Janaki Kalaganaledu Serial May 26th Episode:వామ్మో ఈ ట్విస్టులేంట్రా బాబోయ్..జ్ఞానాంబ vs జానకి వార్ మొదలైంది!
జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది. ప్రతీ సీన్ లో ఏదో ఒక పాయింట్ హైలెట్ అవుతూనే ఉంది. ఇక ఈసారి మరొక ఎపిసోడ్ తో సీరియల్ కీలక మలుపులు తిరిగింది. గత వారం కంటే ఈ వారం మరింత ఆసక్తిగా మారుతోంది. ఎవరు ఊహించని ట్విస్టులతో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సీనియర్ నటి రాశి నటన అమితంగా ఆకట్టుకుంటోంది. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 48వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

అన్నయ్యను నిలదీసిన జానకి
అన్నయ్య యోగి అమెరికా వెళుతుండడంతో చిన్న మరిదితో కలిసి జానకి ఆటోలో పుట్టింటికి వెళుతుంది. తన చదువు గురించి తెలిస్తే ఇక ఆ ఇంట్లో తనకు స్థానమే ఉండదని ఆలోచిస్తూ.. అదే విషయాన్ని తన పుట్టింటికి వెళ్లి అన్నయ్యతో చెబుతుంది. తనకు చదువు లేదని అత్తయ్యతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అన్నను జానకి చొక్కా పట్టుకొని నిలదిస్తుంది.

గోదారిలో దూకి చచ్చిపోతాను
ఇక మరొక వైవు మల్లిక ఎలాగైనా అత్త కోపం నుంచి తప్పుకోవాలని ప్లాన్ వేస్తూనే రామచంద్ర దగ్గరకు వెళ్లి కాళ్ళ బేరానికి వస్తుంది. ఎలాగైనా మీరే రక్షించాలి బావగారు. అత్తయ్య గారు మీరు చెబితే వింటారు అంటూ నన్ను ఇంట్లో నుంచి పంపిస్తే గోదారిలో దూకి చచ్చిపోతాను అంటూ బ్రతిమాలుతుంది. ఇక రామచంద్ర తన ప్రయత్నం చేస్తానని మాట ఇవ్వగానే తల్లి జ్ఞానాంబ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మల్లిక విషయం మాట్లాడాలని చెబుతుండడంతో వెంటనే పుట్టింటికి వెళ్లిన జానకిని తీసుకురావాలని అదేశిస్తుంది.

జానకి నిజం చెప్పేస్తానని అనడంతో..
ఇక జానకి అన్నయ్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. యోగి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె కన్నీళ్లు అగవు. నువ్వు ఆడిన అబద్ధం వల్లే పెళ్లి అవుతుంది అనుకుంటే.. ఇప్పుడు ఆ అబద్ధం వల్లే చెల్లేలి జీవితం ఏమవుతుందో ఊహించలేదు కదా అంటూ జానకి కౌంటర్ ఇస్తుంది. అంతే కాకుండా నిజాన్ని చెప్పేస్తానని అంటుంది. దీంతో యోగి అలా చేసి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని కాళ్ళు పట్టుకునే క్రమంలో అప్పుడే రామచంద్ర ఇంటికి వస్తాడు.

చెల్లికి యోగి సైగలు
జానకి కన్నీళ్లు చూసి ఎందుకు ఏడుస్తున్నారు అంటూ రామచంద్ర ప్రశ్నించడంతో వెంటనే యోగి కలుగజేసుకొని అమెరికా వెలుతున్నాం కదా అందుకే మా చెల్లి ఎమోషనల్ అవుతోందని చెబుతుంటాడు. జానకి నిజం చెప్పాలని అనుకుంటుంటే వద్దు అని సీక్రెట్ గా బ్రతిమలుతూ యోగి సైగలు చేస్తుంటాడు.

జానకికి కన్నబాబు సమస్య
ఇక మరొక వైవు సునందా దేవికి అసలు నిజం తెలుస్తుంది. కొడుకు కన్నబాబును జానకి చెంప పగలగొట్టిన విషయం అతని స్నేహితుడు చెప్పడంతో ఇంతవరకు నా దగ్గర విషయం ఎందుకు దాచావు అంటూ అతని చెంపపై కొడుతుంది. అనంతరం సునందా దేవి కన్నబాబుకు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావో చెయ్యి అంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో జనాకికి కొత్త సమస్య మొదలైనట్లు అర్ధమవుతుంది.
Recommended Video

జ్ఞానాంబ vs జానకి వార్ మొదలైంది
ఇక ఎపిసోడ్ క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్టుతో సీరియల్ సరికొత్త మలుపు తిరగబోతున్నట్లు తెలుస్తోంది. మల్లికను ఇంటి నుంచి పంపించేందుకు జ్ఞానాంబ ఆమె తల్లిదండ్రులను పిలిపిస్తుంది. ఇక కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించని జ్ఞానాంబ వెళ్లిపోవాలని ఆదేశించడంతో అప్పుడే జానకి ఎంట్రీ ఇస్తుంది.
మల్లిక గడప దాటే క్రమంలో ఆమె చేయి పట్టుకొని ఆపడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. సిరియల్ లో మొదటిసారి జ్ఞానాంబ vs జానకి వార్ మొదలైనట్లు అర్ధమవుతోంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











