For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 1st: రామచంద్ర కోసం యాక్షన్ లోకి జ్ఞానాంబ.. జానకిపై కోపం

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు వీక్షకుల సంఖ్యను ఎంతగానో పెంచుకుంటోంది. మొదలైనప్పుడు ఈ సీరియల్ అంతగా ఆకట్టుకోవడం లేదని కామెంట్స్ వచ్చాయి. అయితే మెల్లగా అసలు కథ ట్రాక్ లోకి వచ్చిన అనంతరం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం కుటుంబ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నేటితరం యువతను కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రామ జానకి మధ్యలో వచ్చే లవ్ స్టొరీ మంచి ఎమోషన్స్ తో హైలెట్ గా నిలుస్తోంది. రొటీన్ కథల తరహాలో కాకుండా కాస్త భిన్నమైన ఎమోషన్ ను హైలెట్ చేస్తున్నారు. భర్త సహకారంతో ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన కలను ఏ విధంగా నెరవేర్చుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇంట్లో అత్తగారికి తెలియకుండా ఐపీఎస్ అవ్వాలని కలలు కంటుంది. కానీ జానకి 5వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు అనుకున్న జ్ఞానాంబకు ఆమె డిగ్రీ చదివినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఇక జానకి, రామ ఇద్దరు కూడా మోసం చేసినట్లు తెలియగానే వారితో మాట్లాడడం మనేస్తుంది. అంతే కాకుండా జానకి మరొక విడాకుల కండిషన్ పెట్టడంతో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఇక జానకిని బయటకు పంపించాలని అనుకున్న మల్లికకు మరొక షాక్ తగులుతుంది. నేడు ప్రసారం కాబోయే 160వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  జానకి చదువు విషయంలో మోసం

  జానకి చదువు విషయంలో మోసం

  జానకిని ఐపీఎస్ చదివించాలని రామచంద్ర ఎన్నో కలలు కంటాడు. అయితే జ్ఞానాంబ మాత్రం చదువుకోలేని కొడుకు కోసం, చదువులేని అమ్మాయిని తీసుకురావాలని ఎన్నో కలలు కని జానకిని ఇచ్చి పెళ్లి చేస్తుంది. జానకి ఇంట్లో వారు కూడా తను కేవలం ఐదవ తరగతి మాత్రమే చదివినట్లు అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారు. ఇక చదువుకున్న అమ్మాయి కారణంగా తమ్ముడు చనిపోవడంతో మళ్లీ అదే ఘటన కొడుకు జీవితంలో జరగకూడదు అనే జ్ఞానాంబ జానకిని ఇచ్చి పెళ్లి చేస్తుంది. కానీ జానకి చదివింది 5వ తరగతి కాదు డిగ్రీ పూర్తి చేసింది అని తెలియడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురవుతుంది. అంతేకాకుండా కొడుకు కూడా తన దగ్గర నిజం దాచడంతో ఇద్దరిని దూరం పెడుతుంది.

  ఊరంతా తెలిసిన నిజం

  ఊరంతా తెలిసిన నిజం


  జ్ఞానంబ కొడుకును అల్లుడిగా చేసుకోవాలని గతంలో చాలా మంది ఇంటికి వచ్చారు. అయితే తప్పుడు పదవ తరగతి చదువుకున్న కోడలు కూడా తనకు అవసరం లేదని జ్ఞానాంబ చాలెంజ్ చేసింది. తప్పకుండా తన కొడుకు కోసం చదువుకోలేని అమ్మాయిని మాత్రమే తీసుకువస్తానని చెప్పింది. లీలావతి కూడా గతంలో జ్ఞానాంబ హెచ్చరికలు జారీ చేస్తుంది. నీ కూతురు పదవ తరగతి చదువుకుంది. అందుకే నా కొడుకుని ఇచ్చి పెళ్లి చేయలేను అని మొహం మీద చెప్పేస్తుంది. అయితే ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ లీలావతి ఎత్తి పొడుస్తుంది.
  ఇక మొత్తానికి జానకి చదివింది 5వ తరగతి కాదు డిగ్రీ చదువుకుంది అనే ఊరంతా తెలియడంలో మల్లిక కీలక పాత్ర పోషిస్తుంది.

