Janaki Kalaganaledu November 17th: మరోసారి చిక్కుల్లో పడిన జానకి.. మైరావతి స్ట్రాంగ్ కౌంటర్

జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ కావాలని కలలు కన్న జానకి కట్టుబాట్ల మధ్యలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొని తన కలను నెరవేర్చుకుంది అనేది ఈ సీరియల్ లో హైలెట్ అంశం. భర్త సహాయంతో అయినా ఐపీఎస్ అవ్వాలని అనుకుంటుంది.ఇక జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్ లో కూడా తన సత్తా చాటుతోంది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 43వ వారంలో 8.96 రేటింగ్ రాగా, 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది.

అత్త జ్ఞానాంబకు చదువుకున్న కోడలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలంటి పరిస్థితులలో కోడలు ఎలా తన కలను నెరవేర్చుకుంది అనే పాయింట్ తో సీరియల్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. సీరియల్ మొదటి 50 ఎపిసోడ్స్ వరకు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. రామ జానకి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 173వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

చదువు భయం..

చదువు భయం..

జానకి చదువుకున్న అహంకారాన్ని చుపిస్తే తన కొడుకు జీవితం ఏమవుతుందో అని జ్ఞానాంబ ఎంతో భయంతో ఉంటుంది. ఎందుకంటే గతంలో తన తమ్ముడు కూడా చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఆందోళనలో జ్ఞానాంబ ఉంటుంది.

అందుకే జానకి కూడా జీవితంలో ఎప్పుడైనా చదువుకున్న అధికారాన్ని చూపిస్తే తన కొడుకు కూడా ఏదైనా జరుగుతుందేమో అని తల్లిగా ఆలోచిస్తూ భయపడుతుంది. అయితే జానకి ఆలోచనలు పద్ధతి మాత్రం బాగానే ఉంటాయి కానీ నమ్మలేము అంటూ సందిగ్ధంలో పడింది అందుకే జ్ఞానంబ తన అత్త గారు అయినటువంటి మైరావతి సలహా తీసుకుంటుంది.

ఏ మాత్రం తొందర పడకుండా

ఏ మాత్రం తొందర పడకుండా

ఇక మైరావతి రోజురోజుకు జానకి గురించి తెలుసుకోవడానికి అనేక రకాల ప్రణాళికలు రచిస్తోంది. ఇతరుల సహాయంతో కూడా ఆమె జానకి అహంకారాన్ని కూడా తెలుసుకోవాలి అని అనుకుంటుంది. కానీ జానకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి కోడలిగా అనిపించుకోవాలని తాపత్రయపడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రశ్నించిన కూడా ఏ మాత్రం తొందర పడకుండా నిదానంగా సమాధానం చెబుతూ ఉంటుంది.

మైరావతి పూజ కండిషన్

మైరావతి పూజ కండిషన్

ఇక మైరావతి జానకి గునగణాలు తెలుసుకోవడం తెలివిగా ఒక కండిషన్ పెడుతుంది. రామచంద్ర తో కలిసి ఒకేసారి లక్ష్మీదేవి పూజలో కూర్చోవాలని అని సరిగ్గా చెప్పిన సమయానికి పూజ మొదలు పెట్టాలని లేకపోతే పూజ మొత్తం ఆపేస్తాను అంటూ సమాధానం ఇస్తుంది. ఇక మైరావతి మాటలను పక్కనుంచి మల్లిక కూడా వింటుంది. ఎలాగైనా ఈ అవకాశం తో జానకిని ఇబ్బందుల్లో పడేయాలని అనుకుంటుంది.

ఈ రోజు తేల్చేస్తాను

ఈ రోజు తేల్చేస్తాను

లక్ష్మి పూజ కోసం ఇంట్లో వాళ్ళందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో మైరావతి జ్ఞానాంబ ఒక విషయం చెబుతుంది. నీ కోడలికి నామీద పీకల్లోతు కోపం ఉందని చాలా క్లారిటీగా అర్థం అవుతుంది అని చెప్పడంతో అందుకు జ్ఞానాంబ జానకిని సపోర్ట్ చేస్తుంది. జానకినీ ఇన్ని రోజులుగా చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను అత్తయ్య గారు తను ఏ రోజు కూడా కోపం దాటి అహంకారాన్ని చూడలేదు అని వివరణ ఇవ్వడంతో కోడలిని బాగానే వెనకేసుకు వస్తున్నావని అంటుంది. ఇక భర్త మీద జానకి ఎంత మర్యాద ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో ఈ రోజు తేల్చేస్తాను అని మైరావతి శపథం చేస్తుంది.

జానకి అందోళన

జానకి అందోళన

ఇక పూజకు అందరూ సిద్ధమవ్వగా జానకి మాత్రం ఇంకా రాదు. మైరావతి ఇచ్చిన జాకెట్ వెనకాల నుంచి హుక్స్ పెట్టుకోవడం రాకపోవడంతో జానకి కంగారుపడుతూ గదిలోనే ఉండిపోతుంది. చుట్టుపక్కల ఎవరూ లేరు అని పూజకు సరైన సమయంలో కూర్చోకపోతే అమ్మగారు కొప్పాడతారు అని ఆందోళన చెందుతుంది. ఇక మరోవైపు జానకి సరైన సమయానికి రావడం లేదు అని అందరూ ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరిగింది అని రామచంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
జానకిపై మైరావతి ఆగ్రహం

జానకిపై మైరావతి ఆగ్రహం

సరైన సమయంలో పూజలో కూర్చోవాలని జానకి మల్లికకు ఫోన్ చేసి రప్పించాలని అనుకుంటుంది. కానీ మల్లిక కావాలని ఆ ఫోన్ ఎత్తదు. అంతేకాకుండా రామచంద్ర కూడా ఫోన్ చేస్తుంది. కానీ ఆ సమయంలో మైరావతి ఫోన్ లిఫ్ట్ చేయనివ్వకుండా చేస్తుంది. ఆ ఫోన్ ఎవరు చేశారో నేను చూస్తాను అంటుంది. మొత్తానికి జానకి పూజకు ఆలస్యంగా రావడంతో మైరావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఏదో ఒక విషయంలో నువ్వు మా రాముడికి సరి పోతావులే అనుకున్నాను. కానీ వాడి భార్యకు ఉండాల్సిన ఒక్క లక్షణమైనా కూడా నీలో లేదు. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా మొదలు పెట్టిన పూజ ఇలా ఆగిపోలేదు కానీ ఈరోజు నీ కారణంగా ఇంట్లో పూజ ఆగిపోయింది అంటూ మైరావతి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. ఇక ఆమె జానకి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X