Janaki Kalaganaledu May 6th: జానకి కోసం ఇబ్బందుల్లో పడిన రామ.. రంగంలోకి పాత శత్రువు!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచుకుంటోంది. ఐపీఎస్ అవ్వాలని జానకి తన అత్తగారి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా తన చదువును కోనసాగిస్తుంది. అసలు చదువుకున్న కోడలు అంటేనే ఇష్టపడని జ్ఞానాంబ నుంచి జానకి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటోంది అనే పాయింట్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. సీనియర్ నటి రాశి.. జ్ఞానాంబ అనే అత్త పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక జానకి చదువు కోసం భార్యకు రామచంద్ర మద్దతు ఇస్తాడు. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 295 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జానకి ఆవేదన
జానకి అన్నయ్య యోగి కారణంగా రామచంద్ర తీవ్ర మనోవేదన తో బాధపడుతూ ఉంటాడు అని జ్ఞానాంబ పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బారసాల రోజు కావాలని రామచంద్ర చదువు లేని వ్యక్తి అని అవమాన పరిచారు అని జానకి నా కొడుకు జీవితం లోకి రాకపోయి ఉంటే వాడి జీవితం ఇలా అయ్యి ఉండేది కాదు అని జ్ఞానాంబ ఆవేదన చెందుతూ ఉంటుంది. అదే విషయాన్ని చెబుతూ ఇదంతా నీ వల్లే జరిగింది అని నా కొడుకు ఎంతో బాధలో ఉన్నాడు అని అంటుంది. ఆ మాటలకు జానకి కూడా ఏమీ అనలేని పరిస్థితిలో బాధపడుతూ ఉంటుంది.

జానకి చదువు కోసం అప్పు..
ఇక మరోవైపు రామచంద్ర జానకి చదువు కోసమే అప్పు చేయడానికి సిద్ధం అవుతాడు. ఆమెను ఎలాగైనా ఐపీఎస్ చదివించాలని రామచంద్ర కోచింగ్ సెంటర్ కోసం లక్ష రూపాయలు కట్టాలి అని అనుకుంటాడు. ఇక జానకి వద్దని చెప్పినప్పటికీ రామచంద్ర ఎంతమాత్రం జానకి మాటలను పట్టించుకోకుండా రెండు మూడు రోజుల్లో డబ్బులు ఇస్తాను అని అంటాడు. అయితే ఎవరిని డబ్బులు అడిగినా కూడా తల్లి జ్ఞానాంబ పేరు ఎత్తుతూ ఉండడంతో రామచంద్ర కంగారు పడుతూ ఉంటాడు. అయినా మీకు డబ్బు ఎందుకు అని చాలా ఆస్తిపరులు అని మీ స్వీట్ షాప్ కూడా బ్రహ్మాండంగా నడుస్తోంది కదా అని అడుగుతూ ఉంటారు.

మల్లిక కంటపడిన రామచంద్ర
ఇక చేసేదేమీలేక రామచంద్ర ఒక ఫైనాన్స్ ఆఫీస్ కి వెళ్తాడు. అయితే అప్పుడు అక్కడే జ్ఞానాంబ చిన్న కోడలు భర్తతో కలిసి షాపింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అటువైపుగా వచ్చిన రామచంద్రని చూసిన ఆమె ఇక్కడికి బావగారు ఎందుకు వచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే రామచంద్ర అక్కడ ఉన్న ఒక ఫైనాన్స్ ఆఫీస్ కు వెళుతూ ఉండడంతో ఆమె ఒక్క సారిగా షాక్ అవుతుంది. అసలు మీ అన్నగారు ఈ ఫైనాన్స్ ఆఫీస్ కి ఎందుకు వచ్చి ఉంటారు అని విష్ణుని అడుగుతూ ఉంటుంది. అతను తనకి ఏమీ తెలియదు అని చెబుతాడు. ఏదైనా వ్యాపారం వడ్డీ వ్యాపారం కోసం ఫైనాన్స్ ఆఫీస్ లోకి వెళ్లి ఉండవచ్చు అంతేకాకుండా అప్పు కోసం వచ్చి ఉండవచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంట్లో ఆ నిజం తెలిసేలా..
ఇక రామచంద్ర అక్కడినుంచి వెళ్ళిపోతుండగా వెంటనే ఆ విషయాన్ని తన అత్తగారికి చెప్పాలని అనుకుంటుంది. అయితే ఇంటికి రాగానే మల్లిక డైరెక్ట్ గా ఆ విషయాన్ని చెప్పకుండా భర్త ఏదో చెబుతున్నట్టు గట్టిగా అరుస్తూ ఉంటుంది. మీ అన్నయ్య గారు ఫైనాన్స్ ఆఫీస్ కు ఎందుకు వెళ్లాలి అని మీరు అడగాలి అని అనుకుంటున్నారు కదా అంటూ అందరికీ వినిపించేలా మాట్లాడుతుంది. కానీ విష్ణు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఆ విషయాన్ని ఇంట్లో తీయవద్దు అని బ్రతిమాలతాడు. అయినప్పటికీ కూడా మల్లిక ఆ విషయాన్ని ఎలాగైనా జ్ఞానాంబ తెలిసేలా అనాలని డిసైడ్ అవుతుంది. ఇక అత్తగారు రాగానే కావాలని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటున్న మల్లికను వెంటనే జ్ఞానాంబ పిలుస్తుంది.

