Janaki Kalaganaledu May 31st: గోవిందరాజులు ఇచ్చిన ట్విస్ట్ కు మల్లిక మైండ్ బ్లాక్.. మరో కన్నింగ్ ప్లాన్!
జానకి కలగనలేదు రోజురోజుకు ఊహించని కథనంతో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. జానకి చదువు కోసం రామచంద్ర కన్నబాబు దగ్గర లక్ష రూపాయలు అప్పు చేస్తాడు. ఇక అతను తన తెలివితో స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా రామచంద్ర దగ్గర సంతకాలు కూడా పెట్టించుకుంటాడు. ఇక భార్య జానకిని ఐపీఎస్ చదువు కోసం లక్ష రూపాయలు కన్నబాబు దగ్గర అప్పు చేయడంతో స్వీట్ షాప్ ను లాగేసుకోవాలని చూస్తాడు. అనంతరం చిన్న కోడలు మల్లిక కారణంగా కూడా జానకికి సమస్యలు ఎదురవుతాయి. ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ ప్రేక్షకులలో ఆదరణను పెంచుకుంటోంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 311వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

వంటల పోటీల కోసం
రామచంద్రను వంటల పోటీలకు తీసుకువెళ్లడానికి జానకి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకు సహాయంగా మామ గోవిందరాజులు కూడా తోడుగా ఉంటాడు. ఒకవైపు మల్లిక రామచంద్ర జానకి ఇద్దరిని కూడా హైదరాబాద్ వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె తన అత్తగారు జ్ఞానాంబకు అనుమానం వచ్చేలా మరొక విషయం కూడా చెబుతోంది. రామచంద్ర జానకి ఇద్దరు కూడా వైజాగ్ పెళ్లి కి వెళ్లడం లేదు అని వంటల పోటీల కోసం హైదరాబాద్ వెళుతున్నారు అని చెబుతుంది. అయితే మొదట ఆ విషయాన్ని జ్ఞానాంబ నమ్మదు. నిన్ను పంపకుండా చేసినందుకు వాళ్ళపై అబద్ధాలు చెబుతున్నావా అని ప్రశ్నిస్తుంది.

వెన్నెల సహాయంతో
ఇక జానకి విషయంలో మల్లిక ఎలాగైనా పగ తీర్చుకోవాలని అని వీలైతే వారి టికెట్లను ఒక్కసారి చూడవలసిందిగా అత్తగారికి చెబుతుంది. ఇక జ్ఞానాంబ ఒకవేళ అదే నిజమై ఉండవచ్చునని కూడా అనుమానిస్తుంది. ఇప్పటికే చాలాసార్లు జానకి ఎవరికీ తెలియకుండా రామచంద్ర ను బయటకు తీసుకు వెళ్ళింది. ఇప్పుడు వైజాగ్ పెళ్లికి వెళ్తున్నారా లేదా అనేది అనుమానంగానే ఉంది అని ఆలోచిస్తోంది. దీంతో వెన్నెల సహాయంతో వారి టికెట్ల వివరాల గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది.

షాకైన మల్లిక
ప్రత్యేకంగా వెన్నెలను పిలిచిన జ్ఞానాంబ.. జానకి రామచంద్ర దగ్గర నుంచి టికెట్లు తీసుకుని బస్సు ఎన్ని గంటలకు ఉంది ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తుంది అనే వివరాలు చెప్పాలి అని అడుగుతుంది. దీంతో వెన్నెల దీర్ఘంగా వాటిని చూసి అసలు వివరాలను చెబుతూ ఉంటుంది. ఈ బస్ టికెట్ ఆత్రేయపురం నుంచి వైజాగ్ కు ఉంది అని వెన్నెల చాలా నవ్వుతూ సమాధానం ఇస్తుంది. అయితే ఆ విషయంలో మల్లికా మరింత అనుమానం కలుగజేసేలా మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి సరిగ్గా చూడు అని చెబుతుంది. కావాలంటే నువ్వే చూడు అని కూడా వెన్నెల చెబుతుంది. నిజంగానే అది ఆ ఆత్రేయపురం నుంచి వైజాగ్ వెళ్లే టికెట్ అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ట్విస్ట్ ఇచ్చిన గోవిందరాజులు
ఇక జ్ఞానాంబ.. మల్లిక వైపు కోపంగా చూసి.. నీతో కొంచెం పని ఉంది ఒకసారి వంట గదిలోకి రా అని అంటుంది. ఇక మల్లిక పరిస్థితి చూసి ఇంట్లో సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతారు. అంతా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అని గోవిందరాజులు ముందుగానే టికెట్ ను మార్చి ఇస్తాడు. మల్లికకు కూడా ఆ విషయాన్ని చెబుతాడు. హైదరాబాద్ టికెట్ తో పాటు వైజాగ్ కు టికెట్ కూడా తీసుకున్నాను అని చెప్పడంతో మల్లికా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయినప్పటికీ మల్లికా ఏమాత్రం తగ్గకుండా ఎలాగైనా వారిని హైదరాబాద్ వెళ్లకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది

సీరియల్ చూసి మల్లిక కన్నింగ్ ఐడియా
తనకు ఎంతో ఇష్టమైన సీరియల్ ఈ మధ్యకాలంలో చూడడం మర్చిపోయాను అంటూ మల్లిక అన్నీ మర్చిపోయి టీవీ ముందు కూర్చుని ఉంటుంది. అయితే ఆ సీరియల్ లో అత్తపై పగ తీర్చుకోవడానికి కోడలు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన మాత్రలు ఇవ్వకుండా మరొక మాత్రలు ఇవ్వడం తో అత్త సృహ కోల్పోయి మంచాన పడుతుంది. ఇక అదే తరహాలో మా అత్తగారి పై కూడా అలాంటి ప్రయోగమే చేయాలని మల్లిక ప్లాన్ చేస్తుంది. రోజూ వేసుకోవాల్సిన టాబ్లెట్లకు సంబంధించిన బాక్స్ లో వేరే టాబ్లెట్స్ పెడుతుంది. ఇక అప్పుడే గదిలోకి జ్ఞానాంబ రావడంతో మల్లిక వెళ్లి తలుపు వెనక దాక్కుంటుంది. అనంతరం జ్ఞానాంబ అటువైపు తిరగడంతో అక్కడినుంచి ఆమె మెల్లగా జారుకుంటుంది.

నిజంగానే ఆ మాత్రలు వేసుకుంటుందా?
జ్ఞానాంబ ఆరోగ్యం బాగోలేకపోతే తప్పకుండా జానకి రామచంద్ర హైదరాబాద్ వెళ్లే ప్రోగ్రాం క్యాన్సల్ అవుతుంది అని మల్లికా ఆ విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక మరోవైపు జానకి భర్త గెలిచి వస్తే షీల్డ్ ను ఇంట్లో ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తుంది. భర్త విజయంపై జానకి చాలా నమ్మకంతో ఉంటుంది. మరి ఈ తరుణంలో జ్ఞానాంబ నిజంగానే ఆ మాత్రలు వేసుకుని అనారోగ్యానికి గురి అవుతుందా? జానకి రామచంద్ర హైదరాబాద్ ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











