Janaki Kalaganaledu May 24th Episode: ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు.. అసలు నిజం తెలుసుకున్న జ్ఞానాంబ!
జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. ఊహించని ట్విస్టులతో ఈ సిరియల్ వీక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. చాలా కాలం తరువాత రాశి నటన అమితంగా ఆకట్టుకుంటోంది. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త అమాయకత్వ ప్రేమ, అత్త కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 46వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

దొంగల బీభత్సం
వైజయంతి మనవరాలి బారసాలకు వెళ్లిన అనంతరం జ్ఞానంబ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఇంట్లో విలువైన బంగారం వెండి సామాన్లను దొంగలు దోచుకుపోతారు. అలాగే ఇంటిని చిందవందర చేయడంతో వెనువెంటనే మల్లికా, అతని మరిది సేకనులో శుభ్రం చేసి ఉంచుతారు.

జ్ఞానాంబ అనుమానాలు
ఇక జ్ఞానాంబ ఇంటికి రాగానే ఇల్లు రోజులా కనిపించకుండా మరింత కొత్తగా కనిపించడంతో అనుమానం వస్తుంది. మల్లికను అడగడంతో ముందోచ్చే పండగ కోసం ఇలా నేనే రెడీ చేశాను అని వణుకుతూ నవ్వుతూ చెబుతుంది. జ్ఞానాంబ అందుకు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎప్పటికైనా నాకు నిజాలు తెలియాల్సిందే అంటూ వివరణ ఇస్తుంది.

జానకి - రామచంద్ర.. ఫస్ట్ నైట్
జానకి - రామచంద్ర ఫస్ట్ నైట్ పై జ్ఞానాంబ మొత్తానికి ఒక క్లారిటీ ఇస్తుంది. జానకి అన్నయ్య అమెరికా వెళ్ళడానికి సిద్ధమవ్వగా అతన్ని కలవాలని అనుకుంటుంది. అందుకు జ్ఞానాంబ అనుమతి తీసుకోగా ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేయ్యాలి అని అప్పుడు మొదటి రాత్రికి సిద్ధమవ్వమని వివరణ ఇస్తుంది.

ఒంటరిగా జానకి కన్నీళ్లు
ఇక ఫంక్షన్ లో జ్ఞానాంబ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని జానకి ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. నా కోడలు నికాసైన నిరక్షరాస్యత కలిగిన అమ్మాయి అని అందరి ముందు చెప్పడం జానకిని కలచి వేస్తుంది. జానకి అన్నయ్య ఆ విధంగా జ్ఞానాంబకు అబద్ధం చెప్పడం ఆమెను మరింత బాధకు గురి చేస్తుంది.

జానకితో రామ్ మాటలు
జానకి బాధ పడుతున్న క్రమంలో అప్పుడే తల్లికి సేవలు చేసి వచ్చిన భర్త రామచంద్ర షాక్ అవుతాడు. జనాకి బాధకు కారణం గురించి తెలుసుకోవాలని ఎంతో అడిగినా ఆమె అసలు కారణం చెప్పదు. మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకోవడం భర్తగా నాకు బాధ్యత ఉందని అమ్మ చెప్పినట్లు రామచంద్ర వివరణ ఇస్తాడు. ఆ మాటలతో జానకి ఏమి లేదని సమాధానం చెబుతుంది.

అసలు విషయం తెలియడంతో
ఇక హఠాత్తుగా మంచి నీళ్ళ కోసం నడి రాత్రి లేచిన జ్ఞానంబకు అనుకోని విషయం తెలుస్తుంది. రోజు తల దగ్గర వెండి చెంబులో మంచి నీళ్ళు పెట్టె మల్లిక ఆ రోజు పెట్టదు. దొంగలు చెంబును ఎత్తుకుపోయిన విషయాన్ని టెన్షన్ గా పనిమనిషికి చెబుతుండగా జ్ఞానాంబ ఆ మాటలను వింటుంది. వెంటనే ఉదయం ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తుండడంతో చివరికి మల్లిక దగ్గర మాటలు కొనసాగుతాయి.

అన్నయ్య దగ్గరకి వెళ్లిన జానకి
తరువాత ఎపిసోడ్ లో అందరితో మీటింగ్ పెట్టగా మల్లికపై ఆమె భర్త చేయి చేసుకుంటాడు. అలాగే ఆమెను ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేయలని జ్ఞానాంబ నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలో జానకి అసలు విషయం అడిగేందుకు అన్నయ్య దగ్గరకు వెళుతుంది. తనకు చదువు లేదని అత్తయ్య దగ్గర ఎందుకు చెప్పవని నిలదిస్తుంది. ఇక రేపటి ఎపిఒసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











