For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 19th: మైరావతి మొండిపట్టు.. జానకి చెంప పగలగొట్టాలని ఆదేశం!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రేటింగ్స్ అందుకోవడంలో ఇతర సీరియల్స్ కు పోటీగా నిలుస్తోంది. గత రెండు వారాలతో ఫాలొస్తే ప్రస్తుతం ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలని అనుకునే జానకి కుటుంబ కట్టుబాట్ల మధ్యలో ఎలాంటి ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకుంది అనే పాయింట్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక భర్త సహకారంతో ఎలాగైనా ఐపీఎస్ పరీక్షలో పాస్ కావాలని అనుకుంటుంది. ఇక 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతానికి వస్తే.. 43వ వారంలో 8.96 రేటింగ్ రాగా, 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 175 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   జ్ఞానాంబ కంగారు..

  జ్ఞానాంబ కంగారు..

  చదువుకున్న అమ్మాయి కోడలిగా తీసుకురావద్దని జ్ఞానాంబ ఎంతగానో ఆలోచించి రామచంద్రకు జానకినిచ్చి పెళ్ళి చేస్తుంది. అయితే ఇటీవల జానకి చదువుకుంది డిగ్రీ అని తెలియగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. గతంలో చదువుకున్న అమ్మాయి కారణంగా తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఇప్పుడు తన కొడుకు కూడా చదువుకున్న అమ్మాయి కారణంగా అహంకారం చూపిస్తే మళ్లీ ఏదైనా ప్రమాదం జరుగుతుందో ఏమో అని కంగారు పడుతుంది. అయితే జానకి గుణగణాలు తెలిసిన జ్ఞానాంబ తన కోడలి అలాంటి తప్పు చేయదు అని అవగాహన ఉన్నప్పటికీ ఎందుకో ప్రశాంతంగా ఉండదు. భర్త సలహా మేరకు అత్తయ్య మైరావతి సలహా తీసుకోవాలని అనుకుంటుంది.

   జానకి ఆలస్యం కారణంగా

  జానకి ఆలస్యం కారణంగా

  మైరావతి వద్దకు తీసుకు వెళ్ళిన తర్వాత ఆమె జానకి ఓపికను అనేక రకాలుగా పరీక్షిస్తుంది. జానకిని ఎంత తిట్టినా కూడా ఓర్పుతోనే సమాధానం చెబుతూ ఉంటుంది. జ్ఞానాంబ గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషిస్తారు. తప్పకుండా మన కోడలు మంచి ఇల్లలుగా గుర్తింపు అందుకుంటుందని అనుకుంటారు. అయితే అనుకోని విధంగా మైరావతి పూజకు సరైన సమయానికి రావాలని చెప్పినప్పటికీ జానకి ఒక్క నిమిషం ఆలస్యంగా వస్తుంది. ఇక జానకి ఆలస్యం కారణంగా మైరావతి పూజను ఆపేస్తుంది.

   పూజ జరగవద్దని మొండిపట్టు

  పూజ జరగవద్దని మొండిపట్టు

  హఠాత్తుగా పూజను మధ్యలో ఆపేస్తే ఇంటికి ఏ మాత్రం మంచిది కాదు అని జ్ఞానాంబ తన సలహా కూడా ఇస్తుంది. ఈ ఇంటి కోడలిగా పూజ సరైన క్రమంలోనే పూర్తిచేయాల్సిన బాధ్యత తనకు ఉందని జానకి కాలికి దెబ్బ తగలడం వల్ల అనే ఒక నిమిషం ఆలస్యంగా వచ్చింది అని మైరావతికి అర్థమయ్యేలా జ్ఞానాంబ చెబుతుంది. కానీ జ్ఞానాంబ ఎంత చెప్పినా కూడా మైరావతి పట్టించుకోదు. తన మాటే శాసనం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో ఎలాంటి మార్పు ఉండదు అని హెచ్చరిక చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ జరగకూడదు అంటూ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

  మైరావతిని ఎదిరించిన జ్ఞానాంబ

  మైరావతిని ఎదిరించిన జ్ఞానాంబ

  అయితే మైరావతి అలా చెప్పినప్పటికీ కూడా జ్ఞానాంబ ఏమాత్రం బెదరకుండా ఎదిరించి పూజ చేయడానికి నిర్ణయం తీసుకుంటుంది. మీ ఇంటి కోడలిగా పూజ పూర్తి చేయడం తన బాధ్యత అంటూ కొడుకు కోడల్ని పూజ దగ్గర కూర్చోబెడుతుంది. అయితే మైరావతి మాత్రం పూజ మధ్యలో వచ్చి బాధపడుతూ ఉంటుంది. తన మాటను లెక్క చేయకుండా పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని రామచంద్రను కూడా బ్రతిమాలుతుంది. ఇక రామచంద్ర తల్లి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఇష్టం లేక ఇంటి కోసం ఈ పూజను పూర్తి చేయాలి అని నువ్వు కూడా వచ్చి కూర్చోవాలని మైరావతిని ప్రాధేయపడతాడు. కానీ ఆమె మొండితనంతో పూజకు రాకుండా లోపల తలుపులు వేసుకుంటుంది.

  జానకిపై మైరావతి కోపం..

  జానకిపై మైరావతి కోపం..

  ఇక పూజ ముగించిన అనంతరం మైరావతి ఆశీర్వాదం తీసుకోవాలి అనే జానకిని అలాగే రామచంద్ర లను ఆదేశిస్తుంది. కానీ మైరావతి వారిని ఆశీర్వదించడానికి ఏమాత్రం ఒప్పుకోదు. తన మాట లెక్క చేయకుండా పూజలు జరిపించి ఇప్పుడు నా ముందుకు ఎలా వస్తారు అని గట్టిగానే ప్రశ్నిస్తుంది. అయినప్పటికీ జ్ఞానాంబ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇద్దరిని వెళ్లి ఆశీర్వాదం తీసుకోమని చెబుతుంది. ఇక జానకి కూడా మైరావతికి అర్థమయ్యేలా పరిస్థితి గురించి చెప్పాలని అనుకుంటుంది. కానీ జానకి మాటలు వినడానికి ఆమె ఏ మాత్రం ఇష్టపడదు. నిన్ను చూస్తే నాకు చాలా కోపంగా ఉంది అంటూ నా ముందుకు రావద్దు అని అంటుంది.

  NBK107: Nandamuri Balakrishna's Next Grand Launch
   జానకి చెంప పగలగొట్టాలి

  జానకి చెంప పగలగొట్టాలి

  మైరావతి ఎంత కోప్పడినా కూడా జానకి మాత్రం నిదానంగా సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇక మైరావతి తనలోని ఆగ్రహాన్ని తగ్గించుకోవడానికి మామిడి కాయలను కట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన జ్ఞానాంబ మైరావతిని శాంతింప చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత రామచంద్ర ను ఒక పని చేయాలి అని కూడా మైరావతి ఆదేశిస్తుంది. నీ కోసం ఏదైనా చేస్తాను నానమ్మ అంటూ రామచంద్ర చెప్పడంతో జానకి చెంప పగలగొట్టాలి అని మైరావతి ఆదేశిస్తుంది.. మరి నానమ్మ నిర్ణయాన్ని రామచంద్ర ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 175
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X