twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu May 2nd: జానకి హ్యాపీ.. రామచంద్ర మనసులో అనుమానం పుట్టించిన మల్లిక!

    |

    జానకి కలగనలేదు సీరియల్ ఎంతో ఆసక్తికరంగా మారింది. సీనియర్ నటి రాశి జ్ఞానాంబ అనే అత్త పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఎలాగైనా ఐపీఎస్ కలను సాధించాలని అనుకున్న జానకి చదువుకోవడం ఆమె అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. అయినప్పటికీ జ్ఞానాంబ కొడుకు జానకికి అండగా ఉంటాడు. ఇక జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక మాత్రం జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది.

    ఈ క్లిష్ట పరిస్థితులలో జానకి తన ఐపీఎస్ కలను ఎలా నెరవేర్చుకుంది అనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 291 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    రామచంద్ర కోపం

    రామచంద్ర కోపం

    జానకి అన్నయ్య యోగి బాబు తన కొడుకు బారసాల వేడుక కోసం జ్ఞానాంబ కుటుంబాన్ని ప్రత్యేకంగా పిలవడానికి ఇంటికి వెళతాడు. అయితే పాత గొడవలన్నీ దృష్టిలో పెట్టుకుని రామచంద్ర బారసాల వేడుకకు జానకి మాత్రమే వస్తుంది అని మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీ ఇంటికి రాలేమని మొహం మీదే చెప్పేస్తాడు.

    యోగి భార్య ఊర్మిళ ఎంత బ్రతిమాలినా కూడా రామచంద్ర తన ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు అని చెబుతాడు. దీంతో యోగి ఏమి అనలేని పరిస్థితిలో అక్కడినుంచి సైలెంట్ గా వెళ్ళిపోతారు. కానీ ఊర్మిల మీరు ఎలాగైనా కొడుకు బారసాలకి వస్తారు అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాము అని అనే జ్ఞానాంబకు చెబుతుంది.

    రుక్మిణి రాకతో..

    రుక్మిణి రాకతో..

    అయితే కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మేనల్లుడు బారసాలకు రావడానికి ఇష్టపడకపోవడంతో జానకి కూడా తన అన్న ఇంటికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడదు. అందరూ కలిసి వెళ్ళాలి అని ఆశ పడుతుంది. కానీ రామచంద్ర మాత్రం ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు అని మా అమ్మగారికి జరిగిన అవమానాన్ని నేను ఎన్కఆ మర్చిపోలేక పోతున్నాను అంటూ జానకితో చెబుతాడు.

    ఇక జానకి బాధపడుతున్న సమయంలో అప్పుడు వచ్చిన జానకి స్నేహితురాలు (దేవత సీరియల్) రుక్మిణి వచ్చి కుటుంబ సభ్యులందరికీ కూడా యోగి బాబు రావాలి అని చెబుతుంది.

    పసివాడికోసం..

    పసివాడికోసం..

    మీ కుటుంబం పంతాల కోసం ఒక పసివాడు బారసాల వేడుక సంతోషంగా జరగనివ్వకుండా చేయడం ఏమాత్రం న్యాయం కాదు అని ఒక సారి ఆలోచించి బారసాల కు రావాలి అని రుక్మిణి తెలియజేస్తుంది. ఇక ఆ మాటలకు కరిగిపోయిన జ్ఞానాంబ కుటుంబ సమేతంగా యోగి బాబు కొడుకు బారసాల కు వెళ్లేందుకు ఇష్టపడతారు.

    ఇక వారికోసం గుమ్మం దగ్గర ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న యోగి అతని భార్య ఊర్మిల రుక్మిణిని చూడగానే ఎంతగానో సంతోషిస్తారు. ఇక తన కొడుకును జ్ఞానాంబ తన చేతుల మీద ఎత్తుకొని వస్తుండటంతో యోగి దంపతులు ఎంతగానో ఆనందిస్తారు.

    తట్టుకోలేకపోతున్న మల్లిక

    తట్టుకోలేకపోతున్న మల్లిక

    మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఊర్మిళ చాలా ఆనంద పడుతూ ఉండగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూసిన జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక మాత్రం ఏ మాత్రం ఓర్చుకోలేక పోతుంది. మా అత్తయ్య గారు ఎప్పుడు ఎవరిమీద కోపం చూపిస్తారో తెలియదు ఎప్పుడు మంచితనం చూపిస్తారో తెలియదు అంటూ కొంటె గా మాట్లాడుతుంది.

