Janaki Kalaganaledu May 9th: అర్ధరాత్రి అలా దొరికిపోయిన జానకి రామచంద్ర.. జ్ఞానాంబ వార్నింగ్

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ అవ్వడానికి జానకి తన అత్తగారి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా తన చదువును కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది. కానీ చదువుకున్న కోడలు అంటేనే ఇష్టపడని జ్ఞానాంబ జానకి విషయంలో పరిణామాలను ఎదుర్కొంటోంది అనే పాయింట్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక జానకి చదువు కోసం భార్యకు రామచంద్ర మద్దతుగా ఉంటాడు. ఇక ఈ సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 8.01 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 296వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

 కన్నబాబు రివెంజ్

కన్నబాబు రివెంజ్

జానకి చదువుకోసం రామచంద్ర అప్పు చేసేందుకు మరొక అడుగు ముందుకు వేశాడు. ఆమె కోచింగ్ సెంటర్ కు లక్ష రూపాయలు అవసరం కావడంతో ఎలాగైనా డబ్బులు సమకూర్చాలి అని తెలిసిన వాళ్ళు అడుగుతాడు. కానీ ఎవరు కూడా జ్ఞానాంబ కు తెలియకుండా ఇవ్వడానికి ఇష్టపడరు. దీంతో తల్లికి ఏమాత్రం తెలియకూడదు అని రామచంద్ర డబ్బులు అప్పుగా తీసుకోవాలని అనుకుంటాడు. చివరికి ఒక వ్యక్తి ఇవ్వడానికి రెడీ అంటాడు. కానీ అతని వెనుక రామచంద్ర శత్రువు కన్నబాబు ఉంటాడు. రామచంద్ర కు చదువు రాదు కాబట్టి అతనితో కొన్ని కాగితాల పై సంతకాలు కూడా పెట్టించుకుంటారు.ఎలాగైనా అతనిపై పగ తీర్చుకోవాలని కన్నబాబు పన్నాగం పన్నుతాడు.

దొరికిపోయిన జానకి రామ

దొరికిపోయిన జానకి రామ

ఇక మరోవైపు మల్లిక ఎలాగైనా స్వీట్ షాప్ అధికారాన్ని తన చేతి లోకి రప్పించుకోవాలని అని ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. అయితే ఈ తరుణంలో మరొకసారి జ్ఞానాంబ అలాగే కొడుకు కోడలికి కూడా మధ్యలో గొడవలు సృష్టించాలని కూడా అనుకుంటుంది. అందుకోసం జానకి పై నిందలు వేయాలి అని ఆలోచిస్తుంది. ఇక జానకి రామ చంద్ర ఇద్దరు కూడా అర్ధరాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లిపోతున్నారు అని మల్లికా తన అత్తగారికి చెబుతుంది. మొదట ఆ విషయం నమ్మని జ్ఞానాంబ చివరికి రామచంద్ర జానకిని ఇద్దరిని కూడా గుమ్మం దగ్గర చూసేసరికి ఆశ్చర్యపోతుంది. ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లి వస్తున్నారు అని అడుగుతుంది. అయితే ఏమి చెప్పాలో తెలియక రామచంద్ర స్వీట్ షాప్ కి వెళ్లి వస్తున్నాము అని అబద్ధం చెబుతాడు. అక్కడ కొన్ని లెక్కలలో అనుమానాలు ఉండటంతో అందుకోసం జానకిని తీసుకు వెళ్ళవలసి వచ్చింది అని రామచంద్ర చెప్పడంతో ఆ మాటలను తల్లి జ్ఞానాంబ నమ్ముతుంది.

