Janaki Kalaganaledu May 28th Episode: మొదటి రాత్రి జానకి, రామ కబుర్లు.. మల్లిక ఊసరవెల్లి వేషాలు

జానకి కలగనలేదు సిరియల్ మొత్తానికి ఆఫ్ సెంచరీ కొట్టేసింది. మొదటి ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నెక్ట్స్ ఎపిసోడ్ పై అంచనాలను పెంచుతున్న ఈ సీరియల్ ప్రతీ సీన్ లో ఏదో ఒక పాయింట్ హైలెట్ అవుతూనే ఉంది. ఇక శుక్రవారం ఈ సీరియల్ లో కీలక పరిణామాలకు గొడవలకు దారి ఏర్పడింది. గత వారం కంటే ఈ వారం మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.

రాశి పాత్ర శివగామి రేంజ్ లో హైలెట్ అవుతోంది. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 50వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

జ్ఞానాంబ కండిషన్

జ్ఞానాంబ కండిషన్

మల్లికను ఇంట్లో నుంచి పంపించేయలని చూసిన జ్ఞానాంబను జానకి అడ్డుకున్న విషయం తెలిసిందే. అత్త కోపాన్ని శాంతిప చేయడానికి మల్లికను ఇంటికి పంపిస్తే మన ఇంటి పరువే పోతుంది అత్తయ్య గారు. మీ గౌరవం పోకూడదనే ఇష్టంతోనే ఇలా చెబుతున్నాను. ఈ ఒక్కసారికి క్షమించండి అని జానకి వివరిస్తుంది. అందుకు ఒప్పుకున్న జ్ఞానాంబ మరొకసారి మల్లిక తప్పు చేస్తే జానకి ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని కండిషన్ పెట్టడంతో అందరూ షాక్ అవుతారు.

జానకి ఆ విషయం అర్థమవ్వాలి

జానకి ఆ విషయం అర్థమవ్వాలి

ఇక అదే విషయంపై భర్త జ్ఞానాంబను అడగడంతో ఆమె తెలివిగా వివరణ ఇస్తుంది. నిజంగా జానకి ఇంటి పరువు గురించి ఆలోచించిన విధానం గొప్పదే కావచ్చు. కానీ ఇంటి కట్టుబాట్లు తనకు తెలియాలి. ఎప్పుడు ఎలా ఉండాలనేది అర్థమవ్వాలి. ఎవరు చేయని పని జానకి చేసింది. మిగతా వాళ్ళు చేయలేకనా? మరొకసారి మల్లిక తప్పు చేస్తే జానకికి ఆ విషయం అర్థం అవుతుందని జ్ఞానాంబ భర్తకు వివరిస్తుంది.

మల్లిక ఊసరవెల్లి ఏడుపులు

మల్లిక ఊసరవెల్లి ఏడుపులు

ఇక మల్లిక ఊసరవెల్లి ఏడుపుల నుంచి విముక్తి పొంది ఇంటి బయట చిందులు వేస్తుంది. ఇక అప్పుడే జానకి అక్కడికి రాగా అత్తలు అందరూ ఇంతే ఇంతే అంటూ కొడళ్లకు సినిమాలకు వెళ్లాలని ఉండదా అని వివరిస్తుంది. కానీ నువ్వు చేసింది తప్పే మల్లిక అంటూ జానకి కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది.

జానకిపై స్కెచ్ వేసిన సునంద దేవి

జానకిపై స్కెచ్ వేసిన సునంద దేవి

ఇక మరోవైపు జానకి స్నేహితురాలిని పిలిపించి కౌన్సిలర్ సునంద దేవి భారీ స్కెచ్ వేయడానికి సిద్ధమవుతుంది. కన్నబాబు చెంప పగలగొట్టిన పగను దృష్టిలో ఉంచుకొని స్నేహితురాలి ద్వారా జానకిని తోటలోకి తీసుకురావాలని బెదిరిస్తారు. అందుకు జానకి స్నేహితురాలు ఆలోచనల్లో పడుతుంది.

మరొక సంసారం పెట్టిన తరువాతే పిల్లలు

మరొక సంసారం పెట్టిన తరువాతే పిల్లలు

జానకి మొదటిరాత్రి కోసమని ఏర్పాట్లు జరుగుతుండగా మల్లిక జానికిని రెడీ చేస్తుంది. ఇక జ్ఞానాంబ మల్లికను సూటి పోటీ మాటలతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది. ఇంతవరకు పిల్లలు లేరు అంటూ మనసును గాయపరిచినా కూడా మల్లిక ఏడ్చినట్లు యాక్టింగ్ చేస్తుంది. పిల్లల్ని కంటే వాళ్ళను కూడా మీ అన్నయ్య లాగే గంగిరెద్దుల మార్చేస్తుందని భర్తతో చెబుతుంది. మరొక సంసారం పెట్టిన తరువాతే పిల్లల్ని కంటాను అంటూ చాలెంజ్ చేస్తుంది.

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
రామచంద్రకు కడుపు నొప్పి

రామచంద్రకు కడుపు నొప్పి

ఇక ఎలాగైనా వరాసుడిని ఇవ్వాలని జ్ఞానాంబ, జానకి చేతికి పాల గ్లాసు ఇచ్చి శోభనం గదికి పంపిస్తుంది. ఇక రామచంద్ర అక్కడ మల్లిక విషయాన్ని గుర్తు చేస్తూ జనకికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతుంటాడు. ఇద్దరు బెడ్ పై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రామ మెల్లమెల్లగా జానకి వైపుకు జరుగుతూ ఉంటాడు... ఇక ఉదయమే రామచంద్రకు సడన్ గా కడుపు నొప్పి రావడంతో అందరూ షాక్ అవుతారు. అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X