For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu November 17th: అఖిల్ కోసం కేసు వెనక్కి తీసుకున్న జానకి.. మరో షాకింగ్ ట్విస్ట్

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. రామచంద్ర తమ్ముడు అఖిల్ తన స్నేహితురాలు మాధురి పై హత్యాయత్నం చేస్తాడు. అయితే ఆ ఘటనను జానకి చూస్తుంది. అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ మాధురికి కనిపించడంతో ఆమె ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా మీ ఇంట్లో ఈ విషయం చెబుతాను అని కూడా అంటుంది.

    దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న అఖిల్ అనుకోకుండా ఒక కర్ర తీసుకొని కొడతాడు. దాంతో రక్తపు మడుగులో మునిగిపోయిన మాధురిని జానకి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 434 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    కేసు నమోదు చేయడంతో

    కేసు నమోదు చేయడంతో

    రామచంద్ర తమ్ముడు అఖిల్ హత్యాయత్నం చేసినందుకు జానకి అతనిపై కేసు నమోదు చేయడంతో ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎంతగానో ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే తాను ఏ నేరం చేయలేదు అని అనవసరంగా వదిన తనపై కేసు పెట్టింది అని అఖిల్ ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటాడు. ఇక ఆ విషయాలను ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతారు.

    కానీ జానకి మాత్రం అఖిల్ కారణంగా ఒక అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉండడంతో ఆమె కు న్యాయం చేయాలని ఆలోచిస్తుంది. అలా చేయకపోతే తన ఐపిఎస్ చదువుకు ఏ మాత్రం అర్థం ఉండదు అని ఈ విషయంలో కుటుంబ పరంగా ఆలోచించకూడదు అని ఒక న్యాయం కోసం మాత్రమే ఆలోచించాలి అని అనుకుంటుంది.

    అమ్మాయికి అన్యాయం చేయలేను

    అమ్మాయికి అన్యాయం చేయలేను

    అయితే జానకి పొరపాటున చూసి ఉండవచ్చు అని రామచంద్ర ఆమెను అనుమానిస్తూ ఉంటాడు. అసలు అఖిల్ కాకపోవచ్చు అని మీరు పొరబడి ఉండవచ్చు అని అతను పదేపదే చెబుతూ ఉంటాడు. అందుకే కేసు వెనక్కి తీసుకోవాలి అని ఎన్నోసార్లు చెబుతాడు. అయితే జానకి మాత్రం ఆ విషయంలో మొదట కేసు వెనక్కి తీసుకునేది లేదు అని ఒక అమ్మాయికి అన్యాయం చేయలేను అని చెబుతోంది. అయితే ఇంట్లో పరిస్థితులు మాత్రం మరింత దీనంగా మారిపోతూ ఉంటాయి.

    రామచంద్ర షరతు

    రామచంద్ర షరతు

    రామచంద్ర ఒకసారి ఇంట్లో వాళ్ల పరిస్థితిని గమనిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తండ్రి గోవిందరాజులు కూడా కంటతడి పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు అఖిల్ భార్య జెస్సి తన భర్త ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక తల్లి జ్ఞానాంబ కూడా ఏమీ చేయలేని విధంగా ఒంటరిగా కూర్చుండిపోతుంది.

    ఇక వీరందరి పరిస్థితిని చూసిన రామచంద్ర మళ్ళి వెంటనే జానకి దగ్గరికి వెళతాడు. కానీ గదిలో జానకి ఉండదు. అయితే ముందు రోజు మాత్రం రేపు 10 గంటల లోపు మీ నిర్ణయం చెప్పాలి అని రామచంద్ర షరతు విధిస్తాడు. ఇక జానకి అనుకున్నట్లుగా అదే సమయానికి వచ్చి అఖిల్ ను విడిపించడానికి నేను కేసు వెనక్కి తీసుకుంటాను అని చెబుతుంది.

     ఐపిఎస్ చదువును వదులుకోవాలని

    ఐపిఎస్ చదువును వదులుకోవాలని

    ఇక దాంతో రామచంద్ర ఒక్కసారిగా ఆనందంగా వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అని అనుకుంటాడు. ఇక జానకి అవునని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అయితే జానకి మాత్రం అఖిల్ ను విడిపిస్తున్నందుకు బాధపడుతూ తన ఐపిఎస్ చదువును వదులుకోవాలని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన తర్వాత అఖిల్ చూసి రామచంద్ర నిన్ను విడిపించడానికి వచ్చాము అని బేయిల్ ఇప్పిస్తామని అంటాడు. అంతేకాకుండా రామచంద్ర తో పాటు లాయర్ అలాగే జానకి కూడా వస్తుంది. అయితే అంతకుముందు జ్ఞానాంబ విరోధి సునంద దేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె కొడుకుకు విడుదల కాకూడదని రాకూడదని పోలీసులకు చెబుతుంది.

    అఖిల్ విడుదల

    ఇక ఎస్ఐ కూడా అదే తరహాలో ఆలోచించి ముందు కేసు పెట్టిన జానకి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. ఇక ఎఫ్ఐఆర్ నమోదయింది కాబట్టి ఇప్పుడు కేవలం బేయిల్ మాత్రమే ఇస్తామని ఆ తర్వాత కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది అని అందుకు సహకరించాలి అని కూడా కూడా చెబుతాడు. దీంతో అందుకు రామచంద్ర ఒప్పుకుంటాడు. ఇక జానకిని మాత్రం మరోసారి పోలీసులు నిజంగానే కేసు వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారా అని కూడా అడుగుతాడు. అందుకు జానకి ఒప్పుకుంటుంది.

     నిర్భయం మార్చుకున్న జానకి

    నిర్భయం మార్చుకున్న జానకి

    అయితే అప్పుడే తన మనసులో ఐపీఎస్ అవ్వడానికి చేసిన వాగ్దానం గుర్తుకు వస్తూ ఉంటుంది. కుటుంబ భేదాలు చూపను అని న్యాయం కోసం కృషి చేస్తానని ప్రమాణం చేసిన విషయాలు గుర్తుకు వస్తాయి. ఇక చేసేదేమీ లేక జానకి తన నిర్ణయం మార్చుకుంటుంది. ఇక అఖిల్ ఎట్టకేలకు ఇంటికి వస్తాడు. దీంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే జానకి మాత్రం చదువును పూర్తిగా వదిలేస్తుంది. కానీ వదిలేస్తున్నట్లు కనిపించదు. రామ మాత్రం ఆమెను కాలేజ్ కు వెళ్ళమని చెబుతూ ఉంటాడు. మరి ఈ పరిస్థితులలో జానకి తన ఐపీఎస్ చదువు విషయంలో మళ్ళీ ఏ విధంగా నిర్ణయాన్ని మార్చుకుంటుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 434
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X