఒకరోజు ముందే మీరు హైదరాబాద్ బయలుదేరాలి అని చెబుతుంది.

మరింత కోపంగా జ్ఞానాంబ

మరింత కోపంగా జ్ఞానాంబ


ఇక చెఫ్ పోటీల్లో గెలిస్తే కన్నబాబు అప్పు తీర్చేయవచ్చు అని రామచంద్ర సంతోషంగా ఉంటాడు. అనంతరం రామ ఇప్పుడు వెంటనే మనం ముందుగా ఇంటికి వెళ్ళాలి అని అక్కడ మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని భయపడుతూ చెబుతాడు. ఇక ఇంటికి రాగానే జ్ఞానాంబ కనీసం కూర్చోకుండా కొడుకు కోడలు గురించి ఆలోచిస్తుంది. బయటకు వెళ్ళవద్దని ఎంత చెప్పినా కూడా జానకి నా మాట వినకుండా రామచంద్ర ను బయటకు తీసుకు వెళ్ళింది అని ఆగ్రహంతో ఉంటుంది. అప్పుడే మల్లిక కూడా ఇంట్లో అడుగు పెడుతుంది.

మరోసారి చెప్పే అలవాటు లేదు

మరోసారి చెప్పే అలవాటు లేదు


అయితే ఏదైనా ముఖ్యమైమ పని వలన బయటికి వెళ్లి ఉంటారేమో అని గోవిందరాజులు జ్ఞానాంబను కూల్ చేసే ప్రయత్నం చేసాడు. కానీ జ్ఞానం మాత్రం మీరు ఏమీ మాట్లాడ వద్దు అని రామచంద్రం దగ్గరికి పిలుస్తుంది. ఎందుకు వెళ్లారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. ఇక జానకి ఎలాంటి అబద్ధం చెప్పకుండా అసలు విషయం చెబుతుంది. కాంపిటీషన్ కు సంబంధించిన ఫామ్ ఫిలిప్ చేయడానికి బయటకు వెళ్ళినట్లు చెప్పడంతో తల్లి ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. నేను ఎంత చెప్పినా కూడా నా మాటలు పట్టించుకోలేదు మరొకసారి నాకు చెప్పే అలవాటు లేదు కాంపిటీషన్ గురించి ఇంతటితో మర్చిపోవాలి అంటూ.. నా కొడుకు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని మరొకసారి హెచ్చరిస్తుంది. మరి జానకి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X