మరోసారి మల్లిక అనుమానాలు
దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని ఆమె అడిగే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మల్లిక బావగారు ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర కనిపించారు అని అక్కడ వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు అని బహుశా వడ్డీ వ్యాపారం కోసం అక్కడికి వెళ్లి ఉండవచ్చు అని లేదంటే అప్పు కోసమైనా వెళ్లి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇక మల్లిక మాటలు విన్న జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇక అదే సమయంలో ఇంట్లోకి రామచంద్ర కూడా వస్తాడు ఆ విషయం గురించి అడగగా అతను నిజమే అని చెబుతాడు. అయితే ఈ ఇంట్లో ఉన్న ప్రతి రూపాయి కూడా నీ కష్టమే.. నువ్వు బయటికి వెళ్లి అప్పు అడగడం ఏమిటి అని జ్ఞానాంబ ప్రశ్నిస్తుంది. అందుకు రామచంద్ర అ సమయంలో ఏం చెప్పాలో తెలియక ఒక ఫ్రెండ్ మాట సాయం చేయడం కోసం అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అని అంటాడు. అయితే ఆ మాటలు తల్లి జ్ఞానాంబ నమ్ముతుంది ఇక ఆ తర్వాత రామచంద్ర సైలెంట్గా తన గదిలోకి వెళ్ళి పోతాడు.

రంగంలోకి రామచంద్ర శత్రువు
ఇక జానకి వచ్చి తన కోసం ఇబ్బంది పడవద్దని అంటుంది. అయినప్పటికీ రామచంద్ర ఆ విషయాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోవద్దు అని ముందు చదువుపై శ్రద్ధ పెట్టండి అంటూ డబ్బు విషయం తనకు వదిలేయాలి అని అంటాడు. ఇక రామచంద్ర ఒక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకోవడానికి వెళతాడు. అయితే అతను కొన్ని డాక్యుమెంట్స్ పై సంతకాలు కూడా పెట్టించుకుంటాడు. చదువుకోలేని రామచంద్ర వాటిపై సంతకాలు పెడతాడు. ఆ తర్వాత రంగంలోకి రామచంద్ర శత్రువు కన్నబాబు కూడా ఎంట్రీ ఇస్తాడు. వాటితోనే అతను పగ తీర్చుకోవాలి అని అనుకుంటాడు. ఇక మరో వైపు జానకి అర్ధరాత్రి రామచంద్ర తో కలిసి కోచింగ్ సెంటర్ కు వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో తన కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ ఉదయాన్నే జ్ఞానాంబ పడుతుంది. కష్టం చేసి వచ్చే కొడుకును పడుకోనివ్వకుండా అలా ఎందుకు తిప్పుతున్నావు అని అంటుంది. మరి ఈ తరుణంలో జానకి చదువును ఎలా ముందుకు సాగిస్తుంది అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











