For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 18th: నిమిషం ఆలస్యానికి మైరావతి వీరంగం.. జ్ఞానాంబ రివర్స్ కౌంటర్

  |

  జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్స్ అందుకోవడంలో మెల్లగా టాప్ లిస్టులోకి చేరుకుంటోంది. గత రెండు వారాలతో ఫాలొస్తే ప్రస్తుతం ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇక
  ఐపీఎస్ కావాలని అనుకునే జానకి కట్టుబాట్ల మధ్యలో ఎలాంటి ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకుంది అనేది ఈ సీరియల్ లో ప్రధాన అంశం. భర్త సహకారంతో ఎలాగైనా ఐపీఎస్ పరీక్షలో పాస్ కావాలని అనుకుంటుంది.

  జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్ లో కూడా తన సత్తా చాటుతోంది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 43వ వారంలో 8.96 రేటింగ్ రాగా, 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. రామ జానకి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు ప్రసారం కాబోయే 174 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

  అహంకారాన్ని చుపిస్తే..

  అహంకారాన్ని చుపిస్తే..

  జ్ఞానాంబకు చదువుకున్న కోడలు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇక అలాంటి అత్తను కాదని కోడలు ఎలా తన కలను నెరవేర్చుకుంది అనే పాయింట్ తో సీరియల్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. సీరియల్ మొదట్లో ఈ సీరియల్ అంతగా ఆకట్టుకోలేదు. ఇక జానకి చదువు గురించి తెలియగనే కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

  ఇక జానకి అహంకారాన్ని చుపిస్తే తన కొడుకు జీవితం ఏమవుతుందో అని జ్ఞానాంబ భయంతో ఉంటుంది. గతంలో తన తమ్ముడు చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఆందోళనలో ఉన్న జ్ఞానాంబ జానకి కూడా అదే తరహాలో ఉంటే తన కొడుకు కూడా ఏదైనా జరుగుతుందేమో అని తల్లిగా ఆలోచిస్తూ భయపడుతుంది.

  ఎంత రెచ్చగొట్టినా..

  ఎంత రెచ్చగొట్టినా..

  అయితే జానకి ఆలోచనలు పద్ధతి మాత్రం బాగానే ఉంటాయి. కానీ ఆ విషయంలో రిస్క్ తీసుకోలేక జ్ఞానాంబ సందిగ్ధంలో పడింది. అందుకే తన అత్త గారు అయినటువంటి మైరావతి సలహా తీసుకుంటుంది. మైరావతి రోజురోజుకు జానకి గురించి తెలుసుకోవడానికి అనేక రకాల పరీక్షలు పెడుతుంది. అంతే కాకుండా ఆమె సహనాన్ని కూడా టెస్ట్ చేస్తుంది. మైరావతి తనవైపు నుంచి ఎంత రెచ్చగొట్టినా కూడా జానకి ఏ మాత్రం అదుపు తప్పదు. పెద్దలంటే గౌరవం అనే విధంగానే మాట్లాడుతుంది.

  పూజకు సమయానికి రావాలని..

  పూజకు సమయానికి రావాలని..

  జానకి సాంప్రదాయాలను పద్ధతులను ఏవిధంగా పాటిస్తుందో తెలుసుకోవడానికి మైరావతి కావాలని ఒక పరీక్ష పెడుతుంది. దీపావళి సందర్భంగా ఇంట్లో లక్ష్మి పూజ చేయాలని, అసలైతే పెళ్లైన కొత్తలోనే లక్ష్మీ పూజ చేయాలని చెప్పిన మైరావతి అప్పుడు కుదరలేదు అని అందుకే ఇప్పుడు చేస్తున్నట్లు చెబుతుంది.

  ఇక రామచంద్ర తో అనుకున్న సమయానికి పూజలో వచ్చి కూర్చోవాలని జానకిని హెచ్చరిస్తుంది. అయితే పూజ కోసం ప్రత్యేకంగా చీర కూడా ఇస్తుంది. కానీ జానకి చీర కట్టుకోవడంలో ఆలస్యం చేస్తుంది. అంతే కాకుండా జాకెట్ హుక్స్ కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వలన ఆమె మరింత ఆలస్యం చేస్తుంది.

