Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Janaki Kalaganaledu May 28th: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సునంద.. కన్నబాబు రాకతో టెన్షన్ లో రామచంద్ర
జానకి కలగనలేదు సీరియల్ మరో ట్విస్ట్ తో ఆసక్తికరంగా మారింది. జ్ఞానాంబ ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన స్వీట్ షాప్ ను కొడుకు రామచంద్ర అనుకోకుండా తాకట్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. భార్య జానకిని ఐపీఎస్ చేయాలని లక్ష రూపాయలు అప్పు చేయడంతో కన్నబాబు ఆ స్వీట్ షాప్ ను లాగేసుకోవాలని చూస్తాడు. ఇక మరోవైపు అత్త పాత్రలో సీనియర్ నటి రాశి కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె అనుమానాల కారణంగా జానకి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. చిన్న కోడలు మల్లిక కారణంగా జానకికి సమస్యలు ఎదురవుతాయి. ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ ప్రేక్షకులలో ఆదరణను పెంచుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 310వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..
Recommended Video
కన్నబాబు అప్పు తీర్చేయాలని..
రామచంద్ర ఎలాగైనా తన స్వీట్ షాప్ ను కన్నబాబు నుంచి దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో లక్ష రూపాయల కోసం అతను ఎలాగైనా చెఫ్ కాంపిటీషన్ లో పాల్గొనాలని చూస్తాడు. అందులో పాల్గొన్న తర్వాత వచ్చే ప్రైజ్ మనీ తో కన్నబాబు అప్పి తీర్చేయాలని కూడా ఆలోచిస్తాడు. కానీ ఈ క్రమంలో అత్త నుంచి మరింత ఒత్తిడి వస్తుంది. అంతే కాకుండా మరొకవైపు రామచంద్ర కాంపిటీషన్ కి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇంట్లో కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
గోవిందరాజులు సహాయం
రామచంద్ర చెఫ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు తల్లి జ్ఞానాంబ ఏ మాత్రం ఒప్పుకోదు అందులో ఓడిపోతే మళ్ళీ తన కొడుకు ఇంకా బాధ పడతాడు అని చెబుతుంది. అంతే కాకుండా మరొక సారి వంటల పోటీలు అనే ప్రస్తావన తీసుకు వస్తే మర్యాదగా ఉండదు అని రామచంద్ర అక్కడికి వెళ్ళడానికి వీలులేదు అని కూడా జానకి హెచ్చరిస్తుంది. అయినప్పటికీ కూడా జానకి ఏమాత్రం తగ్గకుండా ఎలాగైనా రామచంద్రను హైదరాబాద్ తీసుకు వెళ్ళాలి అని ఆలోచిస్తుంది. జ్ఞానాంబ ఒప్పుకోకపోవడంతో వారికి గోవిందరాజులు సహాయం చేయడానికి వస్తాడు. జ్ఞానాంబకు తెలియకుండానే వెళ్ళాలి అని తన కొడుకు కోడలికి సూచిస్తాడు.
మల్లిక కన్నింగ్ ప్లాన్
వైజాగ్ లోనే పెళ్లికి వెళ్తున్నాము అని చెప్పి హైదరాబాద్ కు వెళ్లాలి అని తప్పకుండా పోటీల్లో గెలిచి తీరాలి అని గోవిందరాజులు అంటాడు. ఒకవేళ ఓడిపోతే సైలెంట్ గానే ఇంటికి రావాలి అని నిజం తెలిసినా కూడా మీ అమ్మ పెద్దగా పట్టించుకోదు అని ఈ విషయంలో ఇంకా ఏమీ ఆలోచించకుండా బయలుదేరాలి అని అంటాడు. అయితే మధ్యలో మల్లిక నీలావతి తో కలిసి జానకి రామచంద్ర వైజాగ్ వెళ్లకుండా చేయాలనుకుంటుంది. స్వీట్ షాప్ లో ఒక పెళ్ళికి సంబంధించిన ఆర్డర్ వచ్చినట్లుగా ప్లాన్ క్రియేట్ చేస్తుంది. అందుకు అటుకుల చిట్టిబాబును రంగంలోకి దింపుతుంది.
విష్ణు వీడియో దెబ్బ
మొత్తానికి ప్లాన్ సక్సెస్ కావడంతో నీలావతి చేసిన సహాయానికి మల్లిక ఆమెకు పట్టు చీర పెట్టాలని అనుకుంటుంది. అయితే వారు మాట్లాడుకుంటున్నట్లు గమనించిన విష్ణు తన మొబైల్లో వీడియో తీస్తాడు. వెంటనే నువ్వు అన్నయ్యను వదిన ను వైజాగ్ వెళ్లేలా చేయకపోతే ఈ వీడియో ఇంట్లో చూపిస్తాను అని బెదిరిస్తాడు. దీంతో మల్లిక ఏమీ చేయలేక అందుకు ఒప్పుకుంటుంది. వెంటనే ఇంటికి వెళ్లే అత్తగారితో అసలు విషయం చెప్పబోతూ ఉంటుంది. అయితే అంతకు ముందే అటుకుల చిట్టిబాబుకు మల్లిక ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. పెళ్లి క్యాన్సిల్ అయింది అని ఆర్డర్ కూడా ఇప్పుడు వద్దు అని చెప్పాలని సూచిస్తుంది.
మల్లికకు మరో షాక్
అనుకున్నట్లే
అటుకుల
చిట్టి
బాబుకు
ఫోన్
చేసి
జ్ఞానాంబకు
పెళ్లి
క్యాన్సిల్
అయింది
అని
అంటాడు.
దీంతో
మల్లికా
అటుకుల
చిట్టిబాబు
ఇచ్చిన
లక్ష
రూపాయలు
తనకు
ఇస్తే
వెళ్లి
తిరిగి
ఇస్తాను
అని
అంటుంది.
కానీ
జ్ఞానాంబ
మాత్రం
ఆ
డబ్బులు
ఇవ్వనని
అవసరం
అయితే
అతని
వచ్చి
తీసుకు
వెల్తాడు
అని
చెబుతుంది.
దీంతో
మళ్లీ
ఒక్కసారిగా
షాక్
అవుతుంది.
ఇక
ఆ
తర్వాత
గోవిందరాజులు
జానకి
రామచంద్ర
ఇద్దరిని
కూడా
వైజాగ్
ప్రయాణం
కావాల్సిందిగా
అందరికీ
వినిపించేలా
చెబుతాడు.
సునంద స్వీట్ ట్విస్ట్
ఆ తర్వాత గదిలోకి వెళ్ళిన అనంతరం గోవిందరాజులు మరొకసారి రామచంద్ర జానకి తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంతలో సునంద దేవి ఆమె కొడుకు కన్నబాబు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. త్వరలో సునంద దేవి పేరు మీద స్వీట్ షాప్ ఓపెన్ చేయబోతున్నాము అంటూ అది ఎక్కడో మీకు బాగా తెలిసి ఉంటుంది అని కూడా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పలేము అంటూ తెలిసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అని సునంద చెబుతుంది. ఇక కన్నబాబు రావడంతో రామచంద్ర ఆలోచనలో పడతాడు. ఎలాగైన డబ్బు సమకూర్చాలని అనుకుంటారు. ఇక ప్రత్యేకంగా గోవిందరాజుల తో మాట్లాడుతూ ఉండగా మల్లిక వారి మాటలను వింటుంది. వీరు వైజాగ్ వెళ్లకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు అని అనుమానిస్తుంది. మరి ఆ విషయాన్ని మల్లిక అత్తగారి చెబుతుందో లేదో చూడాలి.