జ్ఞానాంబ హెచ్చరిక

జ్ఞానాంబ హెచ్చరిక

ఇక ఆ సమయంలో కొడుకును ఏమీ అనకూడదు అనే జ్ఞానాంబ మల్లికను బెదిరిస్తుంది. నా కొడుకు పై అనవసరంగా లేనిపోని నిందలు వేయకూడదు అని ఆమె హెచ్చరిస్తుంది. ఇక ఆ తర్వాత ఉదయమే జానకి దగ్గరికి వెళ్లిన జ్ఞానాంబ అసలు విషయం గురించి అడుగుతుంది. అసలు అంత అర్థరాత్రి మీరు ఎక్కడికి వెళ్లారు? దేని కోసం వెళ్లారు అని జ్ఞానాంబ మరొకసారి జానకిని అడుగుతుంది. రామచంద్ర రాత్రి చెప్పింది మొత్తం అబద్ధమే అని మీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లారు అని నాకు అనిపిస్తోంది అని జ్ఞానాంబ అంటుంది. చదువుకున్న అమ్మాయివి కదా సరదాలు తీర్చుకోవడానికి అర్ధరాత్రులు రామచంద్రను తీసుకువెళితే అతని ఆరోగ్యం ఏం కావాలి అని ఉదయం మొత్తం షాపులో కష్టపడే రామచంద్ర రాత్రి కనీసం ప్రశాంతంగా పడుకుని భవాని ఇలా చేస్తే అతని ఆరోగ్యం ఏమవుతుందో అనే జ్ఞానం కూడా లేదా అని జ్ఞానాంబ హెచ్చరిస్తుంది.

నేను ఏమాత్రం ఒప్పుకోను..

నేను ఏమాత్రం ఒప్పుకోను..


మరొకసారి ఇలాంటివి జరిగితే నేను ఏమాత్రం ఒప్పుకోను అని నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా భర్త ఆరోగ్యం బాగుండాలని కోరికతో ఉన్నా అతన్ని ఇలా అర్ధరాత్రి తిప్పకూడదు అని జ్ఞానాంబ మరొకసారి సీరియస్ గా చెబుతుంది. ఇక అత్త గారి మాటలు విన్న జానకి ఒకసారి ఆలోచనలో పడుతుంది. వెంటనే తన భర్త దగ్గరకు వెళ్లి ఇక నుంచి అర్ధరాత్రి నేను ఒక్కదాన్నే కోచింగ్ సెంటర్ కి వెళ్తాను అని చెబుతుంది.

జానకి కండిషన్

జానకి కండిషన్

అలా ఎందుకు అని రామచంద్ర అడిగినప్పటికీ కూడా ఆమె అసలు నిజం చెప్పదు. అయితే అందుకు రామచంద్ర ఏమాత్రం ఒప్పుకోడు. నాకు కష్టపడటం చిన్నప్పటి నుండి అలవాటు అని అంటాడు. అయితే ఉదయం నేను నేను స్వీట్ షాప్ లో రెండు గంటలు పని చేస్తాను అప్పుడు మీరు రెండు గంటల పాటు రెస్ట్ తీసుకోవాలి అని జానకి కండిషన్ పెడుతుంది. అందుకు రామచంద్ర గూడ ఒప్పుకుంటాడు.

మాతృ దినోత్సవ సందర్భంగా..

మాతృ దినోత్సవ సందర్భంగా..


ఇక మాతృ దినోత్సవ సందర్భంగా రామచంద్ర తన తల్లికి ఒక ప్రత్యేకమైన విషెస్ అందించాలని అనుకుంటాడు. మరి ఈ పరిణామాలతో జానకి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. అలాగే కన్నబాబు కూడా రామచంద్రపై ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మల్లిక కూడా తొడి కోడలు జానకి పై పగ తీర్చుకోవాలని ఆలోచిస్తుంది. ఇక జానకి ఐపీఎస్ చదువును ఎలా పూర్తి చేస్తుంది? అసలు జానకి ఐపీఎస్ అవ్వడానికి జ్ఞానాంబ ఒప్పుకుంటుందా? అనే అంశాలు తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్స్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X