For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 21st: జానకి చదువు విషయంలో రామ సందేహాలు.. మరో షాకింగ్ ట్విస్ట్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరమైన ట్విస్ట్ లతో కొనసాగుతోంది. రామచంద్ర తమ్ముడు అఖిల్ తన స్నేహితురాలు మాధురి పై హత్యాయత్నం చేస్తాడు. అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ మాధురికి కనిపించడంతో ఆమె ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా మీ ఇంట్లో ఈ విషయం చెబుతాను అని కూడా అంటుంది.

  దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న అఖిల్ అనుకోకుండా ఒక కర్ర తీసుకొని కొడతాడు. దాంతో రక్తపు మడుగులో మునిగిపోయిన మాధురిని జానకి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 436 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  చావు బ్రతుకుల మధ్య

  చావు బ్రతుకుల మధ్య

  రామచంద్ర చిన్న తమ్ముడు అఖిల్ హత్యాయత్నం చేశాడు అని అతని కారణంగా మాధురి హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉంది అని జానకి అఖిల్ పై పోలీస్ కేసు పెడుతుంది. అయితే అఖిల్ అలాంటి తప్పు చేయడు అని ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకుంటారు. అఖిల్ కూడా ఆ విధంగా నమ్మిస్తాడు. కానీ జానకి ఎంత చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోరు.

  అసలే ఐపీఎస్ కావాలని అనుకుంటున్న జానకి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అని, బంధువు అయినా ఎవరైనా సరే అని క్షమించకూడదు అని అనుకుంటుంది. అయితే ఇంట్లో వాళ్ళు జానకి పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా బాధలో ఉంటారు దీంతో జానకి ఏమి చేయలేని పరిస్థితిలో అఖిల్ ను విడిపించడానికి ఒప్పుకుంటుంది.

  మళ్ళీ చదువుకోవద్దని

  మళ్ళీ చదువుకోవద్దని

  అయితే బేయిల్ తో అఖిల్ విడిపించిన తర్వాత జానకి ఐపిఎస్ చదువును ఇక చదవకూడదు అని, అన్యాయం చేసిన వాడికి బెయిల్ ఇప్పించిన కారణంగా ఐపీఎస్ చదివి కూడా వృధా ఉండదు అని జానకి అనుకుంటుంది. అందుకే ఐపీఎస్ పుస్తకాలను కూడా ఆమె పక్కన పెట్టేస్తుంది.

  ఇక రామచంద్ర మాత్రం మళ్ళీ జానకి చదువుకుంటుంది అని ఆలోచనతో ఉంటాడు. కానీ జానకిని అడిగిన ప్రతిసారి ఆమె ఏదో ఒక మాట చెప్పి ఆ విషయాన్ని దాటవేస్తుంది. ఐపీఎస్ చదువును ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించకూడదు అని ఆలోచనతోనే ఉంటుంది.

  జెస్సికి సపోర్ట్ గా జానకి

  జెస్సికి సపోర్ట్ గా జానకి

  అంతేకాకుండా జానకి ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉండాలని అనుకుంటుంది. ఇక అఖిల్ భార్య జెస్సి గర్భవతిగా ఉందని ఆమెకు సేవ చేయాలని అనుకుంటుంది. అయితే జెస్సికి టిఫిన్ ఇవ్వబోతుంటే ఆమె కింద పడే ప్రమాదం ఉంది. ఇక వెంటనే జానకి ఆమెను పట్టుకొని వేరే పనులు చేయవద్దు అని నేను చూసుకుంటాను అని నీకు ఏమీ అవసరం ఉన్న నన్ను పిలవాలి అని జానకి భరోసా ఇస్తుంది.

  ఇక మరోవైపు అఖిల్ కూడా తన భార్య జెస్సి పై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు. ఇక జెస్సికి అప్పుడే తన ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు మేము ఒకరోజు ఇంటికి రావాలని అడుగుతారు. వద్దు అని మేమే ఒక రోజు ఇంటికి వస్తాము అని జెస్సి తన తండ్రికి చెబుతుంది.

  లడ్డులు చేయాలని..

  లడ్డులు చేయాలని..

  ఇక రామచంద్రను పిలిచిన జ్ఞానాంబ లడ్డులు చేయాలని ఒక ఆర్డర్ వచ్చింది అని రేపటికల్లా ఒక వెయ్యి మందికి సరిపడా లడ్డులు కావాలి అని చెప్పడంతో రామచంద్ర అంత తక్కువ సమయంలో లడ్డులు చేయడం చాలా కష్టమని అంటాడు. అయితే జానకి మాత్రం ఎందుకు కుదరదు అని అందరం కలిసి చేస్తే ఆర్డర్ తీసుకోవచ్చు అని చెబుతుంది.

  దీంతో రామచంద్ర మీకు కాలేజ్ ఉంది కదా అని అంటాడు. నేను ఖాళీ సమయంలో చేస్తాను అని ఈరోజు కాలేజీకి కొంత ఆలస్యంగా వెళ్తాను అని జానకి చెబుతుంది. ఇక జానకి మాటలకు గోవిందరాజులు కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఇక మల్లిక కూడా నేను కూడా చేస్తాను అని చెబుతుంది.

  జానకి, రామ.. చదువు గొడవ

  అయితే జానకి నిజంగానే కాలేజీకి వెళుతుందా లేదా అనే విషయం తెలుసుకోవాలి అని రామచంద్ర కాలేజ్ కి వెళతాడు. అక్కడ జానకి స్నేహితులు అని అడిగే ప్రయత్నం చేస్తాడు. జానకి కాలేజీకి వచ్చిందా లేదా అని అడిగితే వాళ్ళు ఈరోజు రాలేదు అని అనడంతో మళ్లీ వెంటనే రామచంద్ర ఇంటికి వస్తాడు. ఇక మరోవైపు మల్లికకు నిలావతి ఫోన్ చేస్తుంది.

  అసలు విషయం ఇంట్లో తెలిసిందేమో అని కంగారుగా ఉంది నీ దొంగ ప్రెగ్నెన్సీ గురించి జానకి కనిపెట్టిందేమో అని ఆమె హెచ్చరిక చేస్తుంది. అయితే ఆమె అనవసరంగా టెన్షన్ పడుతుంది అని మల్లికా ఎంత మాత్రం తెలియలేదు అని చెబుతోంది. పగ తీర్చుకోవాలని అనుకున్నా మల్లిక అనవసరంగా దొంగ ప్రెగ్నెన్సీ విషయం తెలియడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది.

  ఇక మరోవైపు రామచంద్ర జానకి అసలు చదువు గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని అడుగుతుంది. నేను చదవాలని అనుకోవడం లేదు అని జానకి సమాధానం ఇస్తుంది. మరి వారి మధ్య మాటల సంఘర్షణ ఎలాంటి నిర్ణయాలకు దారితీస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 436
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X