twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu May 25th: జ్ఞానాంబకు తెలియకుండా పెళ్లి ప్లాన్.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మల్లిక!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరో కీలక మలుపు తిరుగుతోంది. ఐపీఎస్ కావాలని ఆశతో ఉన్న జానకి అత్తగారి అనుమానాల కారణంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటోంది. మరోవైపు జానకి జానకి తన భర్తను కన్నబాబు అపాయం నుంచి ఎలా తప్పించాలా అని ఆలోచిస్తుంది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ ప్రేక్షకులలో ఆదరణను పెంచుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 308వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

    చెఫ్ కాంపిటీషన్ కోసం గొడవ

    చెఫ్ కాంపిటీషన్ కోసం గొడవ

    రామచంద్రకు చదువు రాదు అని జానకి అన్నయ్య అవమానించడంతో ఆ విషయంలో జానకి కూడా ఎంతగానో బాధపడుతుంది. అయితే తన భర్తకు మంచి గౌరవం దక్కాలి అనే ఆశ పడుతుంది. అందుకోసమే జానకి ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. రాబోయే చెఫ్ కాంపిటీషన్లో రామచంద్రను పోటీ చేయించాలని అనుకుంటుంది. అయితే ఆ విషయంలో రామచంద్ర తల్లి జ్ఞానాంబ పూర్తిగా విభేదిస్తుంది. అక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు అని అందరి మధ్యలో నా కొడుకు ఏ మాత్రం అవమాన పడిన కూడా నేను తట్టుకోలేను అని ఆందోళన వ్యక్తం చేస్తోంది. రామచంద్ర ఎట్టి పరిస్థితుల్లోను వంటల పోటీ లకు వెళ్ళకూడదు అని ఆదేశాలు జారీ చేస్తుంది.

    సొంత పెత్తనాలు

    సొంత పెత్తనాలు

    అయినప్పటికీ కూడా జానకి రామ చంద్రను వంటల పోటీ లకు తీసుకువెళ్ళాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇంట్లో పూజ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా రామచంద్రను చెఫ్ కాంపిటీషన్ కు సంబంధించిన ఫామ్ ఫిలప్ చేయించేందుకు బయటకు వెళుతుంది. ఈ క్రమంలో జ్ఞానాంబ జానకి పై మరింత సీరియస్ అవుతుంది. తను ఎంత చెప్పినా కూడా ఎందుకు వినడం లేదు అని చదువుకున్న తెలివిని ఉపయోగించి నా కొడుకును ఏం చేయాలని అనుకుంటున్నావు అని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా నేను చెప్పినా కూడా సొంత పెత్తనాలు చేయడం ఏమిటి అని తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

    ఎవరు చెప్పినా వినని జ్ఞానాంబ

    ఎవరు చెప్పినా వినని జ్ఞానాంబ

    అయితే జానకి మాత్రం తప్పకుండా రామచంద్ర పోటీల్లో గెలిచే అవకాశం ఉంటుంది అని గెలిస్తే ఆయనకు ప్రత్యేకంగా గౌరవం కూడా దక్కుతుందని ఆయనను తిట్టిన వారు ఆ తర్వాత గౌరవిస్తారు అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఆ విషయం లో జ్ఞానాంబ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే జానకి రామచంద్ర ఈ విషయంలో జ్ఞానాంబ భర్త గోవిందరాజుల మాత్రం వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాడు. కోడలు చెప్పింది కూడా ఒకసారి ఆలోచించాలి అని రామచంద్ర మీద నీకు కూడా నమ్మకం ఉంది కదా అతన్ని ధైర్యంగా పంపించాలి అని సలహా ఇస్తాడు అయినా కూడా ఆమె ఏమాత్రం ఒప్పుకోదు.

    గోవిందరాజులు సలహా

    గోవిందరాజులు సలహా

    ఇక గోవిందరాజులు జ్ఞానాంబకు కోపాన్ని తగ్గించాలని రామచంద్ర జానకి ఇద్దరినీ కూడా గదిలోకి తీసుకువెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడతాడు. మీ అత్తయ్య కోపంతో మాట్లాడుతుంది కానీ రామచంద్ర గెలిస్తే ఆమె కూడా సంతోషిస్తుంది అని అంటాడు. అందుకే ఆమెకు తెలియకుండా మీరిద్దరూ హైదరాబాద్ వెళ్ళి పోటీల్లో పాల్గొనాలి అని కూడా గోవిందరాజులు సలహా ఇస్తాడు. అయితే అమ్మకు తెలియకుండా వెళితే కోపం వస్తుంది అని ఆ తర్వాత ఇలాంటి పరిణామాలు అయినా జరగవచ్చు అని రామ ఆందోళన వ్యక్తం చేస్తాడు. అయితే గోవిందరాజులు మాత్రం మీరు తప్పకుండా హైదరాబాద్ కు వెళ్ళాలి అని ఒక సలహా కూడా ఇస్తాడు.

    వెళ్లకపోతే ఒట్టు

    వెళ్లకపోతే ఒట్టు

    హైదరాబాదుకు వెళుతున్నట్లు చెప్పకుండా వైజాగ్ పెళ్లికి వెళ్తున్నాము అని చెప్పాలి అని అంటాడు. అక్కడ వైజాగ్ లో మన బంధువుల పెళ్లి ఉంది అంటూ హైదరాబాద్ కి వెళ్లి పోటీల్లో పాల్గొనాలి అని అంటాడు. అయితే ఆ విషయంలో కాస్త జానకి రామచంద్ర వెనుకడుగు వేసినప్పటికీ ఏమాత్రం ఆలోచించకూడదు అని మీరు వెళ్లకపోతే తన మీద ఒట్టు అని గోవిందరాజులు అంటాడు. దీంతో ఏమీ చేయలేక జానకి ఒప్పుకుంటుంది.

    మల్లిక మరో ప్లాన్

    మల్లిక మరో ప్లాన్


    ఇక ఆ తరువాత మల్లిక వారిని చూసి మామయ్య పెళ్లికి పంపిస్తున్నారు అనే అనుమానంతో వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేయాలని అనుకుంటుంది.. నీలావతికి ఫోన్ చేసి ఎవరైనా ఒక వ్యక్తిని పంపించి పెళ్లి ఆర్డర్ కోసం వెంటనే స్వీట్స్ తయారు చేయమని చెప్పాలి అని అప్పుడు రామచంద్ర జానకి స్వీట్స్ తయారు చేయడానికి స్వీట్ షాప్ లో ఉంటారని సలహా ఇస్తుంది. అయితే అందుకోసం లక్ష రూపాయల వరకు అడ్వాన్స్ ఇస్తే నమ్ముతారు అని మల్లిక నుంచి డబ్బులు లాగేందుకు నీలావతి ఆలోచిస్తుంది. ఇక జానకి పై పగ తీర్చుకోవడానికి మల్లిక డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అనంతరం జానకి రామచంద్రను ఎలాగైనా పెళ్లికని చెప్పి హైదరాబాద్ పంపించాలి అని జ్ఞానాంబతో మాట్లాడతాడు. కానీ అప్పుడే ఆర్డర్ రావడంతో జ్ఞానాంబ ఆర్డర్ కు ఒప్పుకుంటుంది. మరి జానకి రామచంద్ర హైదరాబాద్ వెళ్లకుండా ఆగిపోతారో లేదో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial May 25th Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X