  మరోసారి రామ సహాయం

  మరోసారి రామ సహాయం

  పూజలో కూర్చున్న జానకి ఎంతసేపటికీ రాకపోవడంతో మైరావతి ఆగ్రహంతో ఉంటుంది. పెద్దలంటే గౌరవంతో ఉంటుందని కదా మరి ఇప్పుడు ఏమంటావు అని జ్ఞానాంబను మైరావతి ప్రశ్నిస్తుంది. దీంతో జ్ఞానాంబ కూడా ఆలోచనలో పడుతుంది. అసలు జానకి ఇంతవరకు ఎప్పుడూ ఈ విధంగా ఆలస్యం చేయలేదు అలాంటిది ఏం జరిగి ఉంటుందో అని కంగారు పడుతుంది.

  ఆ సమయంలోనే రామచంద్ర కాస్త దగ్గుగా ఉందని నీళ్లు తాగి వస్తానని లోపలికి వెళతాడు. ఆ వంక తోనే జానకి ఎక్కడ ఉందో చూస్తాడు. గదిలోకి వెళ్లి చూడగా జానకి ఇంకా సరిగ్గా చీర కట్టుకోకోకుండా ఇబ్బంది పడుతుంది. వెంటనే రావాలని చెబుతాడు. అయితే ఎవరినైనా పిలవండి జాకెట్ హుక్స్ పెట్టడానికి అని జానకి కోరడంతో నేను పెడతాను అంటూ రామచంద్ర సమాధానమిస్తాడు. జానకి కాస్త సిగ్గు పడినప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

  ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో..

  ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో..

  ఆ తర్వాత తొందరగా వచ్చేయండి అంటూ రామచంద్ర ముందుగా వెళ్ళిపోతాడు ఇక జానకి పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో కాలికి దెబ్బ కూడా తగులుతుంది. ఇక ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో మైరావతి జానకి పై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నీకు పెద్దలు అంటే ఏమాత్రం గౌరవం లేదు అని సరిగ్గా సమయానికి రావడం తెలియదు అంటూ అనేక రకాలుగా నిందిస్తుంది. ఇక ఆలస్యంగా వస్తే పూజా ఆపేస్తాను అని ముందే చెప్పాను కదా ఇప్పుడు నిజంగానే ఆపేస్తున్నాను అంటూ మైరావతి లేచి వెళ్ళి పోతుంది.

  జానకి జరిగిన విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పటికీ కూడా మైరావతి ఏ మాత్రం పట్టించుకోదు. ఇక ఆ తర్వాత ఎందుకు ఆలస్యం అయ్యిందనే క్రమంలో గోవిందరాజులు అడుగుతూ ఉండగా జానకి కాలికి రక్తం వస్తుండటం గమనిస్తాడు. దీంతో జ్ఞానాంబ మైరావతిని బ్రతిమాలి పూజ మొదలు పెట్టాలని అనుకుంటుంది. అయినప్పటికీ మైరావతి ఏమాత్రం ఒప్పుకోదు. ఇక మైరావతి మాటను కాదని జ్ఞానాంబ పూజను మళ్ళీ మొదలు పెడుతుంది. మరి ఈ పరిణామాలు జానకి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

  45వ వారంలో జానకి కలగనలేదు రేటింగ్

  45వ వారంలో జానకి కలగనలేదు రేటింగ్

  జానకి కలగనలేదు సీరియల్ విషయానికి వస్తే.. 44వ వారంలో అర్బన్ ప్రాంతంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకోగా, 45వ వారంలో 8.64 రేటింగ్‌ను సాధించింది. అలాగే రూరల్ ప్రాంతానికి వస్తే.. 44వ వారంలో 8.25 రేటింగ్‌ను నమోదు చేయగా.. 45వ వారంలో 9.27 రేటింగ్‌ను సాధించింది. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్‌ నిలకడగా రేటింగ్‌ను సాధించడం గమనార్హం.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 174
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X