Janaki Kalaganaledu May 5th: జానకి చదువు కోసం అప్పుల బాటలో రామ.. మరో నిజం చెప్పిన మల్లిక!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్న జానకి తన అత్తగారి ఇంట్లో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటోంది అనే పాయింట్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. సీనియర్ నటి రాశి.. జ్ఞానాంబ అనే అత్త పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే జానకి చదువుకోవడం ఆమె అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. అయినప్పటికీ ఆమె కొడుకు భార్యకు మద్దతు ఇస్తాడు. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 294 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

రామచంద్రకు జరిగిన అవమానంతో..

రామచంద్రకు జరిగిన అవమానంతో..

అత్తగారి ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండాలి అనుకున్నా జానకి ఊహించని పరిణామాలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఎవరికీ తెలియకుండా చదువును కూడా పూర్తి చేయాలి అని తన భర్త కోరిక మేరకు జానకి ఎంత కష్ట పడుతూ ఐపీఎస్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఆమెకు తన తోడి కోడలు మల్లిక నుంచి కూడా ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి దానికి తోడు అత్తగారు మనసులో కూడా జానకి పై మరింత ద్వేషం పెరుగుతూ ఉంటుంది. అత్తగారికి ఎంత దగ్గరవ్వాలని చూసినా కూడా జానకి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు. జానకి అన్నయ్య యోగి రామచంద్ర చదువుకో లేని వాడు అని ఎంతగానో అవమానించాడు అని తల్లి జ్ఞానాంబ కూడా మనోవేదనతో చెందుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ అవమానం జరగడానికి కారణం జానకి అని ఆమెపై కోపాన్ని చూపిస్తూ ఉంటుంది.

మల్లికపై విష్ణు కోపం

మల్లికపై విష్ణు కోపం


ఇక జానకి పై జ్ఞానాంబ కు ఉన్న ఉన్న కోపాన్ని మరింత పెద్దది చేయాలని మల్లిక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఇంట్లో పనులు చేయవద్దు అని జానకి చెప్పినప్పటికీ అదేపనిగా మళ్లీ చేస్తుంది అని మల్లిక చెబుతోంది. అంతేకాకుండా మీ గురించి తప్పుగా మాట్లాడింది అని కూడా మల్లిక నిందలు వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జ్ఞానాంబ మరొకసారి జానకి పై ద్వేషాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇంట్లో నిన్ను కేవలం నా కొడుకు సంతోషం కోసం మాత్రమే ఉంచాలని అనుకుంటున్నాను అంటుంది. అయితే ఇంట్లో కోడలిగా తన బాధ్యతను నిర్వర్తించే అవకాశాన్ని మరొకసారి ఇవ్వాలి అని జానకి ఎంత బ్రతిమాలినా ఇప్పటికీ కూడా జ్ఞానం మాత్రం జరగదు. ఇక మరోవైపు జ్ఞానాంబ పెట్టాలనుకునే కొత్త స్వీట్ షాప్ కూడా మనకే దక్కాలని మల్లిక ప్లాన్ చేస్తుంది. ఆ విషయంలో ఆమె భర్త విష్ణు మల్లికపై కొప్పాడతాడు. అయినా కూడా ఆమె ఆ విషయాన్ని పట్టించుకోదు.

భర్తను బాధ పెట్టకూడదని..

భర్తను బాధ పెట్టకూడదని..