    ఎందుకంటే మొన్నటి వరకు జానకి పై అలాగే ఆమె అన్నయ్య యోగి బాబు పై కోపం చూపించింది అని ఇప్పుడు సడన్ గా మళ్ళీ మంచు పర్వతాల తరహాలో మంచితనాన్ని చూపిస్తోందని సెటైర్ వేస్తుంది. ఇక ఆమె మాటలకు గోవిందరాజులు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తాడు. నీ బుద్ధి మార్చుకోవా అంటూ మరోసారి ఇలా పుల్లలు పెట్టే విధంగా ఎందుకు మాట్లాడుతావు అని కౌంటర్ ఇస్తాడు.

    ఇక ఆ తర్వాత జ్ఞానాంబ కూడా కౌంటర్ ఇస్తుంది ఫంక్షన్ అయిపోయే వరకు నువ్వు ఏ మాత్రం నోరు తెరవకుండా ఉండాలి అని హెచ్చరిక చేస్తుంది. దాంతో మల్లిక ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.

    కలిసిపోయిన అత్త కోడలు

    కలిసిపోయిన అత్త కోడలు

    ఇక ఆ తర్వాత ఆలస్యం చేయకుండా బారసాల కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని రుక్మిణి చెప్పడంతో అందరూ కూడా ఎంతో సంతోషంగా వేడుకల్లో పాల్గొంటారు. ఇక యోగి తన కొడుకును జానకి, రామచంద్ర ఇద్దరు కూడా ఉయ్యాలలో పడుకోబెట్టాలని చెబుతాడు. అయితే ఆ సమయంలో జానకి మా అత్తయ్య గారు తన మంచి మనసుతో ఉయ్యాలలో పడుకోబెడితే అతడికి మంచి జరుగుతుంది అని చెబుతుంది. ఇక ఆ మాటలకు జ్ఞానాంబ కూడా జానకిని మంచి మనసుతో చూస్తుంది. ఈ క్రమంలో మల్లిక కూడా మళ్లీ అత్తగారు జానకి కలిసిపోయారు అని అసూయతో చెందుతూ ఉంటుంది.

    జ్ఞానాంబ హ్యాపీ

    జ్ఞానాంబ హ్యాపీ

    ఇక ఆ తర్వాత జ్ఞానాంబ బాబును ఎత్తుకొని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే యోగి జరిగిన పాత గొడవలను మర్చిపోవాలి అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ పెద్ద వాళ్ల గురించి ఆలోచించి పసిపిల్లల విషయంలో మొండిగా ప్రవర్తించే రకం నేను కాదు అంటూ పసి పిల్లలు దైవంతో సమానం అని చెబుతోంది. ఆ తరువాత సంతోషంగా ఉయ్యాలలో బాబును పడుకోబెట్టి అతని మెడలో గొలుసు కూడా వేస్తుంది. ఇక ఆ తర్వాత రుక్మిణి బాబు కోసం ప్రత్యేకంగా పాట పాడుతుంది. అనంతరం ఆమె తాను ఇంటికి వెళ్లాల్సి ఉంది అని చెబుతూ గోవింద రాజులు జ్ఞానాంబ ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది.

    రామచంద్ర మనసులో అనుమానం..

    రామచంద్ర మనసులో అనుమానం..

    ఇక రుక్మిణి బయటకు వెళ్లిపోతున్న సమయంలో జానకి పిలుస్తుంది. అదే తరుణంలో మల్లిక రామచంద్ర మనసులో మరొక అనుమానం కలిగించే ప్రయత్నం చేస్తుంది. యోగి కావాలని ఇక్కడికి ఒక లాయర్ ని పిలిపించారు అని మీ ఇద్దరికీ కూడా విడాకులు ఇప్పించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు అని అబద్ధం చెబుతుంది. మరి ఆ విషయాన్ని రామచంద్ర సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది తర్వాత ఎపిసోడ్ లో చూడాలి

    English summary
    Janaki Kalaganaledu Today Episode 291
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X