twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu November 16th: అఖిల్ కేసులో మరో కీలక మలుపు.. జానకి షాకింగ్ నిర్ణయం

    |

    జానకి కలగనలేదు సీరియల్ కథ మరో కీలక మలుపు తిరిగింది. రామచంద్ర తమ్ముడు అఖిల్ తన స్నేహితురాలు మాధురి పై హత్యాయత్నం చేస్తాడు. ఆ ఘటనను జానకి చూస్తుంది. కాలేజీలో అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ మాధురికి కనిపించడంతో ఆమె ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా మీ ఇంట్లో ఈ విషయం చెబుతాను అని కూడా అంటుంది.

    దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న అఖిల్ అనుకోకుండా ఒక కర్ర తీసుకొని కొడతాడు. దాంతో రక్తపు మడుగులో మునిగిపోయిన మాధురిని జానకి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 432 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    మల్లిక రెచ్చగొట్టే మాటలు

    మల్లిక రెచ్చగొట్టే మాటలు

    అయితే అఖిల్ పై కేసు నమోదు చేసిన కారణంగా ఆమె అత్తగారింట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. అసలు అఖిల్ నేను ఎలాంటి తప్పు చేయలేదు అని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. దీంతో జానకీ అతనిపై తప్పుడు కేసు పెట్టింది అనుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్ముతారు. అంతేకాకుండా ఇదే అవకాశం గా తీసుకున్న చిన్న కోడలు మల్లికా జానకిపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.

    అందుకోసం ఆమె లేనిపోనీ కొన్ని అబద్ధాలు చెబుతూ ఉంటుంది. మరింత కోపం వచ్చేలా చేస్తుంది. ఇక అఖిల్ భార్య జెస్సీ దగ్గరికి వెళ్లిన మల్లికా అఖిల్ కు ఈ కేసు విషయంలో ఉరిశిక్ష పడినా పడవచ్చు అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారుని ఆమె చెప్పడంతో జెస్సి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

    రామచంద్ర షాక్

    రామచంద్ర షాక్

    అయితే మల్లిక చెప్పిన మాటలను పక్కనే ఉండి విన్న రామచంద్ర కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆ విషయంలో క్లారిటీగా తెలుసుకోవడానికి లాయర్ గారికి ఫోన్ చేస్తాడు. ఈ కేసు విషయంలో అఖిల్కు ఎలాంటి శిక్ష పడుతుంది అని సందేహాలు అడిగేసరికి అతను హత్య ప్రయత్నం కింద ఆమె చనిపోతే ఉరిశిక్ష పడిన పడవచ్చు అని లేదా జీవిత ఖైదీ శిక్ష కూడా పడవచ్చు అని లాయర్ చెబుతాడు.

    ఏదేమైనా కూడా అతను జైలుకు వెళ్లకుండా ఉండాలి అంటే కంప్లైంట్ ఇచ్చిన జానకి కేసు వెనక్కి తీసుకోవాలి అని, అదొక్కటే దారి అని లాయర్ చెప్పడంతో రామచంద్ర కూడా మరింత సీరియస్ గా ఆలోచిస్తాడు. ఎలాగైనా తన భార్య జానకిని ఈ కేసు విషయంలో ఒప్పించాలి అని సీరియస్ గా ఆమె దగ్గరకు వెళ్తాడు.

    గోవిందరాజులు రిక్వెస్ట్

    గోవిందరాజులు రిక్వెస్ట్

    అయితే రామచంద్ర వెళ్లే కంటే ముందే అతని తండ్రి గోవిందరాజులు కోడలు జానకితో మాట్లాడాలని అనుకుంటాడు. తన భార్య జ్ఞానాంబ కొడుకు పరిస్థితిని చూసి తల్లడిల్లుతోంది అని గతంలో నువ్వు అఖిల్ విషయంలో ఆలోచించిన విధానం కరెక్ట్ కావచ్చు.. కానీ ఇప్పుడు ఇంట్లో మాత్రం పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు.. అందరూ కూడా అఖిల్ కోసమే ఆలోచిస్తున్నారు.

    ఇది ఎటువైపు దారితీస్తుందో అర్థం కావడం లేదు. నా భార్య ఇప్పుడు తన కొడుకును ఇంట్లోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఆమె భర్తగా నేను కోరికను తీర్చాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు ఒకసారి ఆలోచించి కేసు వెనక్కి తీసుకోవాలి అని గోవిందరాజులు చెబుతాడు.

    ఎంతో సపోర్ట్ చేశాను

    ఇక గోవిందరాజులు అలా చెప్పడంతో జానకి మరింత బాధపడుతుంది. అలాగే మరోవైపు రామచంద్రం మరోసారి బెడ్ రూమ్ లోకి వచ్చి జానకిని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయంలో మీరు ఎలాగైనా కేసు వెనక్కి తీసుకోవాలి అని లేదంటే అఖిల్ భవిష్యత్తు నాశనం అవుతుంది అని అంటాడు. అంతేకాకుండా గతంలో మీకోసం నేను ఎన్నో చేశాను.

    మీరు చదువుకుంటాను అంటే మీ నాన్నగారి కోరిక మేరకు మీరు ఐపిఎస్ కావాలి అని నేను ఎంతగానో సపోర్ట్ చేశాను. అంతే కాకుండా ఇంట్లో ఎన్నో అబద్ధాలు చెప్పి మా అమ్మ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ మీరు ఈ ఇంటికి కోడలిగా బాధ్యతగా ఉండడం లేదు.. అని జానకికి సీరియస్ గా చెబుతాడు. దీంతో జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది.

    ఐపీఎస్ చదువుకు అర్థం ఉండదని..

    ఐపీఎస్ చదువుకు అర్థం ఉండదని..

    మొదట కేసు ఎంత మాత్రం వెనక్కి తీసుకోకూడదు అని ఒక ఆడపిల్లకు అన్యాయం చేయకూడదు అని.. కాబోయే పోలీస్ ఆఫీసర్ గా నేను అలాంటి నిర్ణయం తీసుకుంటే నేను చదివిన చదువు అర్థం ఉండదని కూడా జానకి అనుకుంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని జానకి బాధపడుతుంది.

    అంతేకాకుండా ఈ కేసు విషయంలో నా చదువు కారణంగానే ఇంట్లో బాధలు ఏర్పడుతున్నాయి కాబట్టి నేను కేసును వెనక్కి తీసుకుంటాను. అలాగే నా ఎపిఎస్ చదువును కూడా ఇంతటితో వదిలేస్తాను అని జానకి రామచంద్ర తో చెప్పాలని అనుకుంటుంది. అయితే ఆమె మాట్లాడుతున్నప్పుడు రామచంద్ర మాటలు పట్టించుకోకుండా బయటికి వెళ్లిపోతాడు. ఇక తర్వాత జానకి రామచంద్ర తో పాటు పోలీస్ స్టేషన్కు వెళుతుంది. మరి ఆమె కేసు వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 432
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X