ఇక జానకి జ్ఞానాంబ ఇద్దరూ కూడా సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉండటం చూసిన రామచంద్ర దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. అయితే ఆ క్రమంలో జ్ఞానాంబ ఏమీ లేదు అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత జానకి కూడా అదే తరహాలో సమాధానం చెప్పి లోపలికి వెళ్లి పోతుంది. జరిగిన విషయాలు భర్తకు చెప్పి మళ్ళీ అతన్ని కూడా బాధ పెట్టకూడదు అని మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె దగ్గరకు వచ్చిన రామచంద్ర మా అమ్మగారు నన్ను ఎవరైనా ఒక్క మాట అన్న కూడా వారిని ఏమాత్రం క్షమించను కానీ మీ మంచితనం గురించి తెలుసు కాబట్టి మీ అన్నయ్య ఎన్ని మాటలు అన్నా కూడా నీతో ఇంకా మంచిగానే ఉంటున్నారని అంటాడు. ఇక జానకి కూడా ఆ విషయంలో జ్ఞానాంబ కోపం గురించి ఎలాంటి నిజాలు చెప్పకుండా అవును నిజమే అంటూ సమాధానం ఇస్తుంది.

అప్పు కోసం రామచంద్ర ప్రయత్నం

అప్పు కోసం రామచంద్ర ప్రయత్నం

ఇక ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా రామచంద్ర జానకి చదువు కోసం కూడా ఆలోచిస్తాడు. ఆమె కోసం లక్ష రూపాయల ఫీజు కూడా కట్టాలి అని నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఆ పరిస్థితిలో అతనికి ఎవరు కూడా లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకు రారు. ఎవరిని అడిగినా కూడా మీకు డబ్బు అవసరం ఏమిటి అంటూ వడ్డీలు లేకుండా చాలా మందికి ఇస్తూ ఉంటారు అని అంటారు. అలాగే పెద్ద స్వీట్ షాప్ కూడా ఉంది కదా ఆ బిజినెస్ బాగానే నడుస్తుంది కదా అని అంటూ ఉంటారు.

కొడుకు బాధను చూసిన జ్ఞానాంబ

కొడుకు బాధను చూసిన జ్ఞానాంబ


జానకి చదువు కోసం డబ్బులు తీసుకున్నాను అని తెలిస్తే అమ్మ ఏ మాత్రం ఒప్పుకోలేదు అని రామచంద్ర ఎవరితోనో అసలు విషయాన్ని చెప్పడు. ఇక డబ్బులు తీసుకుంటే తప్పకుండా ఎవరో ఒకరు తన తల్లికి చెప్పే అవకాశం ఉంది అని జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక ఆ క్రమంలో అతను భోజనం కూడా సరిగ్గా చేయడు. అయితే రామ ఎదో ఆందోళనలో ఉన్నాడు అని తల్లి జ్ఞానాంబ అనుకుంటూ ఉంటుంది. జరిగిన గొడవల కారణంగా బహుశా రామచంద్ర ఇంకా అదే బాధలో ఉండి ఉంటాడు అని అతన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయాన్ని పట్టించుకోవద్దు అని అంటుంది. దీంతో రామచంద్ర అలాంటిదేమీ లేదు అని షాప్ గురించి కాస్త తొందరగా వెళ్ళాలి అనే ఆందోళనలో అలా భోజనం చేయలేదు అని చెబుతాడు.

అనుమానం వచ్చేలా.. మల్లిక మాట!

అనుమానం వచ్చేలా.. మల్లిక మాట!

ఇక రామచంద్ర పరిస్థితి అలా కావడంతో జ్ఞానాంబ మరొకసారి జానకి పైన ద్వేషాన్ని చూపిస్తుంది. నువ్వు నా కొడుకు జీవితంలోకి రాకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు అని ఆమె చెబుతుంది. దీంతో జానకి మరింత ఆవేదన చెందుతుంది. ఆ తరువాత రామచంద్ర గురించి మల్లిక ఇంట్లో మరొక విషయాన్ని బయట పెడుతుంది. బావగారు ఈరోజు ఒక ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర కనిపించారు అని దేని కోసమైనా డబ్బు తీసుకుని ఉండవచ్చు లేదంటే కొత్తగా అక్కడ ఏమైనా వ్యాపారం చేస్తూ ఉండవచ్చు అని అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఏ విధంగా మాట్లాడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X