twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu November 11th: పాముకి పాలు పోసి పెంచాను.. జానకి పై జ్ఞానాంబ కోపం!

    |

    జానకి కలగనలేదు సీరియల్ ఎమోషనల్ ట్విస్ట్ లతో ఆసక్తిగా కొనసాగుతోంది. జానకి చిన్న మరిది అఖిల్ మాధురిపై హత్యాయత్నం చేయడంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఇక కుటుంబంలో విబేధాలు రావడంతో పరిస్థితులు మారిపోతుంటాయి. జానకి భర్త రామ కూడా జానకి మాటలను పూర్తిగా నమ్మడు. మరోవైపు అత్త జ్ఞానాంబ కూడా బాధలో ఉంటుంది. మల్లిక నుంచి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా ఈ విషయంలో అందరికి అర్థమయ్యేలా చెబుతుంది అనే పాయింట్ ఆసక్తిగా మారింది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 430 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    బాధ్యతగా ఆలోచించాలి

    బాధ్యతగా ఆలోచించాలి

    అఖిల్ మాధురి అనే అమ్మాయి పై హత్యాయత్నం చేసినట్లు జానకి చూడడంతో అతనిపై కేసు పెడుతుంది. సొంతమరిది అయినప్పటికీ కూడా ఒక అమ్మాయికి న్యాయం చేయాలి అనే ఆలోచనతోనే జానకి ఏమాత్రం ఆలోచించకుండా అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అయితే జానకి తీసుకున్న నిర్ణయంపై వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా విభేదిస్తారు. ముఖ్యంగా జానకి భర్త రామచంద్ర కూడా జానకి నిర్ణయంపై ఎంతగానో ఆలోచిస్తాడు. మీరు చూసిన దాంట్లో ఎంతవరకు నిజముంది అని కూడా ప్రశ్నిస్తాడు. అంతేకాకుండా మీరు చూసిన దాంట్లో పూర్తి స్థాయిలో నిజం లేకపోవచ్చు అని అలాగే ఒక ఇంటి కోడలిగా కూడా మీరు బాధ్యతగా ఆలోచించాలి అని రామచంద్ర బ్రతిమాలతాడు.

    బాధలో జానకి ఫ్యామిలీ

    బాధలో జానకి ఫ్యామిలీ

    వెంటనే అఖిల్ పై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని ఎఫ్ఐఆర్ నమోదైతే అతని భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అని అంటాడు. అయితే అఖిల్ గురించి ఆలోచించి నేను ఒక అమ్మాయికి అన్యాయం చేయలేను అని జానకి గట్టిగా సమాధానం చెప్పడంతో రామచంద్ర తీవ్ర అసహనంతో ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లి జ్ఞానాంబ, కొడుకు అఖిల్ జైల్లో ఉండడం తట్టుకోలేక పోతుంది. ఏమీ తినకపోవడంతో ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్లు అవుతుంది.

    కేసు వెనక్కి తీసుకోవాలి

    కేసు వెనక్కి తీసుకోవాలి

    ఇక రామచంద్ర వెంటనే మరోసారి జానకి దగ్గరికి వెళ్లి మాట్లాడాలని అనుకుంటాడు. మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అసలు మీరు చూసిన దాంట్లో పూర్తి స్థాయిలో నిజం లేదు అని అయినా మీరు ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు అయితే దానికి ఇలాంటి నిర్ణయం సరైనది కాదు అనిపిస్తుంది అని రామచంద్ర అంటాడు. దీని గురించి మనం తర్వాత ఆలోచిద్దాము అని ముందుగా మీరు కేసు వెనక్కి తీసుకోవాలి అని అంటాడు. అయితే జానకి కూడా మరోసారి అదేవిధంగా సమాధానం చెబుతుంది. నేను కేసును వెనక్కి తీసుకోలేను అంటుంది.

    మరింత కోపంగా

    మరింత కోపంగా

    ఇక రామచంద్ర మరింత కోపంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాడు. జానకిని చేయి పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లాలని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం మధ్యలోనే ఆగిపోయి చేయి వదలండి రామ గారు అని సీరియస్ గా సమాధానం చెబుతుంది. అయితే అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా మరింత బాధతో కనిపిస్తారు. ముఖ్యంగా మల్లిక అదే అవకాశం గా తీసుకుని జానకి పై నిందలు వేయాలని అనుకుంటుంది. ఇంటికి పెద్ద కోడలిగా బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరిని బాధపెడుతోంది అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గానే ఆలోచించడం ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అంటుంది.

    పాముకి పాలు పోసి పెంచినట్లు

    పాముకి పాలు పోసి పెంచినట్లు

    అంతేకాకుండా జ్ఞానాంబ కూడా ఒకప్పుడు నేను చదువుకోవద్దు అని చెప్పాను కానీ నువ్వు కోడలిగా కూడా ఇంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అందరినీ సంతోషంగా ఉంచుతాను అని మాట ఇచ్చావు. కానీ ఇప్పుడు నేను తప్పు చేశాను అనిపిస్తోంది. పాముకి పాలు పోసి పెంచినట్లు అయ్యింది అని జ్ఞానాంబ మాట్లాడడంతో జానకి మరోసారి షాక్ అవుతుంది. అయితే రామచంద్ర కూడా అదే తరహాలో మాట్లాడుతాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని నేను చదివించాను అప్పుడు కూడా మీరు కొన్ని అబద్ధాలు చెప్పారు. ఈ ఒక్కసారికి మీ ధర్మాన్ని పక్కన పెట్టండి అని అంటాడు.

    కోర్టులో తేల్చుకోవాలి

    కోర్టులో తేల్చుకోవాలి

    అయినప్పటికీ జానకి వినకపోవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అని అఖిల్ ను విడిపిస్తాను అని రామ అంటాడు. ఇక రామతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అఖిల్ చూడాలని అనుకుంటారు. ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్లగానే అప్పటికే ఎఫ్ఐర్ నమోదైంది అని ఏదైనా సరే కోర్టులో తేల్చుకోవాలి అని పోలీసులు చెబుతారు.

    జానకి, మల్లిక సవాల్

    జానకి, మల్లిక సవాల్

    ఇక అఖిల్ అక్కడ ఎంతో బాధగా కనిపిస్తాడు. అసలు నేను ఏ తప్పు చేయలేదు అని ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేంత చెడ్డవాడిని కాదు అని అఖిల్ అబద్ధాలు చెబుతాడు. ఇక దాన్ని చూసి జ్ఞానాంబ కుటుంబ సభ్యులు కూడా నమ్మేస్తారు. మరోవైపు మల్లిక జానకి పై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. అయితే జానకి మాత్రం మల్లికకు అవకాశం ఇవ్వకుండా మీ దొంగ ప్రెగ్నెన్సీ విషయం గురించి తర్వాత ఆలోచిస్తాను అని ముందు ఈ సమస్య పూర్తవ్వని చెబుతాను అని సవాల్ విసిరుతుంది. మరి ఈ పరిస్థితులను జానకి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 430:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X