For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 16th: మైరావతికి జానకి డబుల్ కౌంటర్.. రేపే అసలు పరీక్ష!

  |

  జానకి కలగనలేదు సీరియల్ సరికొత్త మలుపులతో ప్రేక్షకుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. ఐపీఎస్ కావాలని కలలు కన్న జానకి కట్టుబాట్ల మధ్యలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొని తన కలను నెరవేర్చుకుంది అనేది ఈ సీరియల్ లో మెయిన్ పాయింట్. భర్త సహాయంతో అయినా ఐపీఎస్ అవ్వాలని అనుకుంటుంది. చదువు కోసం కోచింగ్ కు కూడా సిద్ధమవుతుంది. కానీ అత్త జ్ఞానాంబకు చదువుకున్న కోడలు అంటే అస్సలు ఇష్టం ఉండదు.

  అలంటి పరిస్థితులలో కోడలు ఎలా తన కలను నెరవేర్చుకుంది అనే పాయింట్ తో సీరియల్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. సీరియల్ మొదటి 50 ఎపిసోడ్స్ వరకు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. రామ జానకి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 172వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

  అత్తగారి సలహా

  అత్తగారి సలహా

  చదువుకున్న అమ్మాయి కోడలిగా వస్తే సరిగ్గా సంసారం చేయదు అని అపోహలతో జ్ఞానాంబ గత చేదు అనుభవాలు గుర్తు చేసుకొని తన కొడుకు కోసం చదువుకోలేని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటోంది. ఇక జానకి కేవలం 5 వ తరగతి మాత్రమే చదువుకుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడంతో పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ హఠాత్తుగా జానకి డిగ్రీ చదువుకున్న నిజం తెలియడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇక జానకి మంచి అమ్మాయి అని ఆ విషయంలో జ్ఞానాంబ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక వారి అత్తగారి సలహా తీసుకోవాలని అనుకుంటుంది.

  ఎలాంటి పరీక్షలు పెట్టినా..

  ఎలాంటి పరీక్షలు పెట్టినా..

  జ్ఞానాంబ అత్తగారు మైరవతి ఇంటికి వెళ్లడానికి జానకి సిద్ధమవుతోంది. ఆ క్రమంలో లో జానకిని చూసిన మైరావతి మొదట చాలా కోపంతోనే చూస్తుంది. జరిగిన విషయం మొత్తం జ్ఞానాంబ ముందుగానే మైరావతికి చెబుతుంది.. ఇక జానకి చదువుకున్న పొగరును భర్తపై ఎప్పుడైనా చూపిస్తుందా లేదా అనే విధంగా మైరావతి పరీక్షలు కూడా పెడుతుంది. అత్తగారి అత్తగారు ఎలాంటి పరీక్ష పెట్టినా కూడా జానకి ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సమాధానం చెబుతూ అందరిచేత మంచి గుర్తింపు ఉంటుంది.

  మరో ప్లాన్ వేసిన మైరావతి

  మరో ప్లాన్ వేసిన మైరావతి

  జానకి తప్పకుండా మంచి కోడలిగా నిరూపించుకుంది అని మామ గోవిందరాజులు కూడా ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక కొత్తగా వచ్చిన జంట చేతులమీదుగా ఊర్లో వాళ్లకి కొత్త బట్టలు పెట్టించాలని మైరావతి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక అందులోనే ఆమె ఒక ప్లాన్ కూడా వేస్తుంది. ఒక మహిళ చేత జానకి చదువుకున్న అహంకారాన్ని బయటకు తీయాలని అనుకుంటుంది. మీరు చదువుకున్న అమ్మాయి కదా ఇలాంటి చదువుకోలేని అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అని అనేక రకాల ప్రశ్నలు అడుగుతుంది.

   నా భర్త శ్రీరామచంద్రుడు

  నా భర్త శ్రీరామచంద్రుడు

  ఇక ఆ మహిళ అడిగిన ప్రశ్నలకు దానికి చాలా తెలివిగా సమాధానం ఇస్తుంది. తన భర్త శ్రీరామచంద్రుడి లాంటివాడు అంటూ అతను చదువు లేకపోయినప్పటికీ సంస్కారం మాత్రం మంచు కొండ అని, అర్థం చేసుకునే భర్త ఉంటే అంతకంటే గొప్ప అదృష్టం కూడా లేదని జానకి సమాధానం ఇస్తుంది. అంతేకాకుండా తన భర్త అంటే తనకు ఎంతో ఇష్టమని తనను గుండెల్లో పెట్టి చూసుకుంటాడని ఆ విషయంలో తనకు ఎలాంటి అనుమానాలు కూడా లేవని సున్నితంగా సమాధానం ఇవ్వడంతో మైరావతి కూడా ఆమె మాటలకు కొంత ఆనందం వ్యక్తం చేస్తుంది.

  అసలు పరీక్ష ముందుంది..

  అసలు పరీక్ష ముందుంది..

  ఇక అదే సమయంలో గోవిందరాజులు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తాడు. జానకి సమాధానాలకు అందరూ కూడా చాలా సంతోషంగా చప్పట్లు కొడతారు. అయితే ఇంకా కథ అయిపోలేదు అంటూ మైరావతి మరొక కౌంటర్ ఇస్తుంది. ముందు ఇంకా చాలా ఉన్నాయని వాటిని జానకి ఏవిధంగా ఎదుర్కొంతుందో చూద్దామని కూడా చెబుతుంది.

  ఇక దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆనందం గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సమయంలో రామచంద్ర జానకి దగ్గరకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా ఆమెను ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మైరావతి జ్ఞానాంబతో మాట్లాడుతూ.. నీ కోడలు చాలా తెలివిగా ఉందని మంచిదా చేడ్డదా తెలుసుకోవడం చాలా కష్టమని కూడా అంటుంది. కానీ అసలు రంగు ఏమిటో తెలిస్తానని కూడా చెనుతుంది. అసలు జానకి నాటిస్తుందా? లేక భర్తతో నిజంగానే ప్రేమగా ఉంటుందా అనే విషయాన్ని రేపే తెలిస్తానని అంటుంది.

  లక్ష్మీ పూజా కోసం..

  లక్ష్మీ పూజా కోసం..

  ఇక మైరావతి జానకి కోసం ఒక కండిషన్ పెడుతోంది. రామచంద్ర తో కలిసి ఒకేసారి లక్ష్మీదేవికి పూజ చేయాలి అని చెబుతూ సరిగ్గా చెప్పిన సమయానికి పూజ మొదలు పెట్టాలని లేకపోతే పూజ మొత్తం క్యాన్సిల్ అవుతుందని కూడా సమాధానం ఇస్తుంది. మైరావతి మాటలను పక్కనుంచి మల్లిక కూడా వింటుంది. ఎలాగైనా ఈ అవకాశం తో జానకిని ఇబ్బందుల్లో పడేయాలని అనుకుంటుంది. మరి ఆ పరిస్థితిలు ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారో చూడాలి.

  జానకి కలగనలేదు 44వ వారం రేటింగ్

  జానకి కలగనలేదు 44వ వారం రేటింగ్


  జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. నిలకడగా సాగుతున్నది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 43వ వారంలో 8.96 రేటింగ్ రాగా, 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది.

  Recommended Video

  Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
  జానకి కలగనలేదు 44వ వారం రేటింగ్

  జానకి కలగనలేదు 44వ వారం రేటింగ్

  జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. నిలకడగా సాగుతున్నది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 43వ వారంలో 8.96 రేటింగ్ రాగా, 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 172
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X