  కోడలిని ఇంటి నుంచి పంపేస్తావా?

  కోడలిని ఇంటి నుంచి పంపేస్తావా?

  జానకి చదువు విషయాన్ని లీలావతికి చెప్పడంతో ఆమె ఇంటికి వచ్చి జ్ఞానాంబ మరింత ఆలోచనలో పడేస్తుంది. ఇప్పుడు జరిగిన పొరపాటు కారణంగా కోడలి ఇంట్లో నుంచి పంపిస్తావా అంటూ గట్టిగానే ప్రశ్నిస్తుంది. కానీ అందుకు జ్ఞానాంబ తన కుటుంబ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అంటూ మరొకసారి వార్నింగ్ ఇస్తుంది. అంతేకాకుండా కొడుకు విషయంలో కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తనను ఇక నుంచి తనను అమ్మ అని పిలువ కూడదా అని ఒట్టు పెట్టుకుంది.

  మళ్ళీ పరువు తీయకండి

  మళ్ళీ పరువు తీయకండి

  ఇక తల్లితో మాట్లాడ లేని పరిస్థితుల్లో ఉన్న రామచంద్ర తీవ్రస్థాయిలో మనోవేదనకు గురవుతాడు. అతను స్వీట్ షాప్ లో కూడా సరిగా పని చేయడు. జానకి, జ్ఞానాంబ మధ్య మరింత దూరం పెంచాలి అని మల్లిక మరో గొడవ పెడుతుంది. కిచెన్ లో వంట చేసే సమయంలో జానకితో గొడవ పడుతుంది. జ్ఞానాంబ వస్తున్న విషయాన్ని పసిగట్టి కావాలని లేనిపోని మాటలు ఎందుకు అంటున్నావు అంటూ.. ఎక్కువగా చదువుకున్న అహంకారాన్ని కూడా చూపిస్తున్నావు అని తప్పుగా మాట్లాడుతుంది. ఆ మాటలకి జానకి నేను ఎప్పుడు అన్నాను అని ఆశ్చరపోతుంది. ఇక జ్ఞానాంబ నిజానిజాలు తెలుసుకోకుండా ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అందరి ముందు తలదించుకునేలా చేశారు. మళ్లీ తన పరువు తీయకండి అని జ్ఞానాంబ హెచ్చరిస్తుంది.

  Recommended Video

  Comedian Sudarshan About Manchi Rojulochaie | Santosh Shobhan | Part 03
  రామచంద్ర కోసం యాక్షన్ లోకి జ్ఞానాంబ

  రామచంద్ర కోసం యాక్షన్ లోకి జ్ఞానాంబ

  ఇక రామచంద్ర బాధ పడుతున్న విషయాన్ని రజని జ్ఞానాంబకు చెబుతాడు. మళ్లీ నువ్వు రామ అన్న తో మాట్లాడాలి అని బాధపడుతూ ఉంటాడు. అయితే అందుకు రాశి మాత్రం ఈ అమ్మ అంటే అంతగా ఇష్టమైనప్పుడు అబద్దాలు చెప్పడం ఎందుకు అని అడుగుతుంది. అయితే రజనీ మాత్రం ఏం జరిగిందో తనకు తెలియదు అంటూ నువ్వు మాత్రం అన్న తో మాట్లాడకపోతే పిచ్చోడు అయ్యేర్లా ఉన్నాడు అని వివరిస్తాడు. రజని మాటలకు జ్ఞానాంబ ఎంతగానో బాధపడి లోపలికి వెళుతుంది. మరో వైపు జానకి ఆ పరిస్థితిని చూసి ఎంతగానో బాధపడుతుంది. ఇక చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చిన రామచంద్ర రీసెంట్ గా వచ్చిన ఆర్డరును క్యాన్సిల్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి రామచంద్ర చొక్కా పట్టుకొని అడుగుతాడు. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన జ్ఞానాంబ ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు చొక్కా పట్టుకుంటావు అని హెచ్చరిక చేస్తుంది. మరి జ్ఞానాంబ కొడుకు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

  English summary
  Janaki Kalaganaledu Today Episode 161:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X