Janaki Kalaganaledu May 27th Episode: మల్లిక కోసం డేంజర్ జోన్‌లో జానకి.. మొదటి రాత్రికి రెడీ!
జానకి కలగనలేదు సిరియల్ అత్త vs కోడలు ట్రాక్ లోకి తొందరగానే వచ్చేసింది. ప్రతి ఎపిసోడ్ కూడా నెక్ట్స్ ఎపిసోడ్ పై అంచనాలను పెంచేస్తోంది. ప్రతీ సీన్ లో ఏదో ఒక పాయింట్ హైలెట్ అవుతూనే ఉంది. గురువారం సీరియల్ కీలక మలుపులు తిరిగింది. గత వారం కంటే ఈ వారం మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. రాశి పాత్ర శివగామి రేంజ్ లో హైలెట్ అవుతోంది. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 49వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఎంత పెద్ద శిక్ష వేశావ్ అన్నయ్య
అన్నయ్య యోగి అమెరికా వెళుతుండడంతో చివరిసారిగా సాగనంపడానికికి వెళ్లిన జానకి తన చదువు గురించి తెలిస్తే ఇక ఆ ఇంట్లో తనకు స్థానమే ఉండదని తన బాధను చెప్పుకుంటుంది. యోగి క్షమించమని కోరినా కూడా జానకి కంటతడితో తన జీవితం ప్రశ్నార్థకంగా మారిందని బాధపడుతుంది. నాకు ఎంత పెద్ద శిక్ష వేశావ్ అన్నయ్య అంటూ రోధిస్తుంది.

అబద్ధం చెబితే ఎవరిని క్షమించను
ఇక మరొక వైవు మల్లిక ఎలాగైనా అత్త కోపం నుంచి తప్పుకోవాలని కాళ్ళ బేరానికి వస్తుంది. మల్లిక తల్లిదండ్రులు కూడా జ్ఞానాంబను బ్రతిమాలుకుంటారు. ఈ ఒక్కసారికి మీ కూతురిగా భావించి క్షమించండి. మరొకసారి ఆ తప్పు చేయదు అని వివరణ ఇస్తుంది. అయినా కూడా జ్ఞానాంబ మనసు కరగదు. నా కూతురు తప్పు చేసి అబద్ధం చెప్పినా కూడా ఇదే చేస్తాను అని అదేశిస్తుంది.

ఇందులో ఏ మార్పు లేదని..
ఇక జ్ఞానాంబ కోపాన్ని శాంతిపచేయలని ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. భర్త చెప్పినా కూడా జ్ఞానాంబ చిన్న కనుసైగతోనే నోరు ముయిస్తుంది. అలాగే రామచంద్ర కూడా తల్లిని ఒకసారి అడిగే ప్రయత్నం చేయడానికి వెళితే మొదటి మాటతోనే అతన్ని అడ్డుకుంటుంది. ఇందులో ఏ మార్పు లేదని చెప్పడంతో మల్లిక లగేజ్ తో వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది.

మల్లికను అడ్డుకున్న జానకి
ఇక అప్పటికే గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న జానకి రేపు తన అబద్ధం గురించి కూడా తెలిస్తే నాకు కూడా ఇంట్లో స్థానం ఉండదేమో అని ఆలోచిస్తుంటుంది. గుమ్మం దగ్గరికి రాగానే మల్లిక చేయి పట్టుకొని ఆపేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో వెంటనే జ్ఞానాంబ ఆగ్రహంతో జానకి అంటుంది.

డేంజర్ జోన్ లో జానకి
జానకి అత్త కోపాన్ని శాంతిప చేయడానికి ఒక్కసారి నేను చెప్పేది విని ఆలోచించండి అంటుంది. మల్లికను ఇంటికి పంపిస్తే మన ఇంటి పరువే పోతుంది అత్తయ్య గారు. మీ గౌరవం పోకూడదనే ఇష్టంతోనే ఇలా చెబుతున్నాను. ఈ ఒక్కసారికి క్షమించండి అని జానకి వివరిస్తుంది. అందుకు ఒప్పుకున్న జ్ఞానాంబ మరొకసారి మల్లిక తప్పు చేస్తే జానకి ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని కండిషన్ పెట్టడంతో అందరూ షాక్ అవుతారు.
Recommended Video

జానకి - రామచంద్ర.. మొదటి రాత్రి..
మల్లికను కాపాడినందుకు ఆమె తల్లిదండ్రులు జనకికి చేతులెత్తే మొక్కుతారు. రామచంద్రకు అందమైన భార్య కంటే తెలివైన మంచి భార్య దొరికిందని పొగుడుతుంటారు. ఇక పెళ్లి తరువాత జానకి - రామచంద్ర మొదటిరాత్రి క్యాన్సిల్ అవ్వడంతో ఫైనల్ గా ఇంట్లో వాళ్ళు